మహబూబ్ నగర్ జిల్లా ప్రాచీన కవులు

పాలమూరు జిల్లాలో 13వ శతాబ్దం నుంచి అనేక కవులు పలు రచనలు చేసినట్లు ఆధారాలున్నాయి. అప్పటి కాలంలో కవులు లేని పాలమూరు ప్రాంత గ్రామాలు లేవనే నానుడి కూడా ఉంది. తొలి తెలుగు రామాయణ కర్త గోన బుద్ధారెడ్డి నుంచి ఇప్పటి ఆధునిక రచయితల వరకు వందలాది కవులు తెలుగు, సంస్కృత భాషలలో సాహితీ ప్రావీణ్యం చూపారు. పూర్వపు సంస్థానాలలో కవులకు రాజులు ప్రత్యేక ఆదరణ చూపి ప్రోత్సహించేవారు.

13 వ శతాబ్దం

గోన బుద్ధారెడ్డి

రామాయణపు మధుర రుచిని మొట్ట మొదట తెలుగు వారికి అందించిన ఆధ్యుడు. రంగనాథ రామాయణాన్ని ద్విపద కావ్యంగా రాశాడు.

16 వ శతాబ్దం

ఎలకూచి బాలసరస్వతి

జటప్రోలు సంస్థానాధిపతి సురభి మాధవ రాయల ఆస్థాన కవి. భర్తృహరి సుభాషితాలను తెలుగులోకి అనువాదం చేశాడు.

17 వ శతాబ్దం

కాకునూరి అప్పకవి

కాకునూరి అప్పకవి శ్రీనగాధీశ శతకాన్ని, అప్పకవీయం అను లక్షణ గ్రంధాన్ని రచించారు.

18 వ శతాబ్దం

రాజవోలు సుబ్బరాయ కవి, పూడూరు కృష్ణయామాత్యుడు, చింతలపల్లి ఛాయాపతి, బోరవెల్లి శేషయామాత్యుడు, కాణాదం పెద్దన

19 వ శతాబ్దం

ధర్మవరం మణిమయ గోపాల కవి

వెంకటేశ్వర శతకం, పుష్పబాణ విలాపం, శివానందలహరి వీరి రచనలు.

20 వ శతాబ్దం

కేశవపంతుల నరసింహశాస్త్రి

మానవపాడు మండలంలోని పల్లెపాడు గ్రామానికి చెందిన కవి. ప్రబంధ పాత్రలు, సంస్థానముల సాహిత్య సేవ, త్యాగధనులు, బాల వీరులు,రత్నాలక్ష్మి శతకం, ఉదయసుందరి వీరి రచనలు. పాలమూరు జిల్లా ప్రాచీన కవులు