మన తెలంగాణ
2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తరువాత దాని ప్రభావం అన్ని రంగాలవలె పత్రికారంగం పైన కూడా పడింది. అంతకు ముందు రాష్ట్ర దినపత్రికలుగా ఉన్న ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ప్రజాశక్తి, విశాలాంధ్ర వంటి పత్రికలు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు విడివిడి ఎడిషన్లను ప్రారంభించక తప్పలేదు. హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు ఉంటుంది కనుక ప్రత్యేకంగా హైదరాబాదు ఎడిషన్‌ను కూడా ఈ దినపత్రికలు ప్రారంభించాయి. ఈ క్రమంలో భాగంగా విశాలాంధ్ర దినపత్రిక తన తెలంగాణా ఎడిషన్‌ను మన తెలంగాణ పేరుతో కొత్తరూపును సంతరించుకుంది. ఈ పత్రికను 2015, జనవరి 25న తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభించాడు[1]. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్ల నుండి ఏకకాలంలో వెలువడే ఈ దినపత్రికకు కె.శ్రీనివాస్‌రెడ్డి సంపాదకుడు. మూవ్ ఆన్ మీడియా ఈ పత్రికను నడుపుతోంది.[2][3]
రకం | ప్రతి దినం దినపత్రిక |
---|---|
రూపం తీరు | బ్రాడ్ షీట్ |
యాజమాన్యం | మూవ్ ఆన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ |
ప్రచురణకర్త | కె.శ్రీనివాస్ రెడ్డి |
సంపాదకులు | కె.శ్రీనివాస్ రెడ్డి |
స్థాపించినది | 2015, జనవరి 25 |
రాజకీయత మొగ్గు | సి.పి.ఐ. |
కేంద్రం | హైదరాబాదు, వరంగల్, కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్ |
జాలస్థలి | http://www.manatelangana.org |