భూపాలపల్లి మండలం

తెలంగాణ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని మండలం

భుాపాలపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మండలం.[1]. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం వరంగల్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం భూపాలపల్లి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ములుగు డివిజనులో ఉండేది. ఈ మండలంలో 21  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం. మండల కేంద్రం భూపాలపల్లి.

భూపాలపల్లి
—  మండలం  —
తెలంగాణ పటంలో జయశంకర్ జిల్లా, భూపాలపల్లి స్థానాలు
తెలంగాణ పటంలో జయశంకర్ జిల్లా, భూపాలపల్లి స్థానాలు
తెలంగాణ పటంలో జయశంకర్ జిల్లా, భూపాలపల్లి స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జయశంకర్ జిల్లా
మండల కేంద్రం భూపాలపల్లి
గ్రామాలు 20
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 412 km² (159.1 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 86,729
 - పురుషులు 43,855
 - స్త్రీలు 42,874
అక్షరాస్యత (2011)
 - మొత్తం 66.78%
 - పురుషులు 67.84%
 - స్త్రీలు 53.45%
పిన్‌కోడ్ {{{pincode}}}

గణాంకాలు మార్చు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త వరంగల్ జిల్లా పటంలో మండల స్థానం

2011 జనాభా లెక్కల ప్రకారం భూపాలపల్లి మండలం మొత్తం జనాభా 86,729. వీరిలో 43,855 మంది పురుషులు కాగా, 42,874 మంది స్త్రీలు. మండలంలో మొత్తం 22,270 కుటుంబాలు ఉన్నాయి.మండల సగటు లింగ నిష్పత్తి 978. మొత్తం జనాభాలో 48.9% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, 51.1% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత రేటు 76.6% కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 57.3% ఉంది. అలాగే మండలంలో పట్టణ ప్రాంతాల్లో లింగ నిష్పత్తి 943 కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 1,011గా ఉంది. మండలంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 7854, ఇది మొత్తం జనాభాలో 9%. 0-6 సంవత్సరాల మధ్య వయస్సు గల మగ పిల్లలు 4190, ఆడ పిల్లలు 3664 ఉన్నారు.మండలంలో బాలల లింగ నిష్పత్తి 874గా ఉంది, ఇది భూపాలపల్లి మండల సగటు లింగ నిష్పత్తి (978) కంటే తక్కువగా ఉంది. మండలం మొత్తం అక్షరాస్యత రేటు 66.78%. పురుషుల అక్షరాస్యత రేటు 67.84%, స్త్రీల అక్షరాస్యత రేటు 53.45%.[3]

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 412 చ.కి.మీ. కాగా, జనాభా 92,529. జనాభాలో పురుషులు 46,781 కాగా, స్త్రీల సంఖ్య 45,748. మండలంలో 23,862 గృహాలున్నాయి.[4]

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

గమనిక:నిర్జన గ్రామాలు ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 233 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "జయశంకర్ భూపాలపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-20 suggested (help)
  3. "Bhupalpalle Mandal Population, Religion, Caste Warangal district, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Retrieved 2022-07-29.[permanent dead link]
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు మార్చు