మంచి మనసులు (1962 సినిమా)
బాబూ మూవిస్ పతాకం మీద సి. సుందరం నిర్మించిన విజయవంతమైన చిత్రం మంచిమనసులు. మానవత విలువలతో తనను పెద్ద చేసి చదివించిన అన్న కుమార్తె కోసం తన ప్రేమను త్యాగం చేసిన యువకుడి కథ. ఐతే, అన్న కుమార్తె ప్రేమించింది ఒక స్వార్ధ పరుడిని. వీరి మధ్య నడుస్తుంది ఈ కథ.
మంచి మనసులు (1962 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఆదుర్తి సుబ్బారావు |
---|---|
నిర్మాణం | జి. సుందరం |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, ఎస్.వి రంగారావు, జానకి, నాగభూషణం, వాసంతి, సూర్యకాంతం |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | బాబూ మూవీస్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
చిత్రకథ
మార్చుకథానాయకుడు వేణు (నాగేశ్వరరావు) విద్యార్థి. అన్న గారు (గుమ్మడి) కమ్మరి. అతడు కష్టపడుతూ, తమ్ముడిని పట్టణంలో బి.ఏ. చదివిస్తూ ఉంటాడు. హాస్టల్ లో ఉంటే ఖర్చు బాగా అవుతుందని అన్న గారి భారం తగ్గించాలని పబ్లిక్ ప్రాసిక్యుటర్ ఆనందరావు (ఎస్.వి.రంగారావు) ఇంట్లో ఒక గదిని తీసుకొని ఉంటాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆనందరావు భార్య కాంతానికి (సూర్యకాంతం) నోటిదురుసు కాని మంచి మనిషి. వారి కూతురు శాంతి (సావిత్రి) లా చదువుతూ ఉంటుంది. పెళ్లీడు వచ్చిన కూతురు ఉందని పెళ్ళి కాని వారికి ఇల్లు అద్దెకివ్వనంటుంది. ఆనందరావు మంచి విద్యార్థికి సాయం చేయాలనే ఉద్దేశంతో పెళ్ళి అయిందని అబద్ధం ఆడమంటాడు. శాంతి అతడికి పెళ్ళికాలేదని తెలిసి ఆట పట్టిస్తుంది. వేణు, శాంతి ఒకరినొకరు ప్రేమించుకుంటారు. వేణు మంచి నడవడి కాంతాన్ని కూడా కట్టి పడేస్తుంది. వేణు అన్న మరణిస్తాడు. వేణు అన్న గారి కుమార్తె జయ (వాసంతి ) కుమార్ (నాగభూషణం) అనే యువకుడిని ప్రేమిస్తుంది. అతడు స్వార్ధ పరుడు. అతని తల్లి దండ్రులు వేణు తమ గుడ్డి కుమార్తె (షావుకారు జానకి) ని వేణు వివాహమాడాలని నిబంధన ఉంచుతారు కుమార్ తల్లి దండ్రులు. వేణు ఆ నిబంధనకు తల ఒగ్గుతాడు. అతని నిర్ణయాన్ని ఆనందరావు, శాంతి సమర్ధిస్తారు కాని కాంతమ్మ అది అవమానంగా భావిస్తుంది. శాంతిని మర్చిపోలేక వేణు భార్యకు దగ్గరకు కాలేక పోతాడు. కాని శాంతి ప్రోద్బలంతో భార్యాభర్తల మధ్య అనురాగం ఏర్పడుతుంది. కుమార్ కు వివాహానికి ముందే ఒకామెతో పరిచయమవుతుంది. ఆమె కుమార్ కు ధన సహాయం కూడా చేస్తూ ఉంటుంది. కుమార్ వివాహ విషయం తెలిసి అతడిని నిలదీస్తుంది. ఆమెను హంపీ విజయనగరానికి తీసుకు వెళ్తాడు. యాదృచ్ఛికంగా వేణు, గర్భవతి అయిన భార్యను తీసుకొని హంపీ విజయనగరానికి వస్తాడు. కుమార్ నిలదీస్తున్న ప్రేయసిని హత్య చేసి పారిపోతూ చెల్లెలి కాలి తొక్కి పారిపోతాడు. కుమార్ అఘాయిత్యాన్ని చూసిన వేణు, అన్న కూతురు పసుపు కుంకుమ నిలబెట్టడానికి హత్యను తనమీద వేసుకుంటాడు. ఈ కేసును శాంత డిఫెన్స్ లాయర్ గా వేణు తరఫున వాదిస్తుంది. కుమార్ చెల్లెలు కుమార్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతుంది. కుమార్ హత్యకు వాడిన ఆయుధం రక్తపు దుస్తులు కుమార్ భార్య కంటబడతాయి. ఆ సాక్ష్యాలు తీసుకొని కోర్టుకు వస్తుంది. ఒక మంచి మనిషిని కాపాడడానికి ఇందరి ప్రయత్నం చూసి కుమార్ లో మార్పు పచ్చి తన నేరాన్ని ఒప్పుకుంటాడు.
విడుదల
మార్చుప్రచారం
మార్చుసినిమాకు ప్రముఖ చిత్రకారుడు బాపు పబ్లిసిటీ డిజైనర్ గా పనిచేశారు. పోస్టర్లు, స్టిల్స్ వంటివే కాకుండా సినిమా గురించి కార్టూన్లు కూడా గీసి పత్రికల్లో వేశారు. ఒకానొక ప్రచార కార్టూన్లో ఓ ఇల్లాలు సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికొచ్చినా బయటకు వెళ్ళిపోతున్న భర్తను ఈ సినిమాలోని "ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్నమాట, ఏ ఊరు వెళతారు ఏదీ కాని వేళ" అన్న పాట వరుసలో "ఏమండోయ్ శ్రీవారూ ఒక చిన్న మాట! మంచిమనసులు మాట ఏంచేశారీ పూట" అంటుంది. ఇలాంటి వినూత్నమైన పబ్లిసిటీ సినిమా ప్రజాదరణ పొందడంలో తన వంతు కృషిచేసింది.[1]
పాటలు
మార్చుపాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
ఎంత టక్కరివాడు నారాజు ఏమూలనో నక్కినాడు | కొసరాజు | కె.వి.మహదేవన్ | జమునారాణి |
ఏమండోయ్ శ్రీవారూ ఒక చిన్నమాట ఏవూరూ వెళతారు ఏదీ కాని వేళ | ఆరుద్ర | కె.వి.మహదేవన్ | పి.సుశీల |
నన్ను వదలి నీవు పోలేవులే అదీ నిజములే, పూవు లేక తావి నిలువలేదులే | దాశరథి | కె.వి.మహదేవన్ | ఘంటసాల, పి.సుశీల |
మామ మామా మామా, ఏమే ఏమే భామా, పట్టుకుంటె కందిపోవు పండువంటి చిన్నదుంటె చుట్టుచుట్టు తిరుగుతావు మరియాద, తాళికట్టకుండ ముట్టుకుంటె తప్పుగాదా | కొసరాజు | కె.వి.మహదేవన్ | ఘంటసాల, జమునారాణి |
త్యాగం ఇదియేనా హృదయం శిలయేనా ఏలా ఈ మోసం | శ్రీ శ్రీ | కె.వి.మహదేవన్ | పి.సుశీల |
ఓహో ఓహో పావురమా వయ్యారి పావురమా మావారి అందాలు | ఆచార్య ఆత్రేయ | కె.వి.మహదేవన్ | ఎస్.జానకి |
అహో! ఆంధ్రభోజా! శ్రీకృష్ణదేవరాయా..శిలలపై శిల్పాలు చెక్కినారు | ఆచార్య ఆత్రేయ | కె.వి.మహదేవన్ | ఘంటసాల |
పాటల చిత్రలహరి
మార్చు-
ఎంత టక్కరివాడు నారాజు ఏమూలనో నక్కినాడు
-
ఏమండోయ్ శ్రీవారూ
-
నన్ను వదిలి నీవు పోలేవులే
-
మావా మావా మావా
-
త్యాగం ఇదియేనా హృదయం శిలయేనా
-
ఓహో ఓహో పావురమా
-
శిలలపై శిల్పాలు చెక్కినారు
ఇతర విశేషాలు
మార్చు- ఈ సినిమాలోని మామా, మామా, మామా; ఏమే ఏమే భామా పాట వలన కె.వి. మహదేవన్కు (మామ) అనే ముద్దు పేరు వచ్చింది.
మూలాలు
మార్చు- ↑ (ఎంబీఎస్ కాలమ్ లో), ఎమ్.బి.ఎస్. "బాపు విశ్వరూపం- 9". గ్రేట్ ఆంధ్రా. Archived from the original on 24 డిసెంబరు 2014. Retrieved 28 July 2015.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.