మావుళ్ళమ్మ దేవస్థానం, భీమవరం

భీమవరం మావుళ్ళమ్మ విజయవాడ కనకదుర్గ తరువాత అంతటి మహిమాన్వితమైన తల్లిగా కొలిచే దేవత. తొమ్మిది దశాబ్దాల క్రిందట భీమవరం అనే కుగ్రామమంలో వెలసిన అమ్మవారు విపరీతమైన ప్రజాదరణ పొందుతూ శక్తి స్వరూపిణిగా విలసిల్లుతూ ఉంది. ఆమె విశిష్ట రూపం దేవతలలో మరెవరికీ కానరాదని అంటారు.

మావుళ్ళమ్మ దేవాలయం
మావుళ్ళమ్మ దేవాలయము, భీమవరం
మావుళ్ళమ్మ దేవాలయం is located in Andhra Pradesh
మావుళ్ళమ్మ దేవాలయం
మావుళ్ళమ్మ దేవాలయం
ఆంధ్రప్రదేశ్ లో ఆలయ ఉనికి
భౌగోళికాంశాలు :16°32′00″N 81°32′00″E / 16.5333°N 81.5333°E / 16.5333; 81.5333
పేరు
ప్రధాన పేరు :మావుళ్ళమ్మ దేవాలయము, భీమవరం
ప్రదేశం
దేశం:భారత్
రాష్ట్రం:ఆంధ్ర ప్రదేశ్
జిల్లా:పశ్చిమగోదావరి
ప్రదేశం:భీమవరంపశ్చిమగోదావరి
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:శివ
భీమవరం మావుళ్ళమ్మ దేవాలయము ఉత్సవ చిత్రాలు
భీమవరం మావుళ్ళమ్మ దేవాలయము ఉత్సవ చిత్రాలు
భీమవరం మావుళ్ళమ్మ దేవాలయము ఉత్సవ చిత్రాలు

చారిత్రక నేపథ్యం

మార్చు

చారిత్రక నేపథ్యాన్ని అనుసరించి మావుళ్ళమ్మ వారి చరిత్రవిశేషాలు ఈ విధంగా ఉన్నాయి.1880 వైశాఖ మాసం రోజులల్లో భీమవరం గ్రామానికి చెందిన మారెళ్ళ మంచిరాజు, గ్రంథి అప్పన్నలకు అమ్మవారు కలలో కనిపించి తాను వెలసిన ప్రాంతాన్ని గురించి చెపుతూ ఇక్కడే తనకు ఆలయం నిర్మించాలని కోరినది. మరుసటి రోజున వారిరువురు ఆప్రాంతానికి వెదుకగా అమ్మవారి విగ్రహం లభ్యమయినది. అటునుండి వారు అక్కడ ఒక పాక వేసి అమ్మవారిని అక్కడ నిలిపిఉంచారు. అమ్మవారి ఆదేశానుసారం వారు అయిదు దీపాలు ఉన్న ప్రాంతంలో ఆలయం నిర్మించారు. మామిడితోటలో వెలసిన అమ్మవారిని తొలినాళ్ళలో 'మామిళ్ళమ్మ'గా తదనంతరం 'మావుళ్ళమ్మ'గా పిలవటం అలవాటయ్యింది. ప్రస్తుతం ఈ ఊరిలోని మోటుపల్లి వారి వీధిలో అమ్మవారి గరగలు భద్రపరిచేందుకు నిర్మించిన భవన ప్రాంతంలో ఉన్న వేప, రావి చెట్లు కలిసిన చోట అమ్మవారు వెలిసినట్లు స్థానికుల కథనము. అప్పన్న, మంచిరాజులు ఉన్న మోటుపల్లివారి వీధిలో ఉన్న అమ్మవారిని భీమవరం నడి మధ్యకు తీసుకొచ్చారు. అమ్మవారికి జాతర, ఉత్సవాలు వేరువేరుగా జరుపుతారు. మొదట్లో అమ్మవారికి అర్చకుడిగా ఒక రజకుడు ఉండేవాడు. అందువలన రజక సంఘం ఆద్వర్యంలో ఒకసారి పండ్ల, పూల, వర్తక సంఘము వారి ఆద్వర్యంలో ఒకసారి ఉత్సవాలు జరుగుతాయి. 1910 వ సంవత్సరంలో భీమవరాన్ని ముంచెత్తిన వరదల్లో అమ్మవారి విగ్రహం చాల వరకు పాడైంది. 1920 లో కాళ్ళ గ్రామానికి చెందిన శిల్పి తాతవోలు నాగభూషణాచార్యులు అమ్మవారి విగ్రహాన్ని మలిచాడు. కాని ఆ విగ్రహం భీకర రూపంలో ఉన్నందున గ్రంథి అప్పారావు అనే శిల్పి ఆ విగ్రహాన్ని శాంతి స్వరూపిణిగా తీర్చి దిద్దాడు.

ఆలయ విశిష్టత

మార్చు

ఈ క్షేత్రంలో గర్భాలయానికి ఇరువైపులా గౌతమ బుద్ధుని, రామకృష్ణ పరమహంస విగ్రహాలు ఉండడము ఇందలి ప్రత్యేకత. అమ్మవారి ఆలయానికి భక్తులు సమర్పించిన కానుకలు.... చీరలు వంటి వాటిద్వారా ప్రతియేటా రెండు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ప్రస్తుతం అమ్మవారికి ఆభారణాల రూపంలో 24 కిలోల బంగారం, 274 కిలోల వెండి వస్తువులు ఉన్నాయి. అమ్మవారికి 65 కిలోల బంగారంతో చీర ఆభరణాలు తయారు చేయించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి సుమారు 20 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా. దీని కొరకు స్థానిక ప్రముఖులు.... విదేశాలలో ఉన్నవారు స్పందిస్తున్నారు. అమ్మవారికి 16 కిలోల బంగారంతో త్రిశూలం, ఢమరుకం తయారు చేశారు. ప్రస్తుతం అమ్మవారికి బంగారు కిరీటము, త్రిశూలము ఉన్నాయి. ఒక గ్రామ దేవతకు ఇంతటి సంపద ఉండడము, ఇంతటి పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరగడము దేశంలో మరెక్కడా లేదని అదే ఈ ఆలయ విశిష్టత అని పూజారి రామలింగేశ్వర శర్మ అంటాడు.

పూజలు, ఉత్సవాలు

మార్చు

ఈ క్షేత్రంలో ప్రతి నిత్యం పులిహోరను ప్రసాదంగా భక్తులకు ఉచితంగా అందిస్తారు. జ్యేష్టమాసంలో నెల రోజులు గ్రామ జాతర, నిర్వహిస్తారు. దేవీ నవరాత్రులలో అమ్మవారిని రోజుకొక అవతారంలో అలంకరిస్తారు. ప్రతి రోజు లక్ష కుంకుమార్చన, చండీ హోమం ఇతర పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఏడు జనవరి 13 నుండి దేవస్థానం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 40 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతారు. ఉత్సవాల చివరి 8 రోజులలో అమ్మవారిని అష్టలక్ష్ములుగా అలంకరించి పూజిస్తారు. చివరిరోజున వేలాదిమంది భక్తులకు అన్నదాన కార్యక్రమము జరుగుతుంది.

ఈక్షేత్రం ఎక్కడున్నది?

మార్చు

పశ్చిమగోదావరి జిల్లా ముఖ్య పట్టణమైన ఏలూరుకు సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న భీమవరంలో ఉన్నది ఈ క్షేత్రము

ఇతర విశేషాలు

మార్చు
  • ఇప్పుడూన్న మావుళ్ళమ్మ వారు శాంత స్వరూపిణిగా ఉంటారు. కొన్నేళ్లక్రితం వరకూ ఉగ్రరూపిణిగా ఉండే అమ్మవారిని చూచేందుకు భయపడేవిధంగా ఉండే అమ్మవారిని అనేక సార్లు మార్చుకొంటూ ఇప్పటి రూపానికి తీసుకొచ్చారు.

1910 సంవత్సరంలో వరదల కారణంగా అమ్మవారి విగ్రహం నీటిలో నాని చాలా వరకూ దెబ్బతిన్నది. దానితో కాళ్ళ గ్రామానికి చెందిన శిల్పి తాతవోలు నాగభూషణాచార్యులు అనే శిల్పి ద్వారా అమ్మవారి పునర్నిర్మాణం జరిగింది. గర్భాలయానికి నిండుగా అమ్మవారికి రూపాన్నిచ్చాడు. అయితే అప్పటికి ప్రలయభీకరంగా ఉన్న అమ్మవారిని శిల్పి గ్రంథి నర్సన్న కుమారుడు అప్పారావు శాంత స్వరూపిణిగా తీర్చిదిద్దారు. గర్భాలయానికి ఇరుప్రక్కలా అహింసకు ప్రతీకలైన రామకృష్ణ పరమ హంస, గౌతమ బుద్ధుడు విగ్రహాలను చెక్కారు.

  • మెంటే వెంకటస్వామి పూర్వికులు, అల్లూరి రామరాజు, భీమరాజుల కుటుంభీకులు అమ్మవారి పుట్టింటి వారు గానూ, గ్రంథి అప్పన్న, తదితరులు అమ్మవారి అత్తింటివారుగానూ వ్యవహరిస్తారు.

ఉత్సవ విశేషాలు

మార్చు
  • ఇక్కడి విశేషాలలో ముఖ్యమైనది అంతరించిపోతున్న కళలను ఆదరిస్తూ వారికి ప్రధర్శనలకు పిలుస్తూ తగిన పారితోషికాలతో ప్రోత్సాహీమ్చడం. ఇక్కడ తొలిరోజు హరికథతో ప్రారంభించి ప్రదర్శనలు ఇలా జరుగుతుంటాయి.

బుర్రకథలు, హరి కథలు, కోలాటాలు, భజనలు, సంగీత కఛేరీలు, పురాణ ప్రవచనాలు, కంజరి కథలు, ఏకపాత్రాభ్నయాలు. ఇలా అనేక ప్రధర్శనలు జరుపుతుంటారు. ఇక్కడ ఉత్సవాలకు ఎప్పటికప్పుడు వ్యయం పెరుగుతూ ఉంది. ప్రస్తుత లెక్కల ప్రకారం నలభై లక్షల నుండి యాభై లక్షల వరకూ ఉంది.

ఉత్సవాలలో ఇప్పటి వరకూ సన్మానం పొందిన సినిమా వారు

మార్చు

స్వర్ణ శోభితమైన మావుళ్ళమ్మ సన్నిధి భక్తులకే కాదు అనేకానేక కాళాకారులకూ గుర్తింపునిచ్చే వేదికగా వెలుగొందుతున్నది.

ఇతర కళాకారులు

మార్చు
  • కె.అమ్మాణి (ఈమె గత 33 సంవత్సరాలుగా ఇక్కడ హరికథ చెపుతున్నారు)

ఉత్సవాలలో నాటక సమాజాలు

మార్చు

మూలాలు

మార్చు

యితర లింకులు

మార్చు