భామా కలాపం (2022 సినిమా)
(భామా కలాపం (2022 వెబ్ సిరీస్) నుండి దారిమార్పు చెందింది)
భామా కలాపం తెలుగులో రూపొందిన థ్రిల్లర్ కామెడీ సినిమా. ఎస్‌విసిసి డిజిటల్ బ్యానర్‌పై బి. బాపినీడు, సుధీర్ ఈదర నిర్మించిన ఈ సినిమాకు భరత్ కమ్మ షో రన్నర్‌గా వ్యవహరించగా అభిమన్యు తాడిమేటి దర్శకత్వం వహించాడు. ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను నటుడు విజయ్ దేవరకొండ 31 జనవరి 2022న విడుదల చేయగా, ఫిబ్రవరి 11న ‘ఆహా’ఓటీటీలో విడుదలైంది.[1]
భామా కలాపం | |
---|---|
దర్శకత్వం | అభిమన్యు తాడిమేటి |
స్క్రీన్ ప్లే | అభిమన్యు తాడిమేటి |
కథ | అభిమన్యు తాడిమేటి |
నిర్మాత | బి. బాపినీడు, సుధీర్ ఈదర |
తారాగణం | ప్రియమణి, జాన్ విజయ్ |
ఛాయాగ్రహణం | దీపక్ ఎర్రజీర |
కూర్పు | విప్లవ్ నైషధం |
సంగీతం | జస్టిన్ ప్రభాకరన్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 11 ఫిబ్రవరి 2022 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుఅనుపమ (ప్రియమణి) ఓ సాధారణ మధ్యతరగతి గృహిణి. అనుపమకి ఆమె ఉండే అపార్ట్‌మెంట్‌లో ఇరుగుపొరుగు ఇంట్లో ఏం జరుగుతోందో తెలుసుకోవడం అంటే ఆసక్తి. ఈ క్రమంలో ఒకరోజు రాత్రి అనుపమ ఉండే అపార్ట్‌మెంట్‌లో హత్య జరుగుతుంది. ఆ హత్యకి అనుపమకు సంబంధం ఏంటి ? తరువాత అనుపమ జీవితం ఎలా మలుపు తిరిగింది, ఈ సమస్య నుంచి అనుపమ బయటపడుతుందా లేదా అనేదే మిగతా సినిమా కథ.[2][3]
నటీనటులు
మార్చు- ప్రియమణి[4]
- జాన్ విజయ్
- శరణ్య ప్రదీప్
- కరుణ కుమార్
- కంచరపాలెం కిశోర్
- శాంతిరావు
- పాండియన్
- ప్రధీప్ రుద్ర
- సమీర
- రవీందర్ బొమ్మకంటి
- పమ్మి సాయి
- నెట్టూరి నీరజ
- బాలాజీ
- ఏం.ఎస్. రాజా
- సాయి ముఖేష్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: ఎస్‌విసిసి డిజిటల్
- నిర్మాతలు: బి. బాపినీడు, సుధీర్ ఈదర
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అభిమన్యు తాడిమేటి
- సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
- సినిమాటోగ్రఫీ: దీపక్ ఎర్రజీర
- ఎడిటర్: విప్లవ్ నైషధం
మూలాలు
మార్చు- ↑ Andhrajyothy (31 January 2022). "ఇటువంటి పాత్రను ఇప్పటి వరకు నేను చేయలేదు: ప్రియమణి". Archived from the original on 31 జనవరి 2022. Retrieved 31 January 2022.
- ↑ A. B. P. Telugu (11 February 2022). "'భామాకలాపం' రివ్యూ: ఈ హౌస్ వైఫ్ ని భరించడం కొంచెం కష్టమే". Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.
- ↑ The Hindu (11 February 2022). "'Bhamakalapam' movie review: Priyamani shines in this macabre crime comedy" (in Indian English). Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.
- ↑ Namasthe Telangana (2 February 2022). "ప్రియమణి 'భామా కలాపం'". Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.