భిండ్ జిల్లా
మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో బింద్ జిల్లా (హిందీ: भिंड) ఒకటి. బింద్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. బింద్ జిల్లా చంబల్ డివిజన్‌లో భాగం.
భిండ్ జిల్లా
भिंड जिला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
డివిజను | మొరేనా |
ముఖ్య పట్టణం | భిండ్ |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | భిండ్ |
• శాసనసభ నియోజకవర్గాలు | అటర్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 4,459 కి.మీ2 (1,722 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 17,03,562 |
• జనసాంద్రత | 380/కి.మీ2 (990/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 76.59% |
• లింగ నిష్పత్తి | 838 |
Website | అధికారిక జాలస్థలి |
భౌగోళికం
మార్చుబింద్ జిల్లా రాష్ట్ర ఈశాన్య భూభాగంలో చంబల్ డివిజన్‌లో ఉంది. 26°36' డిగ్రీల ఉత్తర అక్షాంశం, 78°46' డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లా వైశాల్యం 4,459 చ.కి.మీ.జిల్లాలో వ్యవసాయ భూములు అధికంగానూ అరణ్యప్రాంతం తక్కువగానూ ఉన్నాయి.
సరిహద్దులు
మార్చుజిల్లా ఉత్తర సరిహద్దులో ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ఆగ్రా జిల్లా, ఎటావా జిల్లా, జలౌన్ జిల్లా, ఝాన్సీ జిల్లా, దక్షిణ సరిహద్దులో దతియా జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో గ్వాలియర్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో మొరేనా జిల్లాలు ఉన్నాయి.
నైసర్గికం
మార్చుజిల్లాలో భూమి చాలా సారవంతమైనది. జిల్లాలో చంబల్, కాళి, క్వారి, పహుజ్, బైసి నదులు ప్రవహిస్తున్నాయి. కాలువల ద్వారా కూడా వ్యవసాయానికి నీరు అందుతూ ఉంది.
- గతంలో జిల్లాలోని 4 తాలూకాలు ఉన్నాయి :- బింద్, మెహ్గావ్, గొహద్, లహర్.
- ప్రస్తుతం జిల్లాలో 7 తాలూకాలు ఉన్నాయి :- బింద్, మెహ్గావ్, గొహద్, లహర్, మిహోనా, రౌన్, అతర్.
- ప్రజలు :- రాజపుత్రులు, జైనులు, బ్రాహ్మణులు అధికంగా ఉన్నారు.[1]
చరిత్ర
మార్చువిభాండక మహర్షి (బింది ఋషి) పేరు మీద ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చింది. వేదకాలంలో ఈ భూభాగాన్ని యయాతి కుమారుడు యదుమహారాజు పాలించాడు. మహాభారత కాలంలో ఈ ప్రాంతాన్ని చేధిరాజు శిశుపాలుడు పాలించాడు. తరువాత యాదవ వంశానికి చెందిన శ్రీకృష్ణుడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి యాదవరాజ్యాన్ని స్థాపించాడు. మహాజనపదాల కాలంలో ఈ భూభాగం మీద చేది రాజులు ఆధిక్యం అధికంగా ఉంది. తరువాత చందేల్ పాలనలోకి మారింది. తరువాత రాయల్ రాజపుత్రులు చందేల్ పాలకులను ఓడించి ఈ భూభాగాన్ని చౌహాన్ ఆధిక్యంలోకి తీసుకువచ్చారు. జవహర్లాల్ నెహ్రూ మధ్యభారతం రూపకల్పన చేసాడు. సింధియా, హోల్కర్ రాజప్రముఖ్, ఉపరాజప్రముఖ్‌గా నియమించబడ్డారు. తరువాత మద్యభారత్ 6 జిల్లాలుగా విభజించబడింది. 6 జిల్లాలో ఒకటిగా బిండ్ జిల్లా రూపొందించబడింది. 1956 నవంబరు 1 రాష్ట్రాల పునర్విభజన సమయంలో మధ్యభారతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేయబడింది.
పురాణాలు, చరిత్ర
మార్చు- గణేష్ మందిర్ :- ఇది గౌరీ సరోవరం కొండమార్గంలో నిర్మించిన పురాతన గణేష్ దేవాలయం.
- దంద్రౌ హనుమాన్ మందిర్ :- ఒక పురాతన హనుమాన్ మందిర్. ఇక్కడ ప్రతిష్ఠితమైన హనుమాన్ జీ ఉత్తమ వైద్యుడని ప్రజలు భావిస్తారు. నయంకాని వ్యాధులు నయం చేసుకోవడానికి భక్తులు విశ్వాసంతో ఇక్కడకు వస్తుంటారు. ఇది మహాగావ్ జిల్లాలో ఉంది.
- ఆలంపూర్ (మధ్యప్రదేశ్) :- ఇది రావు హోల్కర్ 1766 లో నిర్మించిన మల్హర్ పురాతన చాత్రికి ప్రసిద్ధి చెందిన పట్టణం.
- వంఖందేష్వర్ మందిర్ :- ఇది పృథ్వీరాజ్ చౌహాన్ నిర్మించిన ఒక పురాతన శివాలయం.
- నారద (లహార్) :- పౌరాణిక దేవ మహర్షి నారద ప్రార్థించిన ప్రదేశం.
- మహర్షి భిందీ బింద్ మహర్షి:- భిందీ దోపిడి దొంగ జీవితంలో నివసించిన ప్రాంతం.
- బింద్ తాలూకాలోని పందరి గ్రామంలో పాండవుల అజ్ఞాత వాసం అఙావాస కాలంలో నివసించిన కుటీరం (పంద్రీవటి) ఉంది. పందిరి అనే పదం పండవ అనే పదాన్ని సూచిస్తుంది.
- లవన్ గ్రామం బింద్ తాలూకాలో ఉంది. రామ్ కథా కోసం తులసీదాస్ (రామ కథ) కు ముందున్న అయిన బింద్ తహసిల్ "విష్నుదస్" పుట్టిన గ్రామం. అయనకు "సహజ్ఞథ్" అనే పేరు ఉండేది.
- భవానీ గౌరీ సరోవర్ పృధ్వి రాజ్ చౌహాన్ బింద్ పట్టణం వద్ద నిర్మించిన చెరువు ఉంది.
- మచ్హంద్ :- ఇది మిహొన తాలూకాలోని గ్రామం. మచ్హెంద్రనథ్ గురు గోరఖ్నాథ్ తపస్సు చేసిన ప్రదేశం.
- బిజ్పురి :- ఇది బింద్ టెహ్సిల్ లో ఒక గ్రామం. ఇక్కడ గొపచల్ కోట (గ్వాలియార్ కోట) నుండి వచ్చిన తర్వాత సన్యాసి గ్వలవ్ సమాధి అయిన ప్రదేశం ఉంది.
- బొరెష్వర్ :- ఇది అతర్ తాలూకాలోని దుళగన్ గ్రామం వద్ద ఉన్న ఈ గ్రామంలో ఒక పురాతన శివాలయం.
- సపద్- సమ్మన గ్రామాలలో పౌరాణిక మహర్షు శృంగి ఆశ్రమం ఉంది. ఇవి చంబల్ నదీ తీరంలో ఉన్న గ్రామాలు. శృంగి మహర్షి దశరథ మహారాజు కోసం పుత్రకామేష్టి యాగం చేసాడు.
- మెహొని గ్రామం :- ఇది బుందేల్ఖండ్ (10వ-13వ శతాబ్దము ) రాజధానిగ ఉండేది. దీనిని వీర్ పాల్ బుందెల పాలించినందున దీనిని వీర్ఘర్ అని పిలుస్తారు.
- చిలొంగ గ్రామం బింద్ తాలూకాలో చంబల్ నది ఒడ్డున ఉంది. ఇది భదౌరీ (బింద్, చంబల్ ఇతర ప్రాంతాలను పాలించిన పురాతన రాజపుత్ర వంశం పాలకుల ) యొక్క నివాస పట్టణం, ఇక్కడ పేరుపొందిందిన శాల వాలే బాబా ఆశ్రమం ఉంది.
- పిదొర గ్రామంలో మొతెబాబా స్థాపించిన ఒక పాఠశాల, ఆసుపత్రి, పోస్ట్ ఆఫీస్, చౌదరి (మొతెబాబా) శ్రీ ఆశ్రమం, శ్రీ రాజారాం సమధియ ఉన్నాయి. బాబారచనలు, ఇతర వికాసాలు ఉన్న చిన్న గ్రామం.
- అందొర్ చీమక గ్రామానికి సమీపంలో ఒక గ్రామం ఉంది.
- ఆందొరి గ్రామం నుండి 50% యువకులు భారత సైన్యంలో పచేస్తున్నారు.
- భదవర్ మహారాజ కోట: బింద్ తాలూకా సమీపంలోని పట్టణంలో ఉంది. ఈ కోట భదౌరీ వంశానికి చెందినది.
- రతన్ గార్డ్
- బర్హద్ ఈ స్థానంలో అనేక రావి చెట్లు ఉన్నందున ఈ ప్రదేశానికి ఈ పేరు వచ్చింది. ఇక్కడ 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక విష్ణు మందిరం కూడా ఉంది.
- మహర్షి పరశురాముడు బింద్ సమీపంలో జన్మించాడు.
- భత్మస్పుర గ్రామంలో ఇక్ష పూర్ణ హనుమాన్ జీ ఆలయం ఉంది. శివుడు, గదైయ బలి కామ్నా పూర్ణ దుర్గ రెండు అనే అతిపెద్ద చెరువు యొక్క ఒక పురాతన ఆలయం ఉన్నాయి.
లోయలు
మార్చుజిల్లాలో అత్యధికంగా నదులు ప్రవహిస్తున్నాయి. జలప్రవాహాల కారణంగా భూమి కోతకు గురౌతూ ఉంటుంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయం మీద దృష్టి కేంద్రీకరించి నీటి పారుదల క్రమబద్ధీకరణ, ఏరియల్ సీడింగ్ వంటి పథకాలను చేపట్టింది. లోయలలో ప్రొసోపిస్, అకాసియా, జత్రోఫా వంటి విత్తనాలు వెదజల్లబడుతున్నాయి. అయినప్పటికీ కథినభూమిని సారవంతం చేయడం అసాధ్యంగానే ఉంది. ఒకప్పుడు దోపిడీదారుల స్థావరంగా ఉన్న ఈ ప్రాంతం ప్రస్తుతం పర్యాట్కులకు ఆతిథ్య ఇస్తూ సాహసయాత్రానుభూతిని కలిగిస్తుంది.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,703,562, [2] |
ఇది దాదాపు. | గాంబియా దేశ జనసంఖ్యకు సమానం.[3] |
అమెరికాలోని. | నెబర్‌స్కా నగర జనసంఖ్యకు సమం.[4] |
640 భారతదేశ జిల్లాలలో. | 286 వ స్థానంలో ఉంది.[2] |
1చ.కి.మీ జనసాంద్రత. | 382 [2] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 19.25%.[2] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 838:1000 [2] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 76.59%.[2] |
జాతియ సరాసరి (72%) కంటే. |
ప్రముఖులు
మార్చు- పాన్ సింగ్ తోమర్ :- మొరేనాా జిల్లాలోని పోర్సా సమీపంలో భిదోసా గ్రామంలో ఉంది. ఆయన భారతీయ సైనికుడు, క్రీడాకారుడు, చంబల్ లోయ డెకాయిట్.
ఆయన జీవిత గాథ ఆధారంగా చలనచిత్రం తీయబడింది. 1983లో ఆయన కాల్చి చంపబడ్డాడు.
- శ్రీ విజయ్ గౌతం:- ఇండియన్ ఇంజనీరింగ్, మినిస్టరీ ఆఫ్ రైల్వే అధికారి.
పర్యాటక ఆకర్షణలు
మార్చుమల్హర్రావ్ హోల్కర్
మార్చు1766లో మహారాణి అహల్యాభాయి హోల్కర్ " మల్హర్ రావు హోల్కర్ " ఛత్రిని నిర్మించాడు. ఛత్రిలో అద్భుతమైన కుడ్యశిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఇది ఇండోర్‌ను పాలించిన హోల్కర్ శైలిలో నిర్మించబడింది. ఇక్కడ చెక్కబడిన పూలు, ఆకులు అద్భుత సౌందర్యంతో ఉంటాయి. మరాఠీ శైలిలో ఉన్న ఛత్రిలో అందంగా చెక్కబడిన శిఖరాలతో కూడిన ఆర్చీలు ఉన్నాయి. ఛత్రి మొదటి అంతస్తులో అనదమైన చిత్రాలతో, స్థాంభాలతో నిర్మించబడిన హాలు ఉంటుంది.
ష్రీ రావత్‌పురా ధామ్
మార్చుబింద్ జిల్లాలోని లహర్ తాలూకాలో ప్రముఖ హనుమాన్ ఆలయం ఉంది. దీనిని ష్రీ రావత్‌పురా ధాం అంటారు. ఇది చాలా అందంగా ప్రశాంతంగా ఉంటుంది. మహాభారతంలో ఈ ప్రాంతం గురించిన ప్రస్తావన ఉంది.
అతర్ కోట
మార్చుఈ కోట బింద్ పట్టణానికి 35 కి.మీ దూరం, పోర్సా నుండి 40 కి.మీ దూరంలో ఉంది. 1664-1668 లో దీనిని భౌదౌలా రాజులు బదన్ సింగ్, మహా సింగ్, బఖత్ సింగ్ నిర్మించారు. ఈ కోట చంబల్ తీరంలో ఉంది.
- అతర్ తాలూకాలోని మేఘరా గ్రామంలో ఒక ఖాళీ ఆలయం ఉంది. అతర్ కోటకు 15 కి.మీ దూరంలో ఉంది. దీనిని 1681లో పురువంశి సమాజి నిర్మించాడు.
జైన ఆలయం
మార్చుజిల్లాలోని మెహ్గావ్ తాలూకాలో బరసన్ వద్ద మహావీరుని ఆలయం ఉంది. ఇది అతిష్య క్షేత్రాలలో ఒకటి. మహావీరుడు కైవక్యం పొందిన తరువాత ఈ ప్రదేశానికి వచ్చడని అందువలన ఇక్కడ ఆలయం నిర్మించబడిందని భావిస్తున్నారు. ఈ పవిత్రక్షేత్రం బేతుల్ నగరానికి 14 కి.మీ దూరంలో ఉంది.
- బింద్ పట్టణానికి సమీపంలో ఉన్న పావైలో నెమి నాథ్ ఆలయం ఉంది. బర్హి వద్ద పర్స్వనాథ్ ఆలయం ఉంది. ఇది బింద్ పట్టణానికి 20 కి.మీ దూరంలో ఎతవా జిల్లా సరిహద్దులో చంబల్ తీరంలో ఉంది.
- సిమర్ బరిగ్మా వద్ద దిగంబర్ జైన్ పరస్‌నాథ్ జినాలయ ఉంది. ఇది బింద్ పట్టణానికి 20 కి.మీ దూరంలో ఉంది. బింద్ పట్టణంలో మాత్రమే దాదాపు 60 జైన ఆలయాలు ఉన్నాయి.
మాతా రేణుకా ఆలయం
మార్చుమాతా రేణుకా ఆలయం :- ఈ ఆలయం గోహద్ తాలూకాలోని జందరా గ్రామంలో ఉంది. ఇది బింద్ ప్ట్టణానికి 45 కి.మీ దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని పరశురాముడు నిర్మించాడని విశ్వసిస్తున్నారు.
నారదదేవ్ ఆలయం
మార్చుకాళి సింధ్ నదీతీరంలో నారదుని పురాతన ఆలయం ఉంది, ఇది లహర్ మదోరి రోడ్డుకు 1 కి.మీ దూరంలో ఉంది.
నేషనల్ విల్డ్ లైఫ్ శాంక్చ్యురీ
మార్చునేషనల్ వన్యప్రాణి అభయారణ్యం చంబల్నదీతీరంలో ఉంది. ఇక్కడ మొసళ్ళు, ఘరియాలు, గంగాలు, డాల్ఫిన్లు, పలు వలస పక్షులు ఉన్నాయి. ప్రాంతీయ పర్యాటక నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్న బోటు పర్యటన కూడా ఉంది. బింద్ పట్టణానికి ఇది 22 కి.మీ దూరంలో ఉంది.
గొహద్ కోట
మార్చు16వ శతాబ్దంలో జాట్ రాజు మాతా సింగ్ గొహద్ కోటను నిర్మించాడు. ప్రస్తుతం ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి..
సూర్య ఆలయం
మార్చుసూర్య ఆలయం బింద్ పట్టణానికి 42 కి.మీ దూరంలో మిహోనా తాలూకాలో ఉంది. దీనిని బాలాజీ ఆలయం అని కూడా అంటారు.
దంద్రుయా ఆలయం
మార్చుఇది పురాతన హిందూ ఆలయం. ఈ ఆలయం అనేకమంది భక్తులను ఆకర్షిస్తుంది. లహర్‌కు 10 కి.మీ దూరంలో హీరాపురా వద్ద పచముఖ హనుమాన్ మందిరం ఉంది.
జమనవేల్ హనుమాన్‌జి
మార్చుఇది ప్రముఖ హనుమాన్ మందిరం.
మలంపూర్
మార్చుఇది శీఘ్రగతిలో అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక నగరం. ఇది గ్వాలియర్ తాలూకాలో ఉంది. బింద్ పట్టణానికి 65 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ ఆటోమొబైల్, బైసైకిల్, సబ్బులు, డిటర్జెంటు, ఎలెక్ట్రానిక్కులు, ఫుడ్, డైరీ ప్రొడక్టులు కంపనీలు ఉన్నాయి.
బయటి లింకులు
మార్చుమూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2016-03-04. Retrieved 2014-11-23.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Gambia, The 1,797,860 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Nebraska 1,826,341