భలే కోడళ్ళు
భలే కోడళ్ళు [1] కె. బాలచందర్ రచన, దర్శకత్వం వహించిన 1968 నాటి కామెడీ సినిమా. ఇది ఏకకాలంలో తమిళంలో బామా విజయమ్గా చిత్రీకరించినప్పటికీ, అక్కడ విడుదల అవడానికి సంవత్సరం ఆలసయమైంది. ఈ చిత్రంలో ఎస్.వి.రంగారావు, షాకారు జానకి, కాంచన, జయంతి, నాగభూషణం, రామకృష్ణ, చలం, రాజశ్రీ, సరస్వతి నటించారు.
భలే కోడల్లు (1968 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.బాలచందర్ |
---|---|
నిర్మాణం | ఎస్.ఎస్. వాసన్ |
రచన | కె.బాలచందర్ |
తారాగణం | ఎస్వీ.రంగారావు , జానకి |
సంగీతం | ఎం.ఎస్.విశ్వనాథన్ |
నిర్మాణ సంస్థ | మోషన్ పిక్చర్స్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
మూడు జంటలు నివసించే చోట పొరుగున ఉన్న ఇంట్లోకి ఒక సినీ నటి వచ్చి చేరుతుంది. ఆమె ఉనికి వలన ఈ ముగ్గురు భార్యలు ఆకర్షణీయంగా ఉండడం, రేడియోలు, ఇతర ఫాన్సీ వస్తువులు కొనడం చేస్తారు. అదే సమయంలో వారి భర్తలు ఆ నటికి చాలా దగ్గరౌతున్నారని ఆరోపిస్తారు.
తారాగణం
మార్చు- నరసింహమ్ పాత్రలో ఎస్.వి.రంగారావు
- పార్వతిగా షావుకారు జానకి
- సీతగా కాంచన
- రుక్మిణిగా జయంతి
- శంకరంగా నాగభూషణం
- రామముగా రామకృష్ణ
- కృష్ణుడిగా చలం
- సినీ నటిగా రాజశ్రీ
- సచ్చుగా సరస్వతి
పాటలు
మార్చుసం. | పాట | గాయనీ గాయకులు | పాట నిడివి |
---|---|---|---|
1. | "చల్లని ఇల్లు" | పి. సిశీల, ఎస్. జానకి, ఎల్.ఆర్. ఈశ్వరి | |
2. | "నేనే వచ్చాను" | పిఠాపురం నాగేశ్వరరావు,ఎల్.ఆర్. ఈశ్వరి | |
3. | "ఆస్తి మూరెడు" | సత్యం, ఎల్.ఆర్. ఈశ్వరి | |
4. | "వద్దే వద్దంటే" | పి. సుశీల | |
5. | "ఎక్కడ చూసినా" | పిఠాపురం నాగేశ్వరరావు,ఎల్.ఆర్. ఈశ్వరి |
మూలాలు
మార్చు- ↑ Narwekar, Sanjit (1994). Directory of Indian film-makers and films. Flicks Books. p. 24.
- ↑ "Bhale Kodallu (1968)". Music India Online. Archived from the original on 20 ఏప్రిల్ 2021. Retrieved 24 February 2018.