మధురానగరిలో (జావళి)

మధురానగరిలో చల్లనమ్మ అనేది ప్రసిద్ధిచెందిన జావళి. దీనిని చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్లై రచించాడు. దీనిని ఆనందభైరవి లో[1] స్వరపరిచాడు.

జావళి మార్చు

పల్లవి:
మధురానగరిలో చల్లనమ్మపోదు దారివిడుము కృష్ణా! కృష్ణా!
అనుపల్లవి:
మాపటివేళకు తప్పక వచ్చెద, పట్టకు కొంగు గట్టిగాను కృష్ణా! కృష్ణా!
చరణం 1 :
అత్తచూసిన నన్ను ఆగడి చేయును
ఆగడమేలరా అందగాడా కృష్ణా!
చరణం 2 :
కొసరి కొసరి నాతో సరసములాడకు,
రాజమార్గము విడుము కృష్ణా! కృష్ణా!
చరణం 3 :
విరజవనితలు నను చేరాబోదురిక,
విడువిడు నా చేయి కృష్ణా! కృష్ణా!

సినిమా పాటగా మార్చు

ఈ జావళిని త్యాగయ్య (1981) సినిమాలో ఒక పాటగా చిత్రీకరించారు. ఈపాటను కె.వి.మహదేవన్ సంగీతంలో వాణీ జయరాం గానం చేసింది. చిత్తూరు నాగయ్య దర్శకత్వం వహించిన త్యాగయ్య (1946 సినిమా) సినిమాలో ఈ పాటను జమునారాణి గారితో కలిసి ఎ.పి.కోమల గానం చేసింది. ఆమెకు అదే మొదటి పాట[2]. అభిమానం (సినిమా) లో ఘంటసాల సంగీతం లో పి.సుశీల గానం చేసిన ఈ పాటకు సావిత్రి నటించింది.[3]

మూలాలు మార్చు

  1. "Sangeeta Sudha". www.sangeetasudha.org. Retrieved 2021-06-07.
  2. "కమ్మని 'కోమల' గాత్రం | మ్యూజిక్ లిటరేచర్ | www.NavaTelangana.com". m.navatelangana.com. Retrieved 2021-06-07.
  3. "Abimanam (1960)". Indiancine.ma. Retrieved 2021-06-07.