మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, గుంటూరు జిల్లా, మంగళగిరి పట్టణంలో ఉన్న దేవాలయం
(మంగళగిరి లక్ష్మీనరసింహ దేవాలయం నుండి దారిమార్పు చెందింది)

మంగళగిరి లక్ష్మీనరసింహ దేవాలయం, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, గుంటూరు జిల్లా, మంగళగిరి పట్టణంలో ఉన్న దేవాలయం. భారతదేశంలోని విష్ణువు ఎనిమిది పవిత్ర స్థలాలలో ఒకటైన ఈ క్షేత్రం అష్టమహాక్షేత్రాల నరసింహాలలో ఒకటిగా కూడా ప్రసిద్ధి చెందింది. కొండపైన, దిగువన ఉన్న మూడు దేవాలయాలు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన గోపురాలలో ఒకటైన ఈ దేవాలయ గోపురం 153 అడుగుల (47 మీటర్లు) ఎత్తు, 49 అడుగుల (15 మీటర్ల) వెడల్పుతో పదకొండు అంతస్తులతో నిర్మించబడింది.[1][2]

మంగళగిరి లక్ష్మీనరసింహ దేవాలయం
మంగళగిరి లక్ష్మీనరసింహ దేవాలయం
మంగళగిరి లక్ష్మీనరసింహ దేవాలయం
భౌగోళికం
భౌగోళికాంశాలు16°26′13″N 80°34′12″E / 16.4370352°N 80.5701012°E / 16.4370352; 80.5701012
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాగుంటూరు జిల్లా
స్థలంమంగళగిరి
సంస్కృతి
దైవంనరసింహావతారము
వాస్తుశైలి
నిర్మాణ శైలులుద్రావీడియన్ శైలీ
దేవాలయాల సంఖ్య3
శాసనాలుద్రావిడ భాషలు, సంస్కృతం

చరిత్ర

మార్చు

ఈ దేవాలయాన్ని పాండవ సోదరుడు యుధిష్ఠిరుడు స్థాపించాడని ఇక్కడి చరిత్రను బట్టి తెలుస్తోంది.[3] దేవాలయ చరిత్ర పురాతన హిందూ మత గ్రంథాలలో ఒకటైన బ్రహ్మ వైవర్త పురాణంలో నమోదు చేయబడింది.[3] ఈ దేవాలయాన్ని విజయనగర పాలకులు పోషించారనడానికి గుర్తుగా దేవాలయ ప్రాంగణంలో దేవాలయాన్ని సందర్శించిన కృష్ణదేవరాయల కాలం నాటి శాసనం కూడా ఉంది.[3] [4]ఎత్తైన పదకొండు అంతస్తుల గాలి గోపురాన్ని జమీందారీ పోషకుడు, నరసింహ భక్తుడు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు నిర్మించాడు.[3]

ఆలయ ప్రత్వేకతలు

మార్చు

మంగళగిరి అనేక శతాబ్దాలుగా ప్రసిద్ధి చెందిన పట్టణం. మంగళగిరి ఆలయం అనగానే పానకాల స్వామి గుర్తుకు వస్తాడు. ఈ కొండ మీద ముగ్గురు నరసింహ స్వాములుకు నిలయం. కొండ దిగువన లక్ష్మీనరసింహ స్వామి. కొండపైన పానకాల స్వామి, మూడవది కొండపైన గండాల నరసింహ స్వామి. ఈ వైష్ణవ క్షేత్రం కృష్ణానదికి అతి సమీపంలో ఉంది. ఈ పర్వతంపై లక్ష్మీదేవి తపస్సు చేసినందున ఈ క్షేత్రాన్ని మంగళగిరి అని పిలుస్తారు . ఈ ఆలయ ప్రధాన దైవం నరసింహ స్వామి. కొండపై ఉన్న గుడిలో విగ్రహం లేదు. నోరు ఆకారంలో కేవలం తెరిచిన రంధ్రం  మాత్రమే ఉంటుంది.అక్కడ తెరుచుకున్న రంధ్రమే పానకాల స్వామి అని ప్రజలు నమ్మకం. ఈస్వామికి చిత్రమైన ప్రత్వేకత ఉంది. పానకాలస్వామికి పంచదార, బెల్లం, చెరకువాటిలో ఏదో ఒక దానితో తయారుచేసిన పానకంతో అభిషేకం చేస్తే స్వామికి అభిషేకించిన పానకంలో సగభాగాన్ని మాత్రమే స్వామి వారు సేవించి, మిగిలిన సగాన్ని భక్తులకు తీర్థంగా వదలడం స్వామి ప్రత్వేకత. ఈ ఈలయంలో మరో ప్రత్వేకత  ప్రతి నిత్యం వందల కొలది బిందెల పానకం స్వామికి  సమర్పించినా ఆ దరిదాపుల ఒక్క చీమ ఎక్కడా కనిపించదు. ‘ఈ విశేషం వల్లనే ఈ దైవం. పానకాల స్వామి గా ప్రసిద్ధుడయ్యాడు.

గాలిగోపురం

మార్చు

మంగళగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి గాలిగోపురం రాష్ట్రంలో అత్యంత ఎత్తయినది. రెండు శతాబ్దాలను పూర్తిచేసుకుంది. మంగళగిరి గాలిగోపురాన్ని తొలగించి దానిస్థానే మళ్లీ అదేరీతిలోనూతనంగా కొత్త గోపురం నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.11 అంతస్తులతో 157 అడుగుల ఎత్తును కలిగి...కేవలం 49 అడుగుల పీఠభాగంతో గాలిలో ఠీవిగా నిలబడినట్టు కనిపిస్తూ సందర్శకులను అబ్బురపరిచే అద్వితీయ నిర్మాణమిది. దీనిని 1807-09 కాలంలో నాటి ధరణికోట జమిందారు శ్రీ రాజా వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు నిర్మించాడు. ఈ గోపుర పీఠభాగం పూర్తిగా రాతిచే నిర్మితమైంది. ఈ రాతి కట్టడానికి అన్నీ వైపులా పగుళ్లు వచ్చాయి. మంగళగిరి గోపురాన్ని ఈ ప్రాంత ప్రజలు వారసత్వ సంపదగా భావిస్తుంటారు.[5]

మూలాలు

మార్చు
  1. "Temple". Mangalagiri.org. Retrieved 1 April 2016.
  2. "Mangalagiri Temple". Official Website Of Guntur District. National Informatics Centre. Archived from the original on 29 మార్చి 2016. Retrieved 1 April 2016.
  3. 3.0 3.1 3.2 3.3 Ramesan, N. (1962). Temples and Legends of Andhra Pradesh (in ఇంగ్లీష్). Bharatiya Vidya Bhavan. p. 98.
  4. JSK. "మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి, పానకాల స్వామి ఆలయ చరిత్ర..." telugu.webdunia.com. Retrieved 2023-01-19.
  5. ఆంధ్రజ్యోతి గుంటూరు 23.9.2010

బయటి లింకులు

మార్చు