భగవాన్ రాజు పాలెం
భగవాన్ రాజు పాలెం, బాపట్ల జిల్లా జే.పంగులూరు మండలానికి చెందిన గ్రామం.
భగవాన్ రాజు పాలెం | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°52′1.308″N 80°3′44.496″E / 15.86703000°N 80.06236000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | జే.పంగులూరు |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( 08593 ) |
పిన్‌కోడ్ | 523261 |
చిన్నమ్మకుంట
మార్చుఈ గ్రామంలో 150 సంవత్సరాలక్రితం, నాటి దాతలు భగవాన్ రాజుపాలెం-రామకూరు రహదారిలో ప్రయాణీకులు, పొలాలమీది పశుపక్ష్యాదుల దాహర్తి తీర్చేటందుకు మూడున్నర ఎకరాలలో ఈ కుంటను త్రవ్వించారు. కాలక్రమీణా కుంటలో ఆక్రమణలు చోటుచేసుకున్నవి. ఇటీవల సర్పంచి, గ్రామపెద్దల సలహాతో ఆక్రమణదారులు కుంట భూములనుండి వైదొలగినారు. అనంతరం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమం ద్వారా, 9.8 లక్షల నిధులతో, ఈ చెరువులో పూడికతీత కార్యక్రమం చేపట్టినారు. కుంట నుండి తొలగించిన 12,000 ట్రక్కుల మట్టిని గ్రామరైతులు తమ స్వంత ఖర్చులతో తమ పొలాలకు ఎరువుగానూ, ఇతర పనులకు తరలించుకొనిపోయినారు. త్వరలో మరియొక పదివేల ట్రక్కుల పూడిక తీత మట్టిని తొలగించి, చెరువును పూర్తి స్థాయిలో అభివృద్ధిచేసెదరు.
గ్రామ పంచాయతీ
మార్చు2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, ఈ గ్రామానికి చెందిన నార్నే ఆంజనేయులు, సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుశ్రీ సీతారామస్వామిస్వామివారి ఆలయం
మార్చుగ్రామంలో 200 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ సీతా, లక్ష్మణ, ఆంజనేయ సమేత శ్రీ కోదండ రామాలయం, శిథిలావస్థకు చేరుకొనుటతో, గ్రామస్థులంతా ఏకమై, దాతల సహకారంతో, ఒక కోటి రూపాయల అంచనా వ్యయంతో ఒక నూతన ఆలయ నిర్మాణం సుందరంగా నిర్మించారు. ప్రధానంగా ఆలయం లోపల గోడలపై కళాకారులు సిమెంటుతో నిర్మించిన శ్రీకృష్ణుని విశ్వరూపం, శ్రీ సీతారాముల కళ్యాణ ఘట్టం, దశావతారాలు తదితర బొమ్మలను సుందరంగా తీర్చిదిద్దినారు. ఇక ఆలయం గోపురంపై నిర్మించిన పురాణ ఘట్టాలు చూపరులకు కనువిందు చేయుచున్నవి. మొత్తం మీద ఈ రామాలయం నిర్మాణంతో, గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణ వెల్లివిరియుచున్నది. పునర్నిర్మించిన ఈ ఆలయంలో, శ్రీ హనుమత్, లక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్రస్వాఇవారల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం, 2017, మే-6వతేదీ శనివారం ఉదయం, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు. వేలాదిమంది భక్తుల రామనామస్మరణలతో భగవాన్‌రాజుపాలెం గ్రామం మార్మోగినది. అనంతరం నాగరాజు, వినాయక విగ్రహాలు, శంఖ, చక్ర, నామాలు, జీవధ్వజ పునఃప్రతిష్ఠా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో సాగినవి. ఈ సందర్భంగా ఋత్విక్కులు, పురాణ దంపతులకు శాంతికళ్యాణం గావించారు. ఈ ప్రతిష్ఠా కార్యక్రమాలను తిలకించడానికి ఈ గ్రామానికి తరలి వచ్చిన వేలాదిమంది భక్తులతో, గ్రామం కిటకిటలాదినది. స్వామి దర్శనానికి విచ్చేసిన అశేషమైన భక్తులకు గ్రామస్థులు అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించి మండలం (41) రోజులైనందున, 2017, జూలై-2వతేదీ ఆదివారంనాడు, వేదపండితుల ఆధ్వర్యంలో శాంతి హోమం నిర్వహించారు. అనంతకోటి రామనామాలను ఈ విశాల విశ్వంలోకి పంపించడం ద్వారా ప్రపంచశాంతిని కాంక్షించుచూ రామనామ సప్తాహాన్ని ప్రారంభించారు. పూర్ణాహుతితో ఈ కార్యక్రమం ముగింపుకు వచ్చును.
గ్రామంలో ప్రధాన పంటలు
మార్చుగ్రామంలో ప్రధాన వృత్తులు
మార్చువ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు