భామ కలాపం 2 2024లో విడుదలైన తెలుగు సినిమా. 2022లో విడుదలైన భామా కలాపం సినిమాకు సీక్వెల్‌గా ‘భామాకలాపం 2’ ను ఆహా స్టూడియోస్‌తో డ్రీమ్‌ ఫార్మర్స్‌ బ్యానర్‌పై బి. బాపినీడు, సుధీర్ ఈదర నిర్మించిన ఈ సినిమాకు అభిమన్యు తాడిమేటి దర్శకత్వం వహించాడు. ప్రియమణి, జాన్ విజయ్, శరణ్య ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జనవరి 30న[1], ట్రైలర్‌ను ఫిబ్రవరి 10న విడుదల చేయగా[2], ఫిబ్ర‌వ‌రి 16న ఆహా ఓటీటీలో విడుదలైంది.[3]

భామా కలాపం 2
దర్శకత్వంఅభిమన్యు తాడిమేటి
స్క్రీన్ ప్లేఅభిమన్యు తాడిమేటి
కథఅభిమన్యు తాడిమేటి
నిర్మాతబి. బాపినీడు, సుధీర్ ఈదర
తారాగణంప్రియమణి, సీరత్ కపూర్, జాన్ విజయ్, బ్రహ్మాజీ,
ఛాయాగ్రహణందీపక్ ఎర్రజీర
కూర్పువిప్లవ్ నైషధం
సంగీతంప్రశాంత్ ఆర్ విహారి
నిర్మాణ
సంస్థలు
ఆహా స్టూడియోస్‌, డ్రీమ్‌ ఫార్మర్స్‌
విడుదల తేదీ
16 ఫిబ్ర‌వ‌రి 2024
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

అనుపమ (ప్రియమణి) పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి మారిపోయిన తరువాత యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బులతో పాత ఇంట్లో పని మనిషి శిల్పా (శరణ్య ప్రదీప్) పార్ట్‌నర్‌గా ‘అనుపమ ఘుమఘుమ’ అనే రెస్టారెంట్‌ను ప్రారంభిస్తుంది. కుకింగ్ ఐడల్ 2023 అనే నేషనల్ లెవల్ కుకింగ్ కాంపిటీషన్‌కు అప్లై చేస్తారు. ఆంథోని లోబో (అనూజ్ గుర్వారా) అనే బిజినెస్ మ్యాన్ కుకింగ్ ఐడల్ ట్రోఫీ అనే పేరుతో యూరోప్ నుంచి డ్రగ్స్‌ను స్మగ్లింగ్ చేయాలని ప్లాన్ చేస్తాడు. ఈ క్రమంలో అనుపమకు డ్రగ్స్‌ను కొట్టేసే పరిస్థితి వస్తుంది? ఈ దొంగతనం ఎవరి జీవితాలను మార్చింది? అనేదే మిగతా సినిమా కథ.[4]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: డ్రీమ్‌ ఫార్మర్స్‌
  • నిర్మాతలు: బి. బాపినీడు, సుధీర్ ఈదర
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అభిమన్యు తాడిమేటి
  • సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి
  • సినిమాటోగ్రఫీ: దీపక్ ఎర్రజీర
  • ఎడిటర్: విప్లవ్ నైషధం

మూలాలు మార్చు

  1. TV9 Telugu (30 January 2024). "'అనుపమ అనే నేను'..ఆసక్తికగా 'భామా కలాపం 2' టీజర్." Archived from the original on 17 February 2024. Retrieved 17 February 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. A. B. P. Desam (10 February 2024). "ప్రియమణి 'భామాకలాపం 2' ట్రైలర్ వచ్చేసింది." Archived from the original on 17 February 2024. Retrieved 17 February 2024.
  3. Hindustantimes Telugu (13 February 2024). "ఈ వారం ఓటీటీలోకి రానున్న తెలుగు సినిమాలు ఇవే.. ఓ మూవీ నేరుగా." Archived from the original on 17 February 2024. Retrieved 17 February 2024.
  4. Eenadu (16 February 2024). "రివ్యూ: భామాకలాపం-2.. ప్రియమణి చేసిన సాహసం మెప్పించిందా?". Archived from the original on 17 February 2024. Retrieved 17 February 2024.
  5. Chitrajyothy (15 February 2024). "భామా కలాపం 2లో అన్నీ డబుల్‌ ఉంటాయి | Everything is double in Bhama Kalam 2". Archived from the original on 17 February 2024. Retrieved 17 February 2024.
  6. Eenadu (17 February 2024). "'భామా కలాపం-2' నవ్విస్తుంది". Archived from the original on 17 February 2024. Retrieved 17 February 2024.

బయటి లింకులు మార్చు