భరత్ పారేపల్లి
భరత్ పారేపల్లి టాలీవుడ్ దర్శకుల్లో ఒకరు. నటుడిగా, సంగీత దర్శకుడిగా కూడా సుపరిచితులు. తపస్సు, బాయ్ ఫ్రెండ్ లాంటి చిత్రాలతో 1990 ప్రాంతంలో మంచి యూత్ ఫాలోయింగ్ సంపాదించుకున్న దర్శకుల్లో భరత్ కూడా ఒకరు. 2008లో దాసరి నారాయణరావు భరత్ దర్శకత్వంలో ముమైత్ ఖాన్ కథానాయికగా "మైసమ్మ ఐపిఎస్" అనే చిత్రాన్ని నిర్మించారు. ఆకాష్ ఖురానా నటించిన "డాక్టర్ అంబేద్కర్" చిత్రాన్ని భరత్ కెరీర్‌లోనే గొప్ప చిత్రంగా పేర్కొనవచ్చు. 1992లో విడుదలైన ఆ చిత్రం "ఉత్తమ జాతీమ సమైక్యతా చిత్రం"గా అవార్డు కూడా గెలుచుకుంది.[1]
చిత్రాలు
మార్చు- డాక్టర్ అంబేద్కర్ - 1992[2]
- బాయ్ ఫ్రెండ్ - 1994
- జంతర్ మంతర్ - 1994
- తపస్సు - 1995
- వీరుడు - 1996
- ఫిల్మ్ నగర్ - 1999
- తెలంగాణ - 1999
- గురి - 2004
- అయిందా లేదా - 2005
- దాదాగిరి - 2005
- శ్లోకం - 2005
- చీకటిలో - 2006
- మధురిమ - 2006
- మైసమ్మ ఐ పి ఎస్ - 2007
- ఆదివిష్ణు - 2008
- లోకమే కొత్తగా - 2011
- ఇష్టసఖి - 2013
- హీరోయిన్ - 2015
- మందు పాతర
మూలాలు
మార్చు- ↑ సాక్షి పత్రికలో వ్యాసం, తేదీ 13 ఏప్రిల్, 2015
- ↑ "Dr Ambedkar (1992)". Indiancine.ma. Retrieved 2020-09-04.