జాతీయ రహదారి 1

జమ్మూ కాశ్మీర్, లడఖ్ ల మధ్య నడిచే జాతీయ రహదారి

జాతీయ రహదారి 1 (ఎన్‌హెచ్ 1) జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాల మధ్య నడిచే జాతీయ రహదారి. ఇది పాత ఎన్‌హెచ్1A, ఎన్‌హెచ్1D ల లోని కొన్ని భాగాలను కలిగి ఉంటుంది.[1][2] కొత్త సంఖ్యా పద్ధతి ప్రకారం,[2] సంఖ్య 1 అనేది భారతదేశంలో ఉత్తర కొసన ఉన్న తూర్పు-పశ్చిమ రహదారి అని సూచిస్తుంది.

Indian National Highway 1
1
National Highway 1
National Highway 1D India.JPG
హిమాలయాల్లో ఎన్‌హెచ్ 1
మార్గ సమాచారం
నిర్వహిస్తున్న సంస్థ సరిహద్దు రహదారుల సంస్థ
పొడవు534 కి.మీ. (332 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
East చివర ఎన్‌హెచ్ 3, లేహ్
Major intersections
West చివరLua error in మాడ్యూల్:Jct at line 204: attempt to concatenate local 'link' (a boolean value)., Hattian Bala
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుజమ్మూ కాశ్మీర్, లడఖ్
ప్రాథమిక గమ్యస్థానాలుబారాముల్లా, శ్రీనగర్, కార్గిల్
రహదారి వ్యవస్థ
ఎన్‌హెచ్ 87 ఎన్‌హెచ్ 301
భారతదేశంలోని జాతీయ రహదారుల స్కీమాటిక్ మ్యాప్

చరిత్ర

మార్చు

కాశ్మీర్ లోయలోని శ్రీనగర్, లడఖ్‌ లోని లేహ్ మధ్య మార్గం మధ్యయుగ కాలం నుండి ఉంది. ఇది అనేక శతాబ్దాలుగా ఇదే ప్రధాన వాణిజ్య మార్గం. ఇది హిమాలయన్ శ్రేణిలో 3,528 మీటర్లు (11,575 అ.) ఎత్తున ఉన్న జోజి లా పాస్ గుండా వెళ్తుంది. ఇది సగం సంవత్సరం పాటు మంచుతో కప్పబడి ఉంటుంది.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం 1954లో ఈ మార్గంలో మోటారు వాహనాలు నడవగల రహదారిని నిర్మించడం ప్రారంభించింది.[3] 1958లో కాంట్రాక్టర్లు, ఇంజనీర్ల అవినీతిని గుర్తించడంతో నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపివేసి విచారణ ప్రారంభించారు.[3][4] 1960లో, భారత ప్రభుత్వం, వ్యూహాత్మక సరిహద్దు రోడ్ల బాధ్యతలను చేపట్టడానికి సరిహద్దు రహదారుల సంస్థ (BRO)ను ఏర్పాటు చేసాక, ఈ రహదారిని పూర్తి చేసే బాధ్యతను దానికి అప్పగించింది. లేహ్‌లో 'ప్రాజెక్ట్ బీకన్'ను ఏర్పాటు చేయడం ద్వారా, BRO 1962 ఆగష్టు నాటికి రహదారిని పూర్తి చేసింది. చైనాతో యుద్ధం మొదలవటానికి కొన్ని వారాల ముందు 1962 సెప్టెంబరు నాటికి దీనిని చుషుల్‌కు విస్తరించింది.[5]


జోజీ లా కనుమతో పాటు, ఈ రహదారి కార్గిల్, లేహ్ ల మధ్య లడఖ్ శ్రేణిని 4,108 మీటర్లు (13,478 అ.) ఎత్తున ఉన్న ఫోటు లా కనుమ గుండా దాటుతుంది. ఇది జోజి లా కంటే తక్కువగా మంచుతో కప్పబడి ఉంటుంది.

1999లో ద్రాస్, కార్గిల్ మధ్య పాకిస్తాన్ చొరబాటుదారులు హైవే లోని ఒక భాగంపై దాడి చేసారు. వారు నియంత్రణ రేఖకు భారతదేశం వైపున ఉన్న పర్వత శిఖరాలను ఆక్రమించి, హైవేపై షెల్‌లు విసిరారు. ఇది కార్గిల్ యుద్ధానికి దారితీసింది. భారత సైన్యం చివరికి చొరబాటుదారులను తరిమికొట్టడంతో పోరు ముగిసింది.

మార్గం వివరణ

మార్చు
 
లేహ్, లడఖ్ సమీపంలో జాతీయ రహదారి 1

ఎన్‌హెచ్ 1 యురి నుండి బారాముల్లా, శ్రీనగర్, సోనామార్గ్, జోజి లా, ద్రాస్, కార్గిల్, లేహ్ వరకు వెళుతుంది. ఈ మార్గం ఎత్తైన పర్వత మార్గాల గుండా వెళుతుంది. రహదారి చాలావరకు పర్వత ప్రాంతాల గుండా వెళ్తుంది. ఈ రహదారి లడఖ్ ప్రాంతానికి జీవనాడి. ప్రత్యామ్నాయ మార్గం, లేహ్-మనాలి హైవే ఉంది. అయితే ఇది మరింత ఎత్తైన పర్వత మార్గాలపైకి ఎక్కుతుంది. ఎన్‌హెచ్ 1 భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో వెళుతుంది.

ప్రధాన కూడళ్లు

మార్చు
DistrictLocationkm[6]MileDestinationsNotes
LehLeh0.00.0  ఎన్‌హెచ్ 3East end
KargilKargil217.4135.1  ఎన్‌హెచ్ 301
BudgamSrinagar431.4268.1  ఎన్‌హెచ్ 444
Srinagar445.1276.6  ఎన్‌హెచ్ 44old NH1A
BaramullaBaramulla510.3317.1  ఎన్‌హెచ్ 701A
510.6317.3  ఎన్‌హెచ్ 701
574.1356.7Lua error in మాడ్యూల్:Jct at line 204: attempt to concatenate local 'link' (a boolean value).West end
1.000 mi = 1.609 km; 1.000 km = 0.621 mi

ట్రాఫిక్

మార్చు

జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (JKSRTC) ఈ మార్గంలో శ్రీనగర్, లేహ్ ల మధ్య రెగ్యులర్ డీలక్స్, ఆర్డినరీ బస్సు సర్వీసులను నడుపుతోంది. కార్గిల్ వద్ద రాత్రిపూట ఆపివేస్తుంది. ప్రయాణం కోసం శ్రీనగర్‌లో టాక్సీలు (కార్లు, జీపులు) కూడా అందుబాటులో ఉన్నాయి.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "New National Highways notification - GOI" (PDF). The Gazette of India. Retrieved 10 June 2018.
  2. 2.0 2.1 "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 February 2016. Retrieved 3 April 2012.
  3. 3.0 3.1 Das 2021, p. 100.
  4. Kavic, Lorne J. (2021), India's Quest for Security: Defence Policies 1947-1965, Univ of California Press, p. 51, ISBN 978-0-520-33159-4
  5. Das 2021, pp. 101–102.
  6. "Google Maps".