సీరత్ కపూర్

భారతీయ చలనచిత్ర నటి, మోడల్, నృత్య దర్శకురాలు.

సీరత్ కపూర్ భారతీయ చలనచిత్ర నటి, మోడల్, నృత్య దర్శకురాలు. రాక్‌స్టార్ సినిమాకు సహాయ నృత్య దర్శకురాలిగా తన సినీ జీవితాన్ని ప్రారంభించిన సీరత్ కపూర్, 2014లో తెలుగులో వచ్చిన రన్ రాజా రన్ సినిమాలో తొలిసారిగా నటించింది.

సీరత్ కపూర్
కొలంబస్ సినిమా పాటల విడుదల కార్యక్రమంలో సీరత్ కపూర్
జననం
సీరత్ కపూర్

(1993-04-03) 1993 ఏప్రిల్ 3 (వయసు 30)
జాతీయతభారతీయురాలు
వృత్తిభారతీయ చలనచిత్ర నటి, మోడల్, నృత్య దర్శకురాలు
క్రియాశీల సంవత్సరాలు2014–ప్రస్తుతం

జననం - విద్యాభ్యాసం మార్చు

సీరత్ కపూర్ 1993, ఏప్రిల్ 3న వినీత్ కపూర్, నీనా సిహోత కపూర్ దంపతులకు ముంబైలో జన్మించింది. తండ్రి హోటల్ యజమాని కాగా, తల్లి ఎయిర్ ఇండియాలో ఎయిర్ హోస్టెస్ గా పనిచేసింది.

ముంబై సాంతా క్రూజ్ లోని పోదర్ ఇంటర్నేషనల్ స్కూల్ లో ప్రాథమిక విద్యను, బాంద్రాలోని ఆర్.డి. నేషనల్ కాలేజీలో మాధ్యమిక విద్యను పూర్తిచేసింది. బిఏ మాస్ కమ్యూనికేషన్ లో చేరిన సీరత్, సినిమాలకోసం డిగ్రీ చదువును మధ్యలోనే వదిలేసి నృత్య వృత్తిలో ఉన్నతస్థాయికి చేరుకుంది.

16 ఏళ్ళ వయసులో ముంబైలోని ది డాన్స్ వర్క్స్ లో యాష్లే లోబో దగ్గర బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గా తన సినీ జీవితాన్ని ప్రారంభించింది.[1] ఆమె ఆ అకాడమీలో పూర్తికాల నృత్య బోధకురాలిగా పనిచేసింది. అదే సమయంలో రాక్‌స్టార్ సినిమాకు సహాయ నృత్య దర్శకురాలిగా చేరింది.

మోడలింగ్‌తో గుర్తింపుపొందిన సీరత్, తన కజిన్ తాత సంస్థ రోషన్ తనేజా స్కూల్ ఆఫ్ యాక్టింగ్‌లో నటనలో శిక్షణ పొందింది.[2] 2014లో తెలుగులో సీరత్ తొలిచిత్రం రన్ రాజా రన్ విడుదలయింది.

సినిమారంగం మార్చు

2014లో సుజిత్ - శర్వానంద్ కాంబినేషన్ లో వచ్చిన రన్ రాజా రన్ సినిమా కమర్షియల్ గా విజయం సాధించింది. 2015లో బి. మధు, ఎన్.వి. ప్రసాద్ తీసిన టైగర్ సినిమాలో గంగ పాత్రలో నటించింది. వారణాసి నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమాలో సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్ కూడా నటించారు. 2015లోనే అశ్వినీ కుమార్ సహదేవ్ నిర్మాణంలో ఆర్. సామల దర్శకత్వంలో సుమంత్ అశ్విన్ హీరోగా వచ్చిన కొలంబస్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో నీరజ పాత్రలో సీరత్ నటన ప్రసంశలు పొందింది. ఆ తరువాత అక్కినేని నాగార్జునతో రాజు గారి గది 2, రవితేజతో టచ్ చేసి చూడు, అల్లు శిరీష్ తో ఒక్క క్షణం వంటి సినిమాల్లో నటించింది.

నటించిన చిత్రాలు మార్చు

సంవత్సరం సినిమా పేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2014 జిద్ నాన్సీ హిందీ
2014 రన్ రాజా రన్ ప్రియా తెలుగు
2015 టైగర్ గంగ
2015 కొలంబస్[3] నీరజ
2017 రాజు గారి గది 2 సుహానిస
2017 ఒక్క క్షణం స్వాతి
2018 టచ్ చేసి చూడు దివ్య
2020 కృష్ణ అండ్ హిజ్ లీలా [4]
2020 మా వింత గాధ వినుమా [5]

సహాయ నృత్య దర్శకురాలిగా మార్చు

  • 2011 - రాక్‌స్టార్[6]

ప్రచార చిత్రాలు మార్చు

వివేల్,[7] ఎంగేజ్ కొలోన్ స్ప్రేలు,[8] అపోలో టైర్స్ ఫర్ డిబాకర్ బెనర్జీ,[9] మహీంద్రా గుస్టో,[10] ఇంటెక్స్ విత్ ఫర్హాన్ అఖ్తర్[11] వంటి వస్తువుల ప్రచార చిత్రాల్లో నటించింది.

ఇతర వివరాలు మార్చు

12 ఏళ్ళ వయసులో రాజశ్రీ మ్యూజిక్ స్కూల్ నుండి భారతీయ శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందింది.

మూలాలు మార్చు

  1. "Dance Classes in Delhi, Mumbai, Gurgaon, Noida - Jazz Funk Ballet". Thedanceworx.com. Retrieved 25 May 2020.
  2. "Discovering her calling". Thehindu.com. Retrieved 25 May 2020.
  3. Nadadhur, Srivathsan (23 October 2015). "Columbus: In no man's world". The Hindu. Retrieved 27 May 2020.
  4. "Childhood love is very innocent, says Seerat Kapoor in a candid interview!". Telly Chakkar. 19 March 2020. Retrieved 25 May 2020.
  5. "Tollywood's latest debutante Seerat Kapoor". Deccanchronicle.com. 20 July 2014. Retrieved 25 May 2020.
  6. "Tollywood's latest debutante Seerat Kapoor". Deccanchronicle.com. 20 July 2014. Retrieved 24 May 2020.
  7. "Will you say #AbSamjhautaNahin ?". YouTube. Retrieved 25 May 2020.
  8. "Engage Cologne Sprays TVC 45 sec". YouTube. Retrieved 25 May 2020.
  9. "Apollo Tyres - College Girl". YouTube. Retrieved 25 May 2020.
  10. "2016 #Mahindra #Gusto 125 (#India) promo video". YouTube. Retrieved 25 May 2020.
  11. "Intex Aqua Craze TVC With Farhan". YouTube. Retrieved 25 May 2020.

ఇతర లంకెలు మార్చు