భద్ర (సినిమా)

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించిన సినిమా భద్ర. రవితేజ, మీరా జాస్మిన్, అర్జన్ బజ్వా, ప్రకాష్ రాజ్, ప్రదీప్ రావత్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాను బోయపాటి శ్రీను తెరకెక్కించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఈ యాక్షన్‌-ఫ్యాక్షన్‌ చిత్రం 'అపదలో ఉన్న అమ్మాయిని ఆదుకున్న 'భద్ర' అనే యువకుని కథ. రాయలసీమలో తన స్నేహితుడి కుటుంబం యొక్క హత్యలకు పగతీర్చుకోవాలననుకునే ఒక యువకుడి కథ నేపథ్యంగా నిర్మితమైన ఈ సినిమా మే 12, 2005న విడుదలైంది. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి మరిన్ని భాషల్లో పునఃనిర్మితమైంది.

భద్ర
(2005 తెలుగు సినిమా)
Bhadra poster.jpg
దర్శకత్వం బోయపాటి శ్రీను
నిర్మాణం దిల్ రాజు
కథ బోయపాటి శ్రీను
చిత్రానువాదం బోయపాటి శ్రీను
తారాగణం రవితేజ,
మీరా జాస్మిన్,
అర్జన్ బజ్వా,
ప్రకాష్ రాజ్,
ప్రదీప్ రావత్,
బ్రహ్మాజీ,
ఝాన్సీ (నటి), మురళీమోహన్,
సునీల్,
పద్మనాభం
ఈశ్వరీరావు[1]
సంగీతం దేవి శ్రీ ప్రసాద్
గీతరచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి
సంభాషణలు కొరటాల శివ
ఛాయాగ్రహణం ఆర్థర్ ఏ విల్సన్
కూర్పు మార్తాండ్ కె. వెంకటేష్
నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
విడుదల తేదీ 12 మే 2005
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

మూలాలుసవరించు

  1. ఈనాడు, ఆదివారం అనుబంధం. "కాలాని అలా సాధించాను..!". తలారి ఉదయ్ కుమార్. Archived from the original on 16 ఏప్రిల్ 2020. Retrieved 16 April 2020.