భార్యాభర్తల బంధం

(భార్య భర్తల బంధం నుండి దారిమార్పు చెందింది)

భార్యాభర్తల బంధం 1985 లో విడుదలైన చిత్రం. వి.బి.రాజేంద్ర ప్రసాద్ తన జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌లో నిర్మించి దర్శకత్వం వహించాడు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి బాలకృష్ణ, జయసుధ, రజని ప్రధాన పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతం సమకూర్చాడు.[2]

భార్యాభర్తల బంధం
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.బి. రాజేంద్ర ప్రసాద్
నిర్మాణం వి.బి. రాజేంద్ర ప్రసాద్
కథ వియత్నాం వీడు సుందరం
చిత్రానువాదం వియత్నాం వీడు సుందరం
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు
నందమూరి బాలకృష్ణ
జయసుధ
రజని
సంగీతం కె. చక్రవర్తి
సంభాషణలు ఆచార్య ఆత్రేయ
ఛాయాగ్రహణం ఎన్. నవకాంత్
కూర్పు ఎ. సంజీవి
విడుదల తేదీ 28 మార్చి 1985 (1985-03-28)[1]
నిడివి 135 ని.
దేశం భారతదేశం
భాష తెలుగు

కథసవరించు

విడాకులు తీసుకున్న జంట సంజీవి (అక్కినేని నాగేశ్వరరావు), అర్చన (జయసుధ), అర్చన కంపెనీలో సంజీవి వాటాలున్న కారణంగా కలుస్తూంటారు. ఈ దంపతులకు కృష్ణ (రజని) అనే కుమార్తె ఉంది, ఆమె తల్లితో నివసిస్తుంది. తల్లివద్ద ఆమెకు ఎటువంటి స్వేచ్ఛ ఉండదు రాధా (నందమూరి బాలకృష్ణ) సంజీవి సోదరి కుమారుడు. అమెరికాలో స్థిరపడిన భారతీయుడితో తమ కుమార్తెకు పెళ్ళి చేసేందుకు అర్చన ప్రయత్నిస్తోందని తెలిసి, రాధా కృష్ణలకు పెళ్ళి చెయ్యాలని సంజీవి ప్రయత్నిస్తాడు. ఆ పెళ్ళి జరుగుతుందా, సంజీవి, అర్చనలు ఏకమౌతారా అనేది మిగతా చిత్రం

తారాగణంసవరించు

సాంకేతిక సిబ్బందిసవరించు

 • కళ: భాస్కర్ రాజు
 • నృత్యాలు: ప్రకాష్
 • పోరాటాలు: రాజు
 • సంభాషణలు - సాహిత్యం: ఆచారి ఆత్రేయ
 • నేపథ్య గానం: ఎస్పీ బాలు, పి.సుశీల, మాధవపెద్ది రమేష్
 • సంగీతం: చక్రవర్తి
 • కథ - చిత్రానువాదం: వియత్నావీదు సుందరం
 • కూర్పు: ఎ. సంజీవి
 • ఛాయాగ్రహణం: ఎన్.నవకాంత్
 • నిర్మాత - దర్శకుడు: వి.బి.రాజేంద్ర ప్రసాద్
 • బ్యానర్: జగపతి ఆర్ట్ పిక్చర్స్
 • విడుదల తేదీ: 1985 మార్చి 28

పాటలుసవరించు

ఆచార్య ఆత్రేయ రాసిన పాటలకు చక్రవర్తి సంగీతం సమకూర్చాడు. AVM ఆడియో కంపెనీ విడుదల చేసింది.

ఎస్. పాట పేరు గాయకులు పొడవు
1 "ఓలమ్మి ఓలమ్మి" ఎస్పీ బాలు 3:40
2 "కోకంతా తడిసింధి" ఎస్పీ బాలు, పి.సుశీల 4:13
3 "గజిబిజి మనసు" ఎస్పీ బాలు, పి.సుశీల 3:57
4 "మనసు మనసు" ఎస్పీ బాలు, పి.సుశీల 4:15
5 "నా తండ్రి రామయ్య" ఎస్పీ బాలు, మాధవపెద్ది రమేష్ 3:48

మూలాలుసవరించు