దతియా జిల్లా

మధ్య ప్రదేశ్ లోని జిల్లా

మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో దతియ జిల్లా (హిందీ:) ఒకటి. దతియా పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. దతియా జిల్లా గ్వాలియర్ డివిజన్‌లో భాగం.

దతియా జిల్లా
दतिया जिला
మధ్య ప్రదేశ్ పటంలో దతియా జిల్లా స్థానం
మధ్య ప్రదేశ్ పటంలో దతియా జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
డివిజనుగ్యాలియర్ డివిజను
ముఖ్య పట్టణందతియా
మండలాలుదతియా, సెయోంధ, భందర్
Government
 • లోకసభ నియోజకవర్గాలుభిండ్ లోక్‌సభ నియోజకవర్గం
 • శాసనసభ నియోజకవర్గాలుదతియా, సెయోంధ, భందర్
విస్తీర్ణం
 • మొత్తం2,902 కి.మీ2 (1,120 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం7,86,754
 • జనసాంద్రత270/కి.మీ2 (700/చ. మై.)
 • Urban
1,81,976
జనాభా వివరాలు
 • అక్షరాస్యత72.63%
 • లింగ నిష్పత్తి873
ప్రధాన రహదార్లుN75
Websiteఅధికారిక జాలస్థలి
బీర్ సింగ్ దేవ్ ప్యాలెస్

చరిత్ర

మార్చు

ఇది పురాతన పట్టణం. మహాభారతంలో దీనిని గురించిన ప్రస్తావన ఉంది. మహాభారతకాలంలో ఇది దైత్యవక్ర అని పిలువబడింది. ఇది గతంలో బుండేల్‌ఖండ్ భూభాగంలో ఉంది. బుండేలా వంశానికి చెందిన రాజపుత్రులు ఈ ప్రాంతాన్ని పాలించారు. బుండేలా వంశజులు రాజా ఆర్చా చిన్న కుమారుని సంతతికి చెందిన వారు. మధ్యప్రదేశ్‌లోని బుండేల్ఖండ్ రాజ్యంలో ఈ ప్రాంతం భాగంగా ఉండేది. బుండేల్‌ఖండ్‌కు ఇది పూర్తిగా ఈశాన్యభూభాగంలో గ్వాలియర్‌కు సమీపంలో ఉంది. చుట్టు ఇతర రాజాస్థానాలు ఉండేవి. బుండేలా సామ్రాజ్యంలో ఇది వైశాల్యపరంగా రెండవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఆర్చా రాజాస్థానం ఉంది. భూభాగ వైశాల్యం 2130 చ.కి.మీ. 1901లో జనసంఖ్య 1759. 1950 దతియా బుండేల్ఖండ్ ఏజెంసీతో సహా కొత్తగా రూపొందిన వింధ్యప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా ఉండేది. 1956లో విద్యప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేయబడింది.

భౌగోళికం

మార్చు

2011లో దతియా జనసంఖ్య 786,754. వీరిలో స్త్రీలు 420,157. పురుషులు 366,597. జిల్లా వైశాల్యం 2,902 చ.కి.మీ. 2001 జనసంఖ్య 627,818 . 1981-1991 మద్యకాలంలో దతియా జనసంఖ్య 26% అభివృద్ధి చెందింది. 1991-2001 మద్యకాలంలో దతియా జనసంఖ్య 22% అభివృద్ధి చెందుంది. జిల్లాలో 445 గ్రామాలు, 3 పట్టణాలు, (దతియ, సెయోంధ, భందర్) ఉన్నాయి. ప్రతి పట్టణం తాలూకా కేంద్రంగా ఉంది.[1]

సరిహద్దులు

మార్చు

దతియా జిల్లా ఉత్తర సరిహద్దులో భిండ్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో గ్వాలియర్ జిల్లా, దక్షిణ సరిహద్దులో శివ్‌పురి జిల్లా, తూర్పు సరిహద్దులో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఝాన్సీ జిల్లా ఉన్నాయి..[1]

 
Veer Singh Palace

పర్యాటక ప్రదేశం

మార్చు

దతియలో పలు ప్రఖ్యాత ఆలయాలు ఉన్నాయి . పీతాంబర పీఠం అనేకమంది భక్తులను ఆకర్షిస్తుంది. జిల్లాలో ఇంకా హనుమాన్‌ఘర్ ఆలయం ఉంది. అద్భుత నిర్మాణ వైభవానికి ప్రతీకగా నిలిచిన పూర్ణా మహల్ (దతియా మహల్) గ్వాలియర్- ఝాన్సీ రైలు మార్గంలో కనిపిస్తూ ఉంటుంది. జహంగీర్ పట్టాభిషేకం తరువాత జహంగీర్‌ను ఆహ్వానించడానికి ఈ భవనం నిర్మించబడింది. అయినప్పటికీ ఇక్కడకు జహంగీర్ రానేలేదు. రత్నగిరి మాత, సోనగిరి - ఆలయం, శ్రీ సిధ్ బాబా మందిర్ (కుర్థట, బీర్ సింగ్ దేవ్ మహల్, ఉన్నావ్ - బాలాజీ సూర్యదేవాలయం, రాజ్‌గర్ రాజభవనం, గుజరా మ్యూజియం మొదలైనవి ఉన్నాయి.

నీటిపారుదల

మార్చు

దతియా జిల్లా గంగాటిక్ నీటిపారుదల విధానంలో ఉంది. జిల్లాలో సింధు, పహుల్, మహౌర్, బెత్వ నదీజలాలు వ్యవసాయానికి అవసరమైన నీటిని అందిస్తున్నాయి. నదులు వర్షాధారంగా ప్రవహిస్తుంటాయి కనుక వర్షాలు అధికంగా ఉండే జూన్- ఆగస్టు మాత్రమే వ్యవసాయానికి నీరు అందుతూ ఉంది. వేసవిలో నీటి ప్రవాహాలు ఎండిపోతాయి కనుక ప్రధాన ప్రవాహం నుండి కొన్ని నీటి కాలవల నుండి మాత్రమే వ్యవసాయ భూములకు నీటిని అందిస్తున్నాయి.

2011 గణాంకాలు

మార్చు
 
District Court at RamNagar
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 786,754[2]
ఇది దాదాపు. కొమరోస్ దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. సౌత్ డకోటా నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 487 వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 271 .[2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 18.4%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 873:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 72.63%.[2]
జాతియ సరాసరి (72%) కంటే.
గ్రామీణ ప్రజలు 76.87 [2]

భాషలు

మార్చు

జిల్లాలో ఖడిబీలి (బుండేలీ) భాష వాడుకలో ఉంది. ఇది కాక జిల్లాలో వాడుకలో ఉన్న భాషలలో ద్రావిడ భాషాకుటుంబానికి చెందిన భరియా భాష ప్రధానమైనది. భరియాభాష 2,00,000 మంది ప్రజలకు (షెడ్యూల్డ్ తెగల ప్రజలకు) వాడుక భాషగా ఉంది. ఈ భాష వ్రాయడానికి దేవనాగరి లిపిని వాడుతున్నారు.[5]

2001 గణాంకాల ప్రకారం జిల్లాలో 96% ప్రజలు హిందువులు ఇతర మతస్తులు 4% ఉన్నారు.

సంస్కృతి

మార్చు

దతియా జిల్లాలో పలు విధాలైన వినోదాలు ఉన్నాయి.

సంగీతం

మార్చు

జిల్లాలో బుండేల్ ఖండ్ లోక్‌గీత్, ఫాగ్, అల్హా, కబ్బలి మంటి జానపద సగీతం వాడుకలో ఉంది. వీటిని దాదాపు అన్ని గ్రామాలలో ఈ సంగీతం వినడానికి అవకాశం ఉంది. జిల్లాలో రాజేద్ర సింగ్, దేష్‌రాజ్ పతరియా జీ వంటి ప్రముఖ రాజకీయ నాయకులు ఉన్నారు.

నృత్యం

మార్చు

రాయ్ నృత్యం ప్రాబల్యంలో ఉంది. హినారాణి బృందం, జిల్లాలో గుయియారాణి బృందం వంటి గుర్తించబడిన నాట్యబృదాలు ఉన్నాయి.

ఆర్ధికం

మార్చు

జిల్లాలో ప్రధానంగా ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. జిల్లాలో 70% మది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. 30% ప్రజలు " అగ్రో సాల్వెంట్ " కంపెనీలో పనిచేస్తున్నారు.

ప్రయాణసౌకర్యాలు

మార్చు
  • గునజిల్లా పశ్చిమ మధ్య రైల్వే మార్గాలలో ఒకటైన భోపాల్, ఢిల్లీ రైలు మార్గంతో అనుసంధానించబడుతుంది.
  • జతీయ రహదారి -75 తో జిల్లా అనుసంధానమై ఉంది.

ఎడ్యుకేషన్

మార్చు

2011 జనాభా లెక్కల ప్రకారం దతియా జిల్లాలో 750 మాధ్యమిక, 500 ప్రాథమిక,, 250 అధిక ప్రసిద్ధి చెందిన పాఠశాలలు ఉన్నాయి.

  • ప్రిన్సిపాల్ పి.జి కాలేజ్ దతియా
  • ప్రిన్సిపాల్ పి.జి. కాలేజ్ (గర్ల్స్) దతియా
  • ప్రిన్సిపాల్, గోవింద్ పి.జి.డి.సి సియోంధ
  • ప్రిన్సిపాల్ పి.జి కాలేజ్, భందర్
  • ప్రిన్సిపాల్ హెచ్.ఎస్.ఎస్ 1 దతియా 233113
  • ప్రిన్సిపాల్ హెచ్.ఎస్.ఎస్ 2 దతియా 233290
  • ప్రిన్సిపాల్ ఎం.ఎల్.బి బాలికల హెచ్.ఎస్.ఎస్ . దతియా
  • ప్రిన్సిపాల్ హెచ్.ఎస్.ఎస్ . బసై
  • ప్రిన్సిపాల్ హెచ్.ఎస్.ఎస్. ఉనావ్
  • ప్రిన్సిపాల్ హెచ్.ఎస్.ఎస్ . బదోని
  • ప్రిన్సిపాల్ హెచ్.ఎస్.ఎస్ బీకర్
  • ప్రిన్సిపాల్ హెచ్.ఎస్.ఎస్. ఉప్రైన్
  • ప్రిన్సిపాల్ హెచ్.ఎస్.ఎస్ . ఎరై
  • ప్రిన్సిపాల్ హెచ్.ఎస్.ఎస్ (బాయ్స్), ఇంద్రఘర్
  • ప్రిన్సిపాల్ హెచ్.ఎస్.ఎస్ (గర్ల్స్), ఇంద్రఘర్
  • ప్రిన్సిపాల్ హెచ్.ఎస్.ఎస్ . Uchad
  • ప్రిన్సిపాల్ హెచ్.ఎస్.ఎస్ (బాయ్స్) సియోంధ
  • ప్రిన్సిపాల్ హెచ్.ఎస్.ఎస్ (గర్ల్స్) సియోంధ
  • ప్రిన్సిపాల్ హెచ్.ఎస్.ఎస్ థరెట్
  • ప్రిన్సిపాల్ హెచ్.ఎస్.ఎస్ భగువపురా
  • ప్రిన్సిపాల్ హై స్కూల్, రరుపురై
  • ప్రిన్సిపాల్ హెచ్.ఎస్.ఎస్ హెచ్.ఎస్.సివిల్ లైన్ దతియా
  • ప్రిన్సిపాల్ హెచ్.ఎస్.ఎస్ బుధెడా
  • ప్రిన్సిపాల్ హై స్కూల్, బదొంకలా
  • ప్రిన్సిపాల్ హై స్కూల్, బుధెడా బర్ధువ
  • ప్రిన్సిపాల్ హై స్కూల్, గోదాన్
  • ప్రిన్సిపాల్ హెచ్.ఎస్.ఎస్ (బాయ్స్) భందర్
  • ప్రిన్సిపాల్ హెచ్.ఎస్.ఎస్. (గర్ల్స్) భందర్
  • సమర్థత దతియా స్కూల్
  • అపేక్షితుడు ఇంటర్నేషనల్ స్కూల్ (మీ లక్ మార్చండి అంకితం)

పాఠశాలలు

మార్చు
  • సరస్వతి విద్యా మందిర్ భరత్గర్
  • హోలీ క్రాస్ ఆశ్రమం స్కూల్
  • రాణి లక్ష్మిబాయి పబ్లిక్ స్కూల్
  • లిటిల్ ఫ్లవర్ స్కూల్, రాజ్గర్ చొరహ
  • గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్ 1
  • గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్ 2
  • ప్రభుత్వ గర్ల్ స్కూల్
  • రాజీవ్ విద్యాలయ
  • మహిళా సమితి స్కూల్
  • రాస్ జె.బి ప్రొఫెషనల్ అధ్యయనాలు
  • భాస్కర్ స్కూల్ (ఒ.పి గుప్తా) బుందెల కాలనీలో
  • కాలేజ్ అడ్వాన్స్డ్ స్టడీస్
  • సెయింట్ కోల్బ్ స్కూల్, ఇందర్గర్
  • గురుకుల్ ప్రభుత్వ పాఠశాల
  • లార్డ్ కృష్ణ పబ్లిక్ స్కూల్
  • అవస్థి కంప్యూటర్ సెంటర్
  • గైడెన్స్ ప్రభుత్వ పాఠశాల ఇందర్గర్
  • విద్యాష్రాయ్ స్కూల్ ఇందర్గర్ 9827210405
  • ఎస్.ఆర్.ఐ ఆధ్వర్యంలో 5 కాలేజీలు ఇంజనీరింగ్, ఫార్మసీ, బి.ఈ.డి, డి.ఎ.డి, నర్సింగ్, అలైడ్ సైన్సు మొదలైన రంగాలో అంతర్జాతీయ స్థాయి విద్యను అందిస్తుంది. అన్ని విద్యా సంస్థలు, ఇంస్టిట్యూట్స్‌ను స్వయంప్రతిపత్తిన పనిచేస్తున్న నమోదుచేయబడిన " శ్రీ రామరాజ సర్కార్ లోక్ కల్యాణ్ ట్రస్ట్ " స్థాపించి నిర్వహిస్తుంది.
  • శ్రీ రావత్పురా గ్రూప్ ఆఫ్ కాలేజీలు Archived 2014-12-22 at the Wayback Machine

ఇతర విద్యాసంస్థలు

మార్చు
  • (ఎస్.ఆర్.జి.ఒ.సి ) ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంస్థలు :[6]-
    • టెక్నాలజీ & సైన్స్ శ్రీ రావత్పురా ఇన్స్టిట్యూట్ (ఎస్.ఆర్.టి.ఎస్ )
    • శ్రీ రావత్పురా మేనేజ్మెంట్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్ (ఎస్.ఆర్.ఎం.ఎస్ )
    • శ్రీ రావత్పురా ఇన్స్టిట్యూట్ (ఎస్.ఆర్. ఐ.పి ) ఫార్మసి
    • శ్రీ రావత్పురా కాలేజ్ (ఎస్.ఆర్.సి.ఎన్) నర్సింగ్
    • శ్రీ రావత్పురా కాలేజ్ (ఎస్.ఆర్.ఎస్.సి.పు.ఇ ) ఫిజికల్ ఎడ్యుకేషన్
    • సైన్స్ & విద్య శ్రీ రావత్పురా సర్కార్ కోల్లెజ్ (ఎస్.ఆర్..సి.ఎస్.ఇ )
    • శ్రీ రావత్పురా సర్కార్ పాలిటెక్నిక్ కాలేజ్ (ఎస్.ఆర్.పి.సి)
    • శ్రీ రావత్పురా సర్కార్ ఇన్స్టిట్యూట్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్
    • శ్రీ రావత్పురా సర్కార్ స్నాతక్ మహావిద్యాలయ (ఎస్.ఆర్.ఎస్.ఎం.వి.)

క్రీడలు

మార్చు

జిల్లాలో కోకో, గిల్లీ దాండా, పిట్టు గరం (సిటోలియా), కబాడి, కుస్తీ, లంగ్డి వంటి సంప్రదాయ క్రీడలు ప్రాముఖ్యత సంతరించుకుని ఉన్నాయి.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Datia district". District Administration. Retrieved 2010-04-14.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Comoros 794,683 July 2011 est. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. South Dakota 814,180
  5. M. Paul Lewis, ed. (2009). "Bharia: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
  6. "Shri Rawatpura Group of Colleges". Archived from the original on 2014-12-22. Retrieved 2014-11-23.

బయటి లింకులు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు