మన్మథ
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
సా.శ. 1895-1896, 1955-1956, 2015-2016 లలో వచ్చిన తెలుగు సంవత్సరానికి మన్మథ అని పేరు.
సంఘటనలు
మార్చు- సా.శ. 1895 : భాద్రపద, ఆశ్వయుజ మాసములలో తిరుపతి వేంకట కవులు విజయనగరములో అవధానములు జరిపారు.[1] పుష్యమాసము క్రొత్తపల్లెలో శ్రీ రావు జగ్గారాయనింగారు వీరిచేత శతావధానము చేయించారు.
- సా.శ. 1896: తిరిగి వీరిచే ఫాల్గుణమాసము న గద్వాల సంస్థానములో శతావధానము జరిగింది.[2]
- సా.శ. 1955 : కార్తీక బహుళ ద్వాదశి - నాగార్జున సాగర్ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది.
- సా.శ. 2015 : గోదావరి నది పుష్కరము
జననాలు
మార్చు- సా.శ.1775 ఫాల్గుణమాసము : కర్ణాటక సంగీత చక్రవర్తి ముత్తుస్వామి దీక్షితార్ జననం.
- సా.శ.1895 భాద్రపద బహుళ షష్ఠి : విశ్వనాథ సత్యనారాయణ, తెలుగు సాహిత్యవేత్త.
- సా.శ.1956 పుష్య బహుళ పాడ్యమి: ఒద్దిరాజు సీతారామచంద్రరావు - ఒద్దిరాజు సోదరులలో పెద్దవాడు (జ.1887, సర్వజిత్తు).
- సా.శ.1956 మాఘ శుద్ధ సప్తమి : వేదాటి రఘుపతి - అష్టావధాని, రచయిత, పరిశోధకుడు.[3]
- సా.శ.1956 ఫాల్గుణ బహుళ పంచమి: బెజగామ రామమూర్తి - అష్టావధాని, తెలుగు విశ్వవిద్యాలయం పురస్కార గ్రహీత.[4]
మరణాలు
మార్చు- క్రీ. శ. 1895 : ఫాల్గుణ బహుళ తదియ : మాడభూషి వేంకటాచార్యులు - ప్రముఖ తెలుగు కవి.
పండుగలు, జాతీయ దినాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 43. Retrieved 27 June 2016.[permanent dead link]
- ↑ తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 56. Retrieved 27 June 2016.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 664.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 668.