మంగమూరు

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం లోని గ్రామం


మంగమూరు, ప్రకాశం జిల్లా, సంతనూతలపాడు మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్ నం. 523 225., ఎస్.టి.డి.కోడ్ = 08592.

మంగమూరు
రెవిన్యూ గ్రామం
మంగమూరు is located in Andhra Pradesh
మంగమూరు
మంగమూరు
నిర్దేశాంకాలు: 15°30′N 79°58′E / 15.5°N 79.97°E / 15.5; 79.97Coordinates: 15°30′N 79°58′E / 15.5°N 79.97°E / 15.5; 79.97 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంసంతనూతలపాడు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం1,064 హె. (2,629 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తంString Module Error: Target string is empty
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08592 Edit this at Wikidata)
పిన్(PIN)523225 Edit this at Wikidata

గ్రామ చరిత్రసవరించు

ముంగమూరు ఒక అందమైన ఊరు ఈ ఊరిలో రామాలయం,శివాలయంవెంకటేశ్వరాలయం,వెంగమాంబలయం, మొదలుగునవి గుడులు ఉన్నాయి

గ్రామ భౌగోళికంసవరించు

సమీప గ్రామాలుసవరించు

సర్వేరెడ్డిపాలెం 5.7 కి.మీ, చిలకపాడు 5.8 కి.మీ, పేర్నమిట్ట 6.5 కి.మీ, ఒంగోలు7.3 కి.మీ,

సమీప పట్టణాలుసవరించు

సంతనూతలపాడు 8.2 కి.మీ, ఒంగోలు 10.5 కి.మీ, కొండేపి 12.3 కి.మీ, చీమకుర్తి 14.5 కి.మీ.

గ్రామంలోని విద్యా సౌకర్యాలుసవరించు

గ్రామంలో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, ప్రాథమిక ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల ఉన్నాయి. కళాశాల చదువు కోసం ఊరివాళ్ళు దగ్గరలోని పట్టణానికి వెళ్తూ ఉంటారు.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వరస్వామివారి ఆలయంసవరించు

  1. ఈ గ్రామంలోని శివాలయం అత్యంత పురాతనమైనది. సుమారు 400 సంవత్సరాలనాడు, మందపాటి రాజులకాలంలో, తమకు సంతానం లేదని, ఎండ్లూరు, సంతనూతలపాడు, రుద్రవరం, మైనంపాడు, మంగమూరు గ్రామాలలో శివాలయాలను పునహ్ ప్రతిష్ఠించారు. అదే క్రమంలో, ఈ గ్రామంలో ఏర్పాటు చేసిన శివాలయంగూడా ఆ రాజులు నిర్మించారు. ఈ దేవాలయాన్ని 1969 లో దేవాదాయ ధర్మాదయ శాఖకు అప్పగించారు. 2002 నుండి ఈ దేవాలయానికి ఉన్న 16.47 ఎకరాల మాన్యం భూముల కౌలుకు, బహిరంగ వేలం నిర్వహించుచున్నారు. ఆలయంలో అధికారులు, పూజా కార్యక్రమాలలో పట్టీపట్టనట్లు వ్యవహరించుచున్నారు. దేవుని మాన్యం నుండి ప్రతి సంవత్సరం ఆదాయం వస్తున్నా అధికారులు పట్టించుకున్న సందర్భాలు తక్కువైనవి. [2]
  2. ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, 2015, మే నెల 14వ తేదీనుండి 21వ తేదీ వరకు నిర్వహించుచున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా, 18వ తేదీ సోమవారంనాడు, స్వామివారి కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి, స్వామివారిని దర్శించుకొని, తీర్ధప్రసాదాలు స్వీకరించారు. [5]

శ్రీ సీతారామస్వామివారి ఆలయంసవరించు

  1. ఈ ఆలయంలో రాజగోపుర మహా సంప్రోక్షణ కార్యక్రమం, 2015, మే-31వ తేదీ, ఆదివారంనాడు నిర్వహించారు. ఉదయం పది గంటలకు, పూర్ణాహుతి, రాత్రికి, శ్రీ సీతారామస్వామివారల శాంతికళ్యాణ వేడుకలను నిర్వహించారు. [7]
  2. ఈ ఆలయానికి 83.79 ఎకరాల మాన్యం భూమి ఉన్నది, 16.25 ఎకరాల ఊరచెరువు గూడా ఉంది. [3]&[6]
  3. ఈ ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు, 2016, మే-18 నుండి 25 వరకు వైభవంగా నిర్వహించెదరు. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవాలు నిర్వహించెదరు. [8]

శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంసవరించు

ఈ ఆలయానికి 2.95 ఎకరాల మాన్యం భూమి ఉంది. [3]&[6]

శ్రీ పల్నాటి వీర్లంకమ్మ తల్లి ఆలయంసవరించు

ఈ ఆలయంలో, 2014, ఆగస్టు-23, శ్రావణమాసం, శనివారం నాడు, అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం, ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక హోమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించి, అంకమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. [4]

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

ఈ గ్రామంలో ప్రదాన వృత్తి వ్యవసాయం.

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 3,851 - పురుషుల సంఖ్య 1,957 - స్త్రీల సంఖ్య 1,894 - గృహాల సంఖ్య 1,040

2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,852.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,941, మహిళల సంఖ్య 1,911, గ్రామంలో నివాస గృహాలు 934 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,064 హెక్టారులు.

మూలాలుసవరించు

వెలుపలి లింకులుసవరించు

  • గ్రామ సంబంధిత వివరాలకు ఇక్కడ చూడండి. [1]

[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు, 2013, నవంబరు-22; 1వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014, మే-29; 2వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014, ఆగస్టు-24; 2వపేజీ. [5] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015, మే-19; 2వపేజీ. [6] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015, మే-22; 1వపేజీ. [7] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015, జూన్-1; 2వపేజీ. [8] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016, మే-19; 2వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=మంగమూరు&oldid=2969390" నుండి వెలికితీశారు