మంగల్‌దాయి, అస్సాం రాష్ట్రంలోని దర్రాంగ్ జిల్లా ముఖ్య పట్టణం. దరాంగ్ రాజా కుమార్తె సుసేంగ్‌ఫా (1603-1641) ను వివాహం చేసుకున్న అహోం రాజ్య పాలకుడు మంగల్దాహి పేరుమీద ఈ పట్టణం పేరు వచ్చింది. ఇది దర్రాంగ్ జిల్లా పరిపాలనకు ప్రధాన కార్యాలయంగా పనిచేస్తోంది. ఈ పట్టణం అస్సాం రాజధాని నగరం గువహాటికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.

మంగల్‌దాయి

মঙ্গলদৈ
పట్టణం
ఎల్‌ఎన్‌బి రోడ్‌లోని మంగల్‌దాయి రిపోస్ భవన దృశ్యం
ఎల్‌ఎన్‌బి రోడ్‌లోని మంగల్‌దాయి రిపోస్ భవన దృశ్యం
మంగల్‌దాయి is located in Assam
మంగల్‌దాయి
మంగల్‌దాయి
Location in Assam, India
మంగల్‌దాయి is located in India
మంగల్‌దాయి
మంగల్‌దాయి
మంగల్‌దాయి (India)
నిర్దేశాంకాలు: 26°26′N 92°02′E / 26.43°N 92.03°E / 26.43; 92.03Coordinates: 26°26′N 92°02′E / 26.43°N 92.03°E / 26.43; 92.03
దేశం భారతదేశం
రాష్ట్రంఅస్సాం
జిల్లాదర్రాంగ్ జిల్లా
పరిపాలన విభాగంఉత్తర అస్సాం విభాగం
ఉపవిభాగంమంగల్‌దాయి
స్థాపించిన వారుఅస్సాం ప్రభుత్వం
పేరు వచ్చినవిధంమంగల్‌దాయి (మంగోల దేవి)
ప్రభుత్వం
 • నిర్వహణమంగల్‌దాయి పురపాలక సంస్థ
విస్తీర్ణం
 • పట్టణం10 కి.మీ2 (4 చ. మై)
సముద్రమట్టం నుండి ఎత్తు
34 మీ (112 అ.)
జనాభా
(2011)
 • పట్టణం36,993
 • మెట్రో ప్రాంతం
48,345
పిలువబడువిధం (ఏక)మంగల్‌దనియన్
భాషలు
 • అధికారికఅస్సామీ
కాలమానంUTC+5:30 (భాతరకాలమానం)
పిన్‌కోడ్
784125 (తూర్పు, పడమర, దక్షణ), 784529 (ఉత్తర)
వాహనాల నమోదు కోడ్ఏఎస్- 13****
స్త్రీ, పురుష నిష్పత్తి923:1000 /
జాలస్థలిdarrang.nic.in

భౌగోళికంసవరించు

26°26′N 92°02′E / 26.43°N 92.03°E / 26.43; 92.03 అంక్షాంక్షరేఖాంశాల మధ్య ఈ మంగల్‌దాయి పట్టణం ఉంది.[1] సముద్రమట్టానికి ఇది ఎత్తు 34 మీటర్లు (112 అడుగులు) ఎత్తులో ఉంది.

బ్రహ్మపుత్రా నదికి ఉత్తర ఒడ్డున ఉన్న ఈ నగరం, గువహాటి నుండి సుమారు 68 కి.మీ. దూరంలో తేజ్పూర్ నుండి 94.1 కి.మీ. దూరంలో ఉంది.

జనాభాసవరించు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం[2], మంగల్డోయి జనాభా 36,993 (గెరిమారితో సహా) గా ఉంది. ఈ మొత్తం జనాభాలో పురుషులు 52%, స్త్రీలు 48% ఉన్నారు. మంగల్‌దాయి సగటు అక్షరాస్యత 92.57%, జాతీయ సగటు 74.04% కంటే ఎక్కువగా ఉంది. పురుషుల అక్షరాస్యత 94.95%, స్త్రీ అక్షరాస్యత 90.09%. మంగల్‌దాయి జనాభాలో 11% 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు. జనాభాలో ఎక్కువగా అస్సామీ, బెంగాలీ, మార్వాడి, బిహారీ, పంజాబీ వర్గాలకు చెందినవారు ఉన్నారు. పట్టణంలో హిందూ మెజారిటీ ఉంది.

పాఠశాలలు, కళాశాలలుసవరించు

మంగల్‌దాయిలో శంకర్ దేవ్ శిశునికేతన్, డాన్ బాస్కో హైస్కూల్, నార్త్ ఈస్ట్ అకాడమీ, మహర్షి విద్యామందిర్, కేంద్రీయ విద్యాలయ మంగల్‌దాయి, మంగల్‌దాయి ప్రభుత్వ ఉన్నత పారశాల, మంగల్‌దాయి కళాశాల, మంగల్‌దాయి బి.ఎడ్ కళాశాలలోపాటు ఇతర పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. మంగల్‌దాయి కామర్స్ కళాశాల. గురుకుల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ వింగ్, జాక్ అండ్ జిల్ ఇంగ్లీష్ స్కూల్, జ్ఞాన్ సాగర్ అకాడమీ, రంజిత్ శర్మ అకాడమీ, బ్రిలియంట్ అకాడమీ కొత్తగా స్థాపించబడిన ఇతర పాఠశాలలు కూడా ఉన్నాయి.

పరిపాలనసవరించు

ఈ ప్రాంతం మంగల్‌దాయి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.[3] బిజెపికి చెందిన గురుజ్యోతి దాస్ మంగల్‌దాయి ప్రస్తుత ఎమ్మెల్యేగా, బిజెపికి చెందిన దిలీప్ సైకియా మంగల్‌దాయి ప్రస్తుత ఎంపిగా ఉన్నారు.

మూలాలుసవరించు

  1. Falling Rain Genomics, Inc - Mangaldoi
  2. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2020-11-03.
  3. "List of Parliamentary & Assembly Constituencies" (PDF). Assam. Election Commission of India. Archived from the original (PDF) on 2006-05-04. Retrieved 2020-11-03.

ఇతర లంకెలుసవరించు