మరపురాని మనీషులు
ఆంధ్రప్రదేశ్ లో సుప్రసిధ్ధులైన ఓ 45 మంది ప్రముఖ పండితులు, కవులు, చరిత్రవేత్తలు, కళాసిధ్ధులు అయిన మహనీయుల అపురూప చిత్రాలు, వారి జీవిత విశేషాలు పొందుపరిచిన అరుదైన పుస్తకం మరపురాని మనీషులు. ఇందులోని 45 మంది మహనీయులు ఇరవైయ్యవ శతాబ్దంలో తెలుగు సాహిత్యానికి, వివిధ కళలలో, రంగాల్లో ప్రకాశించినవారు కావటం వల్ల ఈ పుస్తకానికి “మరపురాని మనీషులు” అని నామకరణం చేసారు.
మరపురాని మనీషులు | |
కృతికర్త: | తిరుమల రామచంద్ర |
---|---|
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
విభాగం (కళా ప్రక్రియ): | జీవిత చరిత్రలు |
ప్రచురణ: | |
విడుదల: | 2001 |
నలభై ఏళ్ల క్రితం “ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రికలో (1962-64లో) శ్రీ తిరుమల రామచంద్ర గారు ఈ రచనలను ఒక శీర్షికగా నిర్వహించారు. ఈ పండితులందరితో స్వయంగా ఇష్టాగోష్ఠి జరిపి, వారి వారి సాంస్కృతిక, కళా జీవిత విశేషాలను తెలుసుకుని వివరంగా రాసారు తిరుమల రామచంద్రగారు. 2001 సంవత్సరంలో “అజో-విభో-కందాళం ప్రచురణ”ల ద్వారా మొదటి ఎడిషన్ వెలువడింది.
పుస్తకంలోని ఆకర్షణీయమైన అంశం ఆయా వ్యక్తుల అపురూప ఛాయా చిత్రాలు. ఈ ఛాయా చిత్రాలు తీయటం ద్వారా శ్రీ నీలంరాజు మురళీధర్ గారు తెలుగువారికి చేసిన మేలు వర్ణించలేనిది. ఈ పుస్తకంలోని ఆంతరంగిక చిత్రాలు మరెక్కడా మనకు లభించవు. శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారి సహకారంతో మురళీధర్ గారిని ఆ ఫోటోల తాలూకు నెగెటివ్స్ ను ప్రచురణకు ఇవ్వటానికి ఒప్పించారు అప్పాజోస్యుల సత్యనారాయణగారు.
పత్రికలో ప్రచురించిన తిరుమల రామచంద్రగారి వ్యాసాలకు మరిన్ని వ్యాసాలు అవసరమైతే; మల్లాది కృష్ణానంద్ గారు మరొక పదహారు మంది ప్రముఖుల జీవిత చిత్రాలను రాసి అందించగా, మొత్తం 45 మంది మహనీయులతో ఈ పుస్తకం తయారైంది. పుస్తక రూపకల్పనకు, ప్రచురణకు కారకులు డా. అక్కిరాజు రమాపతిరావుగారు. ప్రముఖ చిత్రకారులు శ్రీ చంద్ర గారు అందమైన ముఖచిత్రకల్పన చేశారు.
ప్రముఖులు
మార్చు- అద్దంకి శ్రీరామమూర్తి
- ఇల్లిందల సరస్వతీదేవి
- కనుపర్తి వరలక్ష్మమ్మ
- కాశీ కృష్ణాచార్యులు
- కోలవెన్ను రామకోటీశ్వరరావు
- [[గన్నవరపు సుబ్బరామయ్య]]
- తల్లావజ్ఝుల శివ శంకరశాస్త్రి
- తాపీ ధర్మారావు
- తుమ్మల సీతారామమూర్తి
- ద్వారం వెంకటస్వామి నాయుడు
- దీపాల పిచ్చయ్యశాస్త్రి
- దేవులపల్లి కృష్ణశాస్త్రి
- నాయని సుబ్బారావు
- పులిపాటి వెంకటేశ్వర్లు
- బందా కనకలింగేశ్వరరావు
- మాడపాటి హనుమంతరావు
- మామిడిపూడి వెంకట రంగయ్య
- జాషువా
- రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ
- విశ్వనాథ సత్యనారాయణ