మల్లిక (వ్యాఖ్యాత)
మల్లిక (1978 - 2017 అక్టోబరు 9) ప్రముఖ టీవీ వ్యాఖ్యాత, నటి.[1] 1997-2004 మధ్యలో పలు టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఉత్తమ వ్యాఖ్యాతగా పురస్కారాలు అందుకుంది. మహేష్ బాబు కథా నాయకుడిగా నటించిన మొదటి సినిమా రాజకుమారుడు, వెంకటేష్ నటించిన కలిసుందాం రా మొదలైన సినిమాల్లో నటించింది.
మల్లిక | |
---|---|
జననం | అభినయ 1978 |
మరణం | 2017 అక్టోబరు 09[1] బెంగుళూరు |
వృత్తి | టీవీ వ్యాఖ్యాత, నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1997-2004 |
జీవిత భాగస్వామి | విజయ్ సాయి |
వ్యక్తిగత జీవితం
మార్చుమల్లిక 1978 లో హైదరాబాదులోని నారాయణగూడలో ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది. ఆమె అసలు పేరు అభినయ[2] విజయ్ సాయిని వివాహం చేసుకున్న తర్వాత ఆమె మకాం బెంగుళూరుకు మారింది.[3]
వృత్తి
మార్చుమొదట్లో టీవీ వ్యాఖ్యాతగా తన కెరీర్ ప్రారంభించిన మల్లిక తర్వాత కొన్ని సీరియళ్ళలో, సినిమాలలో అవకాశాలు అందిపుచ్చుకుంది. పెళ్ళి తర్వాత వ్యాఖ్యానానికీ, నటనకు దూరంగా ఉంది.[4]
సినిమాలు
మార్చుమరణం
మార్చుకొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడ్డ ఆమె 20 రోజుల కోమాలో ఉన్న తరువాత 2017 అక్టోబరు 9 న బెంగుళూరులో కన్ను మూసింది.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "ప్రముఖ తెలుగు యాంకర్ కన్నుమూత". eenadu.net. బెంగుళూరు: ఈనాడు. Archived from the original on 9 October 2017. Retrieved 9 October 2017.
- ↑ "యాంకర్ మల్లిక ఇక లేరు". tupaki.com. Archived from the original on 10 అక్టోబరు 2017. Retrieved 10 October 2017.
- ↑ "TV actress Mallika breathes her last". indiaglitz.com. India Glitz. Retrieved 10 October 2017.
- ↑ బొలినేని, హరిబాబు. "Notable anchor Mallika passes away". chitramala.in. chitramala.in. Retrieved 10 October 2017.[permanent dead link]