మహబూబాబాద్ మండలం

తెలంగాణ, మహబూబాబాదు జిల్లా లోని మండలం

మహబూబాబాద్‌ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని నూతనంగా ఏర్పాటైన మహబూబాబాద్ జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం వరంగల్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం మహబూబాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 20  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు

మహబూబాబాద్
—  మండలం  —
తెలంగాణ పటంలో మహబూబాబాదు జిల్లా, మహబూబాబాద్ స్థానాలు
తెలంగాణ పటంలో మహబూబాబాదు జిల్లా, మహబూబాబాద్ స్థానాలు
తెలంగాణ పటంలో మహబూబాబాదు జిల్లా, మహబూబాబాద్ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°36′14″N 80°00′12″E / 17.603849636314305°N 80.00345498840613°E / 17.603849636314305; 80.00345498840613
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబాబాదు జిల్లా
మండల కేంద్రం మహబూబాబాద్
గ్రామాలు 20
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 229 km² (88.4 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 76,519
 - పురుషులు 38,506
 - స్త్రీలు 38,013
అక్షరాస్యత (2011)
 - మొత్తం 53.24%
 - పురుషులు 65.41%
 - స్త్రీలు 40.75%
పిన్‌కోడ్ 506302

గణాంకాలు

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త వరంగల్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన లెక్కల ప్రకారం మొత్తం మండల జనాభా 76,519 - పురుషులు 38,506 - స్త్రీలు 38,013.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 229 చ.కి.మీ. కాగా, జనాభా 113,812. జనాభాలో పురుషులు 56,424 కాగా, స్త్రీల సంఖ్య 57,388. మండలంలో 28,084 గృహాలున్నాయి.[3]

వరంగల్ జిల్లా నుండి మహబూబాబాద్ జిల్లాకు మార్పు.

మార్చు

లోగడ మహబూబాబాద్ వరంగల్ జిల్లాకు చెందిన ఒక పట్టణం, రెవెన్యూ డివిజన్,మండల కేంద్రం.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా మహబూబాబాద్ ను కొత్త జిల్లాగా ప్రకటించి, అదే జిల్లాలో మహబూబాబాదు రెవెన్యూ డివిజను కేంద్రంగా, మండల కేంద్రంగా (1+19) ఇరవై గ్రామాలుతో ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[4]

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. వేమునూరు
  2. వి.ఎస్.లక్ష్మీపూర్
  3. రెడ్యాల
  4. కంబాలపల్లి
  5. నడివాడ
  6. ఈదులపూసపల్లి
  7. గుమ్ముడూరు
  8. మహబూబాబాద్
  9. ముడుపుగల్
  10. శనిగపురం
  11. అమన్‌గల్
  12. సింగారం
  13. లక్ష్మీపూర్
  14. జంగ్లిగొండ
  15. పర్వతగిరి
  16. మల్యాల
  17. మాధవపురం
  18. బేతోల్
  19. జమాండ్లపల్లి
  20. అనంతారం

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016   
  2. "మహబూబాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-09-14. Retrieved 2018-11-22.

వెలుపలి లంకెలు

మార్చు