ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిఅనంతపురం జిల్లా, రామగిరి మండలం, మోటార్లచింతలపల్లె పంచాయతిలో గల ఒక చిన్న గ్రామం, పిన్ కోడ్: 515621.

విద్యా సౌకర్యాలు మార్చు

గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉంది. సమీప ప్రభుత్వ జూనియర్ కళాశాల మండల కేంద్రమైన రామగిరి లోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ధర్మవరం లోను, సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్, సమీప అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల, ఇంజనీరింగ్ కళాశాల అనంతపురంలోనూ ఉన్నాయి.

రవాణా సౌకర్యం మార్చు

గ్రామానికి ప్రభుత్వ వాహన సదుపాయం లేదు. సమీప గ్రామాలైన తిరుమణి, బలసముద్రం, తిమ్మాపురం నుంచి ప్రైవేటు వాహన సౌకర్యం ఉంది. ప్రతి వారం తిరుమణిలో (కర్నాటక రాష్ట్రం) కూరగాయల సంత జరుగుతుంది.గ్రామానికి జిల్లా, జాతీయ రహదారులు సుమారుగ 15, 52 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.

వైద్య సౌకర్యం మార్చు

గ్రామంలో వైద్య సదుపాయం లేదు. గ్రామ ప్రజలు వైద్యం కోసం పొరుగున ఉన్న తిరుమణికి (కర్నాటక రాష్ట్రం) వెలుతుంటారు. మెరుగైన వైద్య సదుపాయం కోసం జిల్లా కేంద్రం అయిన అనంతపురంకి వెలుతుంటారు.

దేవాలయాలు మార్చు

గ్రామంలో మూడు దేవాలయాలు ఉన్నాయి. అవి

  • తిరుమలప్ప స్వామి ఆలయం
  • ఆంజనేయ స్వామి ఆలయం
  • రాక్షసమ్మ ఆలయం

ప్రధాన పంటలు మార్చు

గ్రామంలో వేరుశనగ, కంది, వరి, కూరగాయలు పండుతాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=మంగాపురం&oldid=4045298" నుండి వెలికితీశారు