బ్రహ్మరథం (1947 సినిమా)

(బ్రహ్మరధం (1947 సినిమా) నుండి దారిమార్పు చెందింది)

బ్రహ్మ రథం చిత్రపు నారాయణరావు దర్శకత్వం వహించిన 1947 నాటి తెలుగు చిత్రం. బలిజేపల్లి లక్ష్మీకాంతం రాసిన అదే పేరుతో వచ్చిన నవల ఆధారంగా దీన్ని రూపొందించారు.[1] శ్రీ వెంకట్రామ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో అద్దంకి శ్రీరామచంద్ర మూర్తి, సి.కృష్ణవేణి, జయమ్మ,పారుపల్లి సుబ్బారావు, కల్యాణం రఘురామయ్య ప్రథాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం మోతీబాబు సమకూర్చారు. ఈ చిత్రం1947 అక్టోబర్ 29 న విడుదలైంది.

బ్రహ్మరధం
(1947 తెలుగు సినిమా)
దర్శకత్వం చిత్రపు నారాయణమూర్తి
రచన బలిజేపల్లి లక్ష్మీకాంతం
తారాగణం బి.జయమ్మ,
సి.కృష్ణవేణి,
అద్దంకి శ్రీరామమూర్తి,
పారుపల్లి సుబ్బారావు,
ఏ.వి.సుబ్బారావు,
కళ్యాణం రఘురామయ్య,
కె.ఎస్.రంగనాయకులు,
కుంపట్ల,
వి.కోటీశ్వరరావు,
నాగమణి,
రామారావు,
టి.కనకం,
శ్రీరంజని,
చిట్టి,
కుమారి అనసూయ,
సౌదామిణి
సంగీతం మోతీబాబు
నృత్యాలు బోలానాధ్‌శర్మ,
వెంపటి సత్యం,
సౌదామిణి
గీతరచన కవితా కళానిధి
సంభాషణలు కవితా కళానిధి
కళ టి.వి.ఎస్.శర్మ
నిర్మాణ సంస్థ వెంకట్రామా పిక్చర్స్
భాష తెలుగు
మరొక పోస్టరు

తారాగణం

మార్చు

సాంకేతిక సిబ్బంది

మార్చు
  • దర్శకుడు: చిత్రపు నారాయణ మూర్తి
  • రచయిత: బలిజేపల్లి లక్ష్మీకాంతం
  • నిర్మాత: మీర్జాపురం మహారాజా
  • ఉత్పత్తి సంస్థ: వెంకటరామ ప్రొడక్షన్స్
  • నృత్య దర్శకుడు: వెంపటి సత్యం
  • కళ దర్శకత్వం: టీవీఎస్ శర్మ
  • సంగీత దర్శకుడు: మోతీ బాబు

పాటల జాబితా

మార్చు

పాటలు,పద్యాలు రచయత: బలిజేపల్లి లక్ష్మీకాంతం, కవితా కళానిధి.

1.బ్రోవవమ్మ దేవీ కల్యాణి నీవే కావే మాపాలి దైవతమ్ము, గానం.జయమ్మ

2.అలఘు స్థావర జంగమoబున బ్రహ్మాండoబు (పద్యం), గానం.అద్దంకి శ్రీరామమూర్తి

3.ఆహా జయంతి లలితకళా జీవంతి లావణ్యం, గానం.వి.కోటేశ్వరరావు

4.కనుమతడే పరమాత్మ అదోగతడే పరమాత్మ, రచన: ఆత్రేయ బృందం

5 . కర్మనిష్ఠుడు వాడే యోగి కర్మఫలం విడువాడే త్యాగి, గానం: అద్దంకి శ్రీరామమూర్తి

6 . జై జై జై తిరుమల నిలయా జై జై జై, గానం.బృందం

7.దేవ దేవా సుపర్వలోక సార్వభౌమా దివ్యతేజ, గానం.బృందం.

8 నళినీపత్ర తుషార బిందువులు కాంతా భార్యముల్(పద్యం), గానం.అద్దంకి శ్రీరామమూర్తి

9.నాడీ తాతలు తండ్రులున్ గురువులన్నల్ తమ్ములే మైరి (పద్యం), గానం.కె.రఘురామయ్య

10.నీవే నాదైవము అంబ నీవే నా దైవము దేవీ కాత్యాయనీ, గానం.జయమ్మ

11.పాండవ వీర చరిత్రము వినుడీ పరమ పవిత్రం జనులారా, గానం.ఎ.వి.సుబ్బారావు

12.పో యమా పొమ్మికన్ పోపో యమా పోమ్మికన్, గానం.వి.కోటేశ్వరరావు

13.బ్రతుకే నిరాశ మనసా వగపేల పెనుగాలిలో దీపిక, గానం.జయమ్మ

14.భుజ పీఠిన్ నిఖి లక్షమాతల భరంభున్(పద్యం), గానం.అద్దంకి శ్రీరామమూర్తి

15.మంజరీ అహా అహా అహా సుమమంజరి దేవిపూజకై నోచినావు, గానం.బి.ఎస్.సరోజ

16.ముచ్చరమూని ఆ దురాభిమాని సుయోధనుడిని పాట్లుకున్(పద్యం), కల్యాణం రఘురామయ్య

17.మాతా గౌరీ ఏది నాకిట దారి నా మనోవిభు జాడలేదు, గానం.జయమ్మ

18.రథము ముందుకు సాగే ధరణి వెనుకకులాగే నేడేది గోచరించు,

19.రావోయి అన్నయ్యా ఈరేడు లోకముల కన్నయ్యా, గానం: శ్రీరంజని జూనియర్

20.వీణా మధురగీతీ ఏది సుధానుసారిణి, గానం.బి.ఎస్.సరోజ

21.స్నేహముచే ముఖస్తులచే అమరేంద్రునిగా విధింప(పద్యం), గానం.పారుపల్లి సుబ్బారావు.

మూలాలు

మార్చు
  1. "Brahma Radham (1947)". Indiancine.ma. Retrieved 2020-09-08.

. 2.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.

బయటి లింకులు

మార్చు