భూపాలపల్లి

భారతదేశంలోని గ్రామం
  ?భూపాలపల్లి
తెలంగాణ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 18°25′53″N 79°51′38″E / 18.4314°N 79.8605°E / 18.4314; 79.8605
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 52.62 కి.మీ² (20 చ.మై)[1]
జిల్లా (లు) వరంగల్ జిల్లా
జనాభా
జనసాంద్రత
42,387[2] (2011 నాటికి)
• 806/కి.మీ² (2,088/చ.మై)
అధికార భాష తెలుగు
పురపాలక సంఘం భూపాలపల్లి పురపాలకసంఘం


భూపాలపల్లి, తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ జిల్లా, భూపాలపల్లి మండలానికి చెందిన మునిసిపల్ పట్టణం.[3]ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు పరిపాలనా కెేంద్రం. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత వరంగల్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [4]

కొత్త జిల్లా పరిపాలనా కేంద్రంగా మార్పు. సవరించు

లోగడ "భూపాలపల్లి" వరంగల్ జిల్లాలో, ఒక రెవిన్యూ డివిజనుగా, మండలంగా ఉండేది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా వరంగల్ జిల్లాకు చెందిన 16 మండలాలు, కరీంనగర్ జిల్లాలకు చెందిన 5 మండలాలు కలిపి (1+20) ఇరవైఒక్క మండలాలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా పేరుతో నూతన జిల్లాగా ప్రకటించి, జిల్లా పరిపాలనా కేంద్రంగా భూపాలపల్లి ఉండేలాగున ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[5]

పౌర పరిపాలన సవరించు

భూపాలపల్లి నగర పంచాయతీగా 2012 లో ఏర్పడింది. ఈ పట్టణం అధికార పరిధి 52.62 km2 (20.32 sq mi).[1]

పట్జణ జనాభా సవరించు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం పట్టణ జనాభా  - మొత్తం 86,729 - పురుషులు 43,855 - స్త్రీలు 42,874.

శాసనసభ నియోజకవర్గం సవరించు

అభివృద్ధి పనులు సవరించు

  • 2022 మే 9: జిల్లా కేంద్రంలో 55 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 200 పడకల ఆస్ప‌త్రి, 50 పడకల ఆయుష్‌ దవాఖాన, 6 కోట్ల‌ రూపాయలతో ఏర్పాటు చేయనున్న రేడియోల‌జీ, పాథాల‌జీ ల్యాబ్స్‌లకు 2022 మే 9న తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖామంత్రి టి. హరీశ్ రావు శంకుస్థాపన చేశాడు. 100 పడకల హాస్పిటల్‌ను ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, మహిళా శిశు సంక్షేమ శాఖామంత్రి సత్యవతి రాథోడ్‌, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూధనాచారి తోపాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[6]
  • 2023 ఫిబ్రవరి 23: పట్టణంలోని మంజునగర్ ప్రాంతంలో 3 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రభుత్వ ఆధితి గృహాన్ని, 23 లక్షల రూపాయలతో నిర్మించిన దివ్యాంగుల భవనాన్ని, వేశాలపల్లి వద్ద 33.08 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన 544 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, 14.59 లక్షలతో నిర్మించిన వీధి వ్యాపారుల సముదాయం, సింగరేణి సంస్థ 229 కోట్ల రూపాయలతో నిర్మించిన 994 డబుల్ బెడ్ రూమ్ క్వార్టర్ల సముదాయాన్ని (రామప్ప కాలనీ) తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్ ప్రారంభించాడు. అలాగే జిల్లాకేంద్రంలో 4.50 కోట్ల రూపాయలతో నిర్మించనున్న సింగరేణి మినీ స్టేడియం, కోటి రూపాయలతో నిర్మించనున్న జిల్లా గ్రంథాలయ సంస్థ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశాడు. ఈ కార్యక్రమంలో మండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన చారి, భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, అదనపు కలెక్టర్ టిఎస్ దివాకర్ లతోపాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.[7]

మూలాలు సవరించు

  1. 1.0 1.1 "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Archived from the original (PDF) on 15 June 2016. Retrieved 28 June 2016.
  2. "Telangana (India): Districts, Cities, Towns and Outgrowth Wards - Population Statistics in Maps and Charts".
  3. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 233 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  4. "జయశంకర్ భూపాలపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch (help)
  5. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-08-26. Retrieved 2017-11-23.
  6. telugu, NT News (2022-05-09). "సిజేరియ‌న్లు చేయిస్తే దేవుడు కూడా వ‌ర‌మివ్వ‌డు : మంత్రి హ‌రీశ్ రావు". Namasthe Telangana. Archived from the original on 2022-05-09. Retrieved 2022-05-09.
  7. telugu, NT News (2023-02-23). "Minister KTR | జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో మంత్రి కేటీఆర్‌ సుడిగాలి పర్యటన". www.ntnews.com. Archived from the original on 2023-02-25. Retrieved 2023-02-25.

బయటి లింకులు సవరించు