శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర

తెలుగు సినిమాను నిర్మాణ, పంపిణీ సంస్థ

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర అనేది తెలుగు సినిమాను నిర్మించే, పంపిణీచేసే నిర్మాణ సంస్థ. తెలుగు సినీ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ 2003లో హైదరాబాదులో ఈ సంస్థను స్థాపించాడు. 2012లో, నిర్మాణ సంస్థ రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి దేవుడు చేసిన మనుషులు[1] సినిమాను నిర్మించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర భాగస్వాములు ప్రసాద్, భోగవల్లి బాపినీడు.

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
రకంప్రైవేటు
పరిశ్రమవినోదం
స్థాపన2003; 21 సంవత్సరాల క్రితం (2003)
ప్రధాన కార్యాలయం,
భారతదేశం
కీలక వ్యక్తులు
బివిఎస్ఎన్ ప్రసాద్
భోగవల్లి బాపినీడు
ఉత్పత్తులుసినిమాలు
యజమానిబివిఎస్ఎన్ ప్రసాద్

చరిత్ర

మార్చు

2003లో రవితేజ, సంగీత, వాణి నటించిన ఈ అబ్బాయి చాలా మంచోడు సినిమాతో ఈ సంస్థ ప్రారంభించబడింది. ఒక సంవత్సరం తర్వాత ఈ సంస్థ తెలుగు సినిమారంగంలో అతిపెద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌లలో ఒకటైన ఛత్రపతి సినిమాను నిర్మించింది. దీనికి ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన ప్రభాస్, శ్రియ శరణ్ నటించారు. ఎల్లప్పుడూ కొత్త స్క్రిప్ట్‌లను ఎంచుకోవడం ద్వారా ఈ సంస్థ ప్రజాదరణ పొందింది.

పంపిణీ

మార్చు

ఈ సంస్థ స్వయంగా నిర్మించిన ఛత్రపతి సినిమాతో డిస్ట్రిబ్యూషన్‌లోకి అడుగుపెట్టింది. 2011లో ఊసరవెల్లి సినిమాను, సన్నాఫ్ సత్యమూర్తి సినిమా పంపిణీ చేసింది.

సినిమా నిర్మాణం

మార్చు
సంవత్సరం సినిమా నటీనటులు దర్శకుడు ఇతర వివరాలు
1986 డ్రైవర్ బాబు శోభన్ బాబు, రాధ బోయిన సుబ్బారావు
1987 మకుటం లేని మహారాజు కృష్ణ, శ్రీదేవి కె.బాపయ్య
1988 చట్టంతో చదరంగం శోభన్ బాబు, అర్జున్ సర్జా, శారద కె.మురళీమోహనరావు
1989 ఒంటరి పోరాటం దగ్గుబాటి వెంకటేష్, మంచు మోహన్ బాబు, జయసుధ, కన్నెగంటి బ్రహ్మానందం కె. రాఘవేంద్రరావు
1990 దాగుడు మూతల దాంపంత్యం అక్కినేని నాగేశ్వరరావు, రాజేంద్ర ప్రసాద్, రమ్యకృష్ణ రేలంగి నరసింహారావు
1996 అదిరింది అల్లుడు మంచు మోహన్ బాబు, రమ్యకృష్ణ ఇ.వి.వి.సత్యనారాయణ
2003 ఈ అబ్బాయి చాలా మంచోడు రవితేజ, సంగీత, వాణి అగస్త్యన్
2005 ఛత్రపతి ప్రభాస్, శ్రియా సరన్ ఎస్. ఎస్. రాజమౌళి
2006 ఖతర్నాక్ రవితేజ, ఇలియానా అమ్మ రాజశేఖర్
2009 ఆర్య 2 అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్, నవదీప్ సుకుమార్
2010 డార్లింగ్ ప్రభాస్, కాజల్ అగర్వాల్ ఎ. కరుణాకరన్
2011 ఊసరవెల్లి జూనియర్ ఎన్.టి.ఆర్, తమన్నా సురేందర్ రెడ్డి
2012 దేవుడు చేసిన మనుషులు రవితేజ, ఇలియానా పూరీ జగన్నాథ్
2013 ఒంగోలు గిత్త రామ్ పోతినేని, కృతి కర్బంద భాస్కర్
2013 సాహసం తొట్టెంపూడి గోపీచంద్, తాప్సీ చంద్రశేఖర్ యేలేటి
2013 అత్తారింటికి దారేది పవన్ కళ్యాణ్, సమంత, ప్రణీత సుభాష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సైమా ఉత్తమ చిత్రం - తెలుగు
2015 దోచేయ్ అక్కినేని నాగ చైతన్య, కృతి సనన్ సుధీర్ వర్మ
2016 నాన్నకు ప్రేమతో జూనియర్ ఎన్.టి.ఆర్, రకుల్ ప్రీత్ సింగ్, జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ సుకుమార్
2016 ఇంట్లో దెయ్యం నాకేం భయం అల్లరి నరేష్, కృతిక జయకుమార్, మౌర్యాని, రాజేంద్ర ప్రసాద్ జి. నాగేశ్వరరెడ్డి
2017 రాధ శర్వానంద్, లావణ్య త్రిపాఠి చంద్రమోహన్
2018 తొలిప్రేమ వరుణ్ తేజ్, రాశి ఖన్నా వెంకీ అట్లూరి
2019 మిస్టర్ మజ్ను అక్కినేని అఖిల్, నిధి అగర్వాల్ వెంకీ అట్లూరి
2020 సోలో బ్రతుకే సో బెటర్ సాయి ధరమ్ తేజ్, నభా నటేష్ సుబ్బు [2]
2021 నిన్నిలా నిన్నిలా నిత్య మేనన్, అశోక్ సెల్వన్, రీతు వర్మ అని శశి [3]
2022 భామా కలాపం ప్రియమణి అభిమన్యు తాడిమేటి
2022 రంగ రంగ వైభవంగా వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ గిరీశాయ

సినిమా పంపిణీ

మార్చు
సంవత్సరం సినిమా ఇతర వివరాలు
2005 చత్రపతి
2011 ఊసరవెల్లి

మూలాలు

మార్చు
  1. "Reliance Entertainment in full swing in Telugu". Archived from the original on 18 August 2012. Retrieved 2023-03-27.
  2. Chowdhary, Y. Sunita (2020-03-09). "Puri Jagannadh is an inspiration for 'Solo Brathuke So Better', says director Subbu". The Hindu. ISSN 0971-751X. Retrieved 2023-03-27.
  3. "Ninnila Ninnila: First look poster of Ashok Selvan, Nithya Menen, Ritu Varma's upcoming film released - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-03-27.

బయటి లింకులు

మార్చు