భవ్య బిష్ణోయ్ (జననం 1993 ఫిబ్రవరి 16) భారతీయ జనతా పార్టీకి చెందిన భారతీయ రాజకీయవేత్త. ఆయన 2022 నవంబరు ఉప ఎన్నికలో అడంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి హర్యానా శాసనసభకు ఎన్నికయ్యాడు. ఆయన రాష్ట్రంలోని అతి పిన్న వయస్కుడైన శాసనసభ్యుడు కావడం విశేషం.[1][2][3][4]

భవ్య బిష్ణోయ్
జననం (1993-02-16) 1993 ఫిబ్రవరి 16 (వయసు 31)
వృత్తిరాజకీయవేత్త
క్రియాశీల సంవత్సరాలు2022 - ప్రస్తుతం

ప్రారంభ జీవితం మార్చు

న్యూ ఢిల్లీలో 1993 ఫిబ్రవరి 16న ఆయన రేణుక, కుల్దీప్ బిష్ణోయ్ దంపతులకు జన్మించాడు.[5] ఆయన గురుగ్రామ్‌లోని శ్రీ రామ్ స్కూల్‌లో చదువుకున్నాడు.[6][7] ఆ తరువాత, ఉన్నత చదువులకై ఆయన యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ లో చేరాడు.[8]

గవర్నమెంట్ అండ్ ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందిన ఆయన ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో మోడరన్ సౌత్ ఏషియన్ స్టడీస్ (MSc) చదివాడు, అక్కడ క్రికెట్‌లో 'ఆక్స్‌ఫర్డ్ బ్లూ' సంపాదించడంతో పాటు ఫస్ట్ క్లాస్ ఆనర్స్ కూడా పొందాడు.[9][10][11][12]

ఇటీవల, ఆయన అమెరికాలోని హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్ (MPA) కోసం ప్రవేశం తీసుకున్నాడు.[6]

రాజకీయ నేపథ్యం మార్చు

ఆయన దివంగత సిహెచ్ భజన్ లాల్ మనవడు.[13] సిహెచ్ భజన్ లాల్ 3 సార్లు హర్యానా ముఖ్యమంత్రిగా, అలాగే కేంద్ర వ్యవసాయం, పర్యావరణ శాఖ మంత్రిగా పనిచేసాడు.[14]

ఆయన తండ్రి కుల్దీప్ బిష్ణోయ్ రెండుసార్లు పార్లమెంటుకు లోక్‌సభ సభ్యుడు, నాలుగుసార్లు శాసనసభ సభ్యుడు, కాగా తల్లి రేణుకా బిష్ణోయ్ రెండుసార్లు ఎమ్మెల్యే.[15]

రాజకీయ జీవితం మార్చు

ఆయన ప్రస్తుతం 90 మంది శాసన సభ్యులున్న హర్యానా అసెంబ్లీలో అడంపూర్ నుంచి అతి పిన్న వయస్కుడిగా ఉన్నాడు.[16][17] దీనికి ముందు, అతను 2014 లోక్‌సభ ఎన్నికలలో హర్యానాలోని హిసార్ నుండి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేసి ఓడిపోయాడు.[18] ఒక నియోజకవర్గానికి నిర్దిష్ట మేనిఫెస్టోను రూపొందించిన మొదటి పార్లమెంటరీ అభ్యర్థిగా గుర్తింపుపొందాడు.

2018లో, ఆయన లాభాపేక్ష లేని భజన్ గ్లోబల్ ఇంపాక్ట్ ఫౌండేషన్ (BGIF)ని స్థాపించాడు.[19] దీనికి ముందు, ఆయన గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ లీడర్‌షిప్ ఫౌండేషన్ (tGELF)లో స్పెషల్ ప్రాజెక్ట్స్ లీడ్‌గా ఉన్నాడు.[20][21] 2016 నవంబరులో, ఆయన గ్లోబల్ సిటిజన్ ఇండియా సామాజిక ప్రభావ ఉద్యమం భారతదేశంలోనే అతిపెద్ద సంగీత ఉత్సవం ముంబైలో నిర్వహించాడు.[22]

క్రీడలు మార్చు

భవ్య బిష్ణోయ్ రాష్ట్ర స్థాయిలో క్రికెట్, అథ్లెటిక్స్, స్విమ్మింగ్‌లలో పాల్గొనేవాడు.[11][23] ఆయన ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు క్రికెట్‌లో రాణించినందుకు ‘ఆక్స్‌ఫర్డ్ బ్లూ’ అవార్డును పొందాడు కూడా.[24]

గ్రేడ్ 10 ఐసిఎస్ఈ బోర్డు పరీక్షలలో 97%, అలాగే గ్రేడ్ 12 ఐబి పరీక్షలలో 45 పాయింట్లకు 43 సాధించి రెండింటిలోనూ ఆయన చదువులో అగ్రస్థానంలో నిలవడంతో పాటు పలు క్రీడలలోనూ ప్రతిభ కనబరిచాడు.[25]

వ్యక్తిగత జీవితం మార్చు

భవ్య బిష్ణోయ్‌కు ఐఏఎస్‌ అధికారిణి పరితో ఏప్రిల్‌ 2023లో ఎంగేజ్‌మెంట్ జరిగింది. వీరి వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో 2023 డిసెంబరు 22న జరగనుంది. ఆమెది రాజస్థాన్‌ కాగా, 2019లో సివిల్స్‌ సాధించింది, సిక్కిం క్యాడర్‌ కింద గ్యాంగ్‌టక్‌లో విధులు నిర్వర్తిస్తోంది.[26]

2021లో, భవ్య బిష్ణోయ్‌కు సినీనటి మెహ్రీన్‌తో నిశ్చితార్థం జరిగింది. అయితే అది రద్దయింది.[27]

మూలాలు మార్చు

  1. "Bhavya Bishnoi takes oath, becomes youngest member of Haryana Vidhan Sabha". The Indian Express (in ఇంగ్లీష్). 2022-11-16. Retrieved 2022-11-28.
  2. "Haryana's youngest MLA Bhavya Bishnoi gets engaged to IAS officer Pari Bishnoi". The Indian Express (in ఇంగ్లీష్). 2023-05-02. Retrieved 2023-05-04.
  3. "Meet IAS Pari Bishnoi, Haryana's youngest MLA Bhavya Bishnoi's would-be wife". DNA India (in ఇంగ్లీష్). Retrieved 2023-05-13.
  4. "Bhavya Bishnoi takes oath as youngest MLA". Hindustan Times (in ఇంగ్లీష్). 2022-11-17. Retrieved 2023-05-25.
  5. "BJP's Adampur MLA Bhavya Bishnoi gets engaged to IAS officer Pari Bishnoi". The Tribune. 14 May 2023.
  6. 6.0 6.1 "MLA Bhavya Bishnoi engaged IAS officer Pari Bishnoi". indiaherald.com (in ఇంగ్లీష్). Retrieved 2023-05-13.
  7. Chopra, Ritika (May 20, 2009). "For once, Boys Ahead". Hindustan Times. p. 1.
  8. "IAS Pari Bishnoi to Marry Haryana MLA Bhavya Bishnoi, Check Their Education Qualification". TimesNow (in ఇంగ్లీష్). 2023-05-08. Retrieved 2023-05-14.
  9. Gayatri, Geetanjali (2023-11-07). "Have big responsibility to discharge: Bhavya". The Tribune.
  10. "Bhavya Bishnoi: दादा के बाद पोता...भजनलाल की विरासत का 'भव्य' वारिस, कुलदीप बिश्नोई के बेटे का उदय". Navbharat Times (in హిందీ). Retrieved 2023-05-25.
  11. 11.0 11.1 Mukherjee, Bhaskar. "Riding on family legacy, Bhavya spices up contest". Hindustan Times.
  12. "ऑक्सफ़ोर्ड विश्वविद्यालय से भव्य बिश्नोई ने मास्टरस डिग्री कर पाया विशिस्ट सम्मान". Dainik Tribune. 17 July 2016.
  13. "भजनलाल की तीसरी पीढ़ी का राजनीती में पदापर्ण, भव्य बिश्नोई ने भरा नामांकन".
  14. "MLA engaged to IAS officer". The Times of India. 2023-05-03. ISSN 0971-8257. Retrieved 2023-05-12.
  15. "Newly elected BJP MLA Bhavya Bishnoi takes oath in Haryana Assembly - Articles". ZEE5 (in ఇంగ్లీష్). 2022-11-16. Retrieved 2022-11-28.
  16. "26 साल की उम्र में मिली टिकट". Amar Ujala.
  17. "Cong lists candidates for remaining 4 seats in state, picks Bhadana over Nagar for Faridabad". Hindustan Times.
  18. "भव्य ने भरा नामांकन, एकजुट नज़र आयी पूरी कांग्रेस". Dainik Jagran.
  19. "स्टार की हियरिंग फाउंडेशन एवं भजन ग्लोबल इम्पैक्ट फाउंडेशन के प्रयासों से दूर होगा हज़ारो हिसार वासियो के जीवन में पसरा सन्नाटा". Dainik Bhaskar. 8 August 2018.
  20. Chopra, Ritika (23 October 2016). "Global Citizen roots for quality education". The Times of India.
  21. "Here's how the Global Citizen India movement is taking the youth by storm". The Times of India. 1 November 2016.
  22. "ग्लोबल सिटीजन इंडिया अभियान से आएगी भारत में गरीबी उन्मूलन में क्रांति : भव्य बिश्नोई". पांच बजे न्यूज़.
  23. "ऑक्सफ़ोर्ड यूनिवर्सिटी की ओर से भव्य बिश्नोई का शानदार प्रदर्शन".
  24. "Bhavya Bishnoi: 'India has enough cricketers, there's lack of good leaders'". The Indian Express (in ఇంగ్లీష్). 2019-04-24. Retrieved 2022-11-28.
  25. Chopra, Ritika (May 20, 2009). "For once, Boys Ahead". Hindustan Times. p. 1.
  26. "ఎమ్మెల్యే-ఐఏఎస్‌ వెడ్డింగ్‌.. 80 గ్రామాలకు ఆహ్వానాలు, లక్షల్లో అతిథులు.. | bhavya bishnoi to get married to ias pari bishnoi". web.archive.org. 2023-12-09. Archived from the original on 2023-12-09. Retrieved 2023-12-09.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  27. "Bhavya Bishnoi,Mehreen: మెహ్రీన్‌తో కటీఫ్.. ఐఏఎస్ ఆఫీసర్‌తో ఎంగేజ్‌మెంట్.. మాజీ సీఎం మనవడా మజాకా! - bhavya bishnoi engagement with ias officer after breakup with mehreen - Samayam Telugu". web.archive.org. 2023-12-09. Archived from the original on 2023-12-09. Retrieved 2023-12-09.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)