మల్కపేట జలాశయం
మల్కపేట జలాశయం అనేది తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండలంలోని మల్కపేట గ్రామ సమీపంలో నిర్మించిన జలాశయం. కాళేశ్వరం ప్యాకేజీ–9లో భాగంగా 3 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ జలాశయం ద్వారా వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలలోని 60 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందడంతోపాటు 26,150 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కానుంది.[1]
మల్కపేట జలాశయం | |
---|---|
ప్రదేశం | మల్కపేట, కోనరావుపేట మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా |
స్థితి | నిర్మాణంలో ఉంది |
యజమాని | తెలంగాణ ప్రభుత్వం |
ఆనకట్ట - స్రావణ మార్గాలు | |
ఆనకట్ట రకం | బ్యారేజి |
జలాశయం | |
సృష్టించేది | మల్కపేట జలాశయం |
మొత్తం సామర్థ్యం | 3 టీఎంసీలు |
విద్యుత్ కేంద్రం | |
నిర్వాహకులు | తెలంగాణ రాష్ట్రం |
Type | జలాశయం |
ప్రతిపాదన
మార్చుసిరిసిల్ల మిడ్ మానేరు ద్వారా నర్మాల ఎగువ మానేరు వరకు ద్వారా నీటిని మళ్ళించడానికి 504 కోట్ల రూపాయలతో ఏడు గుట్టలను అనుసంధానం చేస్తూ ఈ జలాశయం ప్రతిపాదించబడింది. మొదట 2 పంపులతో ఈ జలాశయంలోకి నీటిని ఎత్తిపోసి, తర్వాత సింగసముద్రం ద్వారా ఎగువ మానేరుకు గోదావరి జలాలను తరలించడంతోపాటు ఈ లింక్‌తో 150 చెరువులను నింపనున్నారు.[2]
నిర్మాణం
మార్చు2014లో ఈ జలాశయ నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది. రామప్పగుట్ట సమీపంలోని మిడ్‌మానేరు నుంచి కోనరావుపేట మండలం మల్కపేట వరకు దాదాపు 1000 కోట్ల రూపాయలతో 12.3. కి.మీ పొడవు భూగర్భ కాలువ నిర్మించబడింది. సుమారు 500 కోట్ల రూపాలయతో 3 టీఎంసీల జలాశయం నిర్మాంచారు. 130 మీటర్ల లోతులోని సర్జ్‌పూల్ నుంచి 1100 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసేందుకు 30 మెగావాట్ల సామర్థ్యం గల రెండు విద్యుత్ మోటర్లను బిగించగా, ఒక్కో మోటర్ 550 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయనున్నది. 5 కిలోమీటర్ల పొడవు గల ఆరు బండ్‌లను నిర్మించారు. ఒక్కో బండ్ కిలోమీటర్ పొడవు ఉంటుంది. సర్జిపూల్ నుంచి నీటిని ఎత్తిపోసేందుకు 90 మెగావాట్ల విద్యుత్ అవసరం కాగా, 33/11కేవీ విద్యుత్ ప్రత్యేక ఉపకేంద్రాన్ని ఏర్పాటు చేశారు.[3]
ట్రయల్ రన్
మార్చు2023 మే 23న గంటపాటు ట్రయల్ రన్ నిర్వహించబడింది. మానేరు రామప్ప గుట్ట నుంచి టన్నెల్ ద్వారా నాలుగు రోజులపాటు మల్కపేట వద్ద ఉన్న సర్జిపూల్‌కు నీటిని తరలించారు. నీటి నిల్వ చేసే సర్జ్‌పూల్‌ను 80 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు, 40 మీటర్ల ఎత్తుతో నిర్మించారు. ఇంజినీరింగ్ అధికారులు సర్జ్‌ఫూల్‌లో ఉదయం 7.30 గంటలకు ప్రత్యేక పూజలు చేసి రెండో యూనిట్‌ను ప్రారంభించడంతో 130 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రాజెక్టులోకి గోదావరి నీరు ఎగిసిపడింది. 120 రోజుల్లో 11.635 టీఎంసీలను ఎత్తిపోయనున్నారు.[4]
మూలాలు
మార్చు- ↑ telugu, NT News (2023-05-23). "Rajanna Siricilla | మల్కపేట రిజర్వాయర్ ట్రయల్ రన్ సక్సెస్.. 60 వేల ఆయకట్టుకు సాగునీరు". www.ntnews.com. Archived from the original on 2023-05-23. Retrieved 2023-05-24.
- ↑ Velugu, V6 (2023-05-24). "మల్కపేట ట్రయల్ రన్ సక్సెస్.. నెల రోజుల్లో కాళేశ్వరం లింక్-3 పూర్తి". V6 Velugu. Archived from the original on 2023-05-24. Retrieved 2023-05-24.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ telugu, NT News (2023-05-24). "సాగునీటి చరిత్రలో మరో అధ్యాయం". www.ntnews.com. Archived from the original on 2023-05-24. Retrieved 2023-05-24.
- ↑ ABN (2023-05-24). "మల్కపేట రిజర్వాయర్ ట్రయల్ రన్ సక్సెస్". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-05-24. Retrieved 2023-05-24.