భామా కలాపం (2022 సినిమా)

భామా కలాపం తెలుగులో రూపొందిన థ్రిల్ల‌ర్ కామెడీ సినిమా. ఎస్‌విసిసి డిజిటల్ బ్యానర్‌పై బి. బాపినీడు, సుధీర్ ఈదర నిర్మించిన ఈ సినిమాకు భరత్ కమ్మ షో రన్నర్‌గా వ్యవహరించగా అభిమన్యు తాడిమేటి దర్శకత్వం వహించాడు. ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను నటుడు విజయ్ దేవరకొండ 31 జనవరి 2022న విడుదల చేయగా, ఫిబ్ర‌వ‌రి 11న ‘ఆహా’ఓటీటీలో విడుదలైంది.[1]

భామా కలాపం
దర్శకత్వంఅభిమన్యు తాడిమేటి
స్క్రీన్ ప్లేఅభిమన్యు తాడిమేటి
కథఅభిమన్యు తాడిమేటి
నిర్మాతబి. బాపినీడు, సుధీర్ ఈదర
తారాగణంప్రియమణి, జాన్ విజయ్
ఛాయాగ్రహణందీపక్ ఎర్రజీర
కూర్పువిప్లవ్ నైషధం
సంగీతంజస్టిన్ ప్రభాకరన్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
11 ఫిబ్ర‌వ‌రి 2022
దేశం భారతదేశం
భాషతెలుగు

అనుప‌మ (ప్రియ‌మ‌ణి) ఓ సాధార‌ణ మ‌ధ్య‌త‌ర‌గ‌తి గృహిణి. అనుప‌మ‌కి ఆమె ఉండే అపార్ట్‌మెంట్‌లో ఇరుగుపొరుగు ఇంట్లో ఏం జ‌రుగుతోందో తెలుసుకోవ‌డం అంటే ఆసక్తి. ఈ క్రమంలో ఒకరోజు రాత్రి అనుపమ ఉండే అపార్ట్‌మెంట్‌లో హత్య జరుగుతుంది. ఆ హత్యకి అనుపమకు సంబంధం ఏంటి ? తరువాత అనుపమ జీవితం ఎలా మలుపు తిరిగింది, ఈ సమస్య నుంచి అనుపమ బయటపడుతుందా లేదా అనేదే మిగతా సినిమా కథ.[2][3]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: ఎస్‌విసిసి డిజిటల్
  • నిర్మాతలు: బి. బాపినీడు, సుధీర్ ఈదర
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అభిమన్యు తాడిమేటి
  • సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
  • సినిమాటోగ్రఫీ: దీపక్ ఎర్రజీర
  • ఎడిటర్: విప్లవ్ నైషధం

మూలాలు

మార్చు
  1. Andhrajyothy (31 January 2022). "ఇటువంటి పాత్రను ఇప్పటి వరకు నేను చేయలేదు: ప్రియమణి". Archived from the original on 31 జనవరి 2022. Retrieved 31 January 2022.
  2. A. B. P. Telugu (11 February 2022). "'భామాకలాపం' రివ్యూ: ఈ హౌస్ వైఫ్ ని భరించడం కొంచెం కష్టమే". Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.
  3. The Hindu (11 February 2022). "'Bhamakalapam' movie review: Priyamani shines in this macabre crime comedy" (in Indian English). Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.
  4. Namasthe Telangana (2 February 2022). "ప్రియమణి 'భామా కలాపం'". Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.