భూమా నాగిరెడ్డి

భూమా నాగిరెడ్డి (1964 జనవరి 8 - 2017 మార్చి 12) ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక రాజకీయ నాయకుడు. అతను 1992 లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు మధ్యంతర ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు.[1] కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ శాసనసభ నియోజకవర్గానికి శాసనసభ్యునిగా ఉన్న ఈయన సోదరుడు భూమా శేఖర్‌రెడ్డి ఆకస్మిక మరణం చెందడంతో ఈయన ఈ స్థానానికి ఎంపికయ్యారు.

భూమా నాగిరెడ్డి
భూమా నాగిరెడ్డి


పదవీ కాలం
1996-1998
1998-1999
1999-2004
ముందు పి.వి.నరసింహారావు
తరువాత ఎస్.పి.వై.రెడ్డి
నియోజకవర్గం నంద్యాల

పదవీ కాలం
1992-1996
ముందు భూమా శేఖర‌రెడ్డి
తరువాత భూమా శోభా నాగిరెడ్డి
నియోజకవర్గం ఆళ్ళగడ్డ

వ్యక్తిగత వివరాలు

జననం (1964-01-08)1964 జనవరి 8
ఆళ్లగడ్డ, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్
మరణం 2017 మార్చి 12(2017-03-12) (వయసు 53)
రాజకీయ పార్టీ తెలుగు దేశం పార్టీ
తల్లిదండ్రులు భూమా బాలిరెడ్డి, ఈశ్వరమ్మ
జీవిత భాగస్వామి భూమా శోభా నాగిరెడ్డి
సంతానం భూమా అఖిల ప్రియ, భూమా నాగ మౌనిక, భూమా విఖ్యాత్
మతం హిందూ
మూలం [1]

1996 లో నంద్యాల లోక్‌సభ నియోజకవర్గంనకు ప్రధానమంత్రి పి.వి.నరసింహారావుపై పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ అతనిని ఎంపిక చేయడంతో ఈయన వెలుగులోకి వచ్చాడు. అతను 11వ, 12వ, 13వ లోక్‌సభ సభ్యునిగా మూడు సార్లు తన సేవలను అందించాడు. 2017 మర్చి 12 న గుండె పోటుతో మరణించారు.[2]

వ్యక్తిగత జీవితం

మార్చు

ఈయన దొర్నిపాడు మండలం కొత్తపల్లె యొక్క ఒక మారుమూల గ్రామంలో జన్మించారు. ఈయన తన తల్లిదండ్రులైన భూమా బాలిరెడ్డి, ఈశ్వరమ్మకు చిన్న కుమారుడు. ఆ ప్రాంతంలో ఉన్న కుటుంబ కక్షా రాజకీయాల కారణంగా తన తండ్రి బాలిరెడ్డి, తనని దూర ప్రదేశములలో ఉంచి చదివించాలని కోరుకున్నాడు. దీని ప్రకారం నాగిరెడ్డిని తమిళనాడు లోని చెన్నైలో CBSE కి అనుబంధంగా వెలంకన్ని ప్రైవేట్ పాఠశాలలో 10+2 చదివించాడు. ఆ తరువాత, నాగిరెడ్డి వైద్య విద్యను అభ్యసించడానికి బెంగుళూరు వెళ్ళారు. కానీ వెంటనే తన తండ్రి హత్యకు గురి కావడంతో తిరిగి వచ్చేశారు. ఈ సంఘటన కారణంగా తన జీవితం మారిపోయింది, తదుపరి రాయలసీమ ప్రాంతంలో ప్రసిద్ధ కక్షిదారునిగా మారారు. తరువాత తను సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి ఎస్.వి.సుబ్బారెడ్డి కుమార్తె శోభారాణిని వివాహం చేసుకున్నారు, వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.

మూలాలు

మార్చు
  1. "Archived copy". www.parliamentofindia.nic.in. Archived from the original on 18 August 2004. Retrieved 13 January 2022.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  2. "Parliament of India". Parliament of India. Retrieved 2017-03-14.