రాజకుమారుడు

1999 కె. రాఘవేంద్రరావు తెలుగు సినిమా

రాజకుమారుడు 1999 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇది మహేష్ బాబుకు కథానాయకుడిగా మొదటి సినిమా. ప్రీతి జింటా అతనికి జోడీగా నటించింది. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీ దత్ నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్నందించాడు. ఈ సినిమాకు అక్కినేని ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా నంది అవార్డు లభించింది. ఇది హిందీలోకి ప్రిన్స్ నంబర్ 1 పేరుతో అనువాదం అయింది.

రాజకుమారుడు
దర్శకత్వంకె.రాఘవేంద్రరావు
నిర్మాతఅశ్వనీ దత్
తారాగణంమహేష్ బాబు ,
ప్రీతి జింటా
ప్రకాశ్ రాజ్,
సుమలత,
జయలలిత (నటి)
ఛాయాగ్రహణంజయనన్ విన్సెంట్
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంమణిశర్మ
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
28 జూన్ 1999 (1999-06-28)
భాషతెలుగు

ధనంజయ (ప్రకాష్ రాజ్) ముంబై లో ఒక రెస్టారెంటును నడుపుతుంటాడు. అతని మేనల్లుడు రాజకుమార్ (మహేష్ బాబు). ఒకసారి రాజ్ కుమార్ ఖండాలా విహార యాత్రకు వెళతాడు. అక్కడ రాణి (ప్రీతి జింటా) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. ఆమెను సరదాగా ఆట పట్టిస్తుంటాడు. రాణికి అతనంటే పడదు. ఒకసారి రాజ్ కుమార్ రాణిని కొంతమంది రౌడీల బారినుంచి కాపాడటంతో ఆమె కూడా అతన్ని ప్రేమించడం మొదలు పెడుతుంది.

తారాగణం

మార్చు

పాటలు

మార్చు
పాట గాయకులు రచన
రాంసక్కనోడమ్మ చందమామ సుఖ్విందర్ సింగ్, చిత్ర సుద్దాల అశోక్ తేజ
ఎందుకీ ప్రాయము ఎస్. పి. బాలు, చిత్ర వేటూరి సుందరరామ్మూర్తి
గోదారి గట్టు పైన ఉదిత్ నారాయణ్, కవిత కృష్ణమూర్తి చంద్రబోస్
ఎప్పుడెప్పుడు ఎస్. పి. బాలు, సుజాత వేటూరి సుందర్రామ్మూర్తి
బాలీవుడ్ బాలరాజుని శంకర్ మహదేవన్ వేటూరి సుందర్రామ్మూర్తి
ఇందురుడూ చందురుడూ ఎస్. పి. బాలు, చిత్ర వేటూరి సుందర్రామ్మూర్తి

బయటి లింకులు

మార్చు