మనవడి కోసం 1977లో విడుదలైన తెలుగు సినిమా. భరణి పిక్చర్స్ పతాకంపై భానుమతి రామకృష్ణ ఈ సినిమాను నిర్మించి దర్శకత్వం వహించింది. భానుమతి, పండరీబాయి, రోజారమణి లు ప్రధాన తారాగణంగా నిర్మించిన ఈ సినిమాకు భానుమతీ రామకృష్ణ సంగీతాన్నందించింది.[1]

మనవడి కోసం
(1977 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం భానుమతీ రామకృష్ణ
తారాగణం భానుమతీ రామకృష్ణ,
పండరీబాయి
నిర్మాణ సంస్థ భరణి పిక్చర్స్
భాష తెలుగు

అన్నపూర్ణమ్మకు అర్జంటుగా ఒక మనవడు కావాలి. ఏకైక పుత్రరత్నం శ్రీధర్ పెళ్ళి చేసుకుంటే కాని ఈ కోర్కె తీరదు. మాట రాగానే పారిపోయే శ్రీధర్ కు ఒప్పించి పెళ్ళి చేస్తుంది. అతని భార్య లక్ష్మి మంచిదే అయినా మంగమ్మ మాటలు విని గర్భ నిరోధక మాత్రలు వేసుకుంటుంది. ఇది తెలిసి అన్నపూర్ణమ్మ కాళికావతారం ఎత్తి కోడలుని గెంటివేస్తుంది. లక్ష్మి తల్లి లక్ష్మిని చివాట్లువేసి డాక్టరు దగ్గరకు తీసుకొని వెళుతుంది. లక్ష్మికి అసలు పిల్లలు పుట్టే అవకాశమే లేదని డాక్టరు చెబుతుంది. మనవడి కోసం వేణు గోపాలునికి మొక్కుకున్న అన్నపూర్ణమ్మకు గుండెల్లో రాయి పడింది. అన్నపూర్ణమ్మ కోరిక తీరడం కోస్ం లక్ష్మి వచ్చి ఒక ఉపాయం చెబుతుంది. కొడుకుకి రెండవ పెళ్ళి చేసి మనవడిని పొందుతుంది. కానీ రెండవ కోడలు మనవడిని తాకనివ్వదు. అప్పుడు అవ్వ పడే ఆరాటం ఈ కథలో ఉంది.

 
మనవడి కోసం

తారాగణం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • స్టూడియో: భరణి పిక్చర్స్
  • విడుదల తేదీ: ఏప్రిల్ 1, 1977

బాహ్య లంకెలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Manavadi Kosam (1977)". Indiancine.ma. Retrieved 2020-08-31.