మహమ్మద్ ఇక్బాల్

తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకులు

షేక్ మహమ్మద్‌ ఇక్బాల్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ ఐపీఎస్‌ అధికారి, రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు.

మహమ్మద్‌ ఇక్బాల్‌

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
30 మార్చ్ 2021 - 2024 ఏప్రిల్ 5
తరువాత పిడుగు హరిప్రసాద్
నియోజకవర్గం ఎమ్మెల్యే కోటా

వ్యక్తిగత వివరాలు

జననం 4 ఏప్రిల్‌ 1958
హిందూపురం, అనంతపురం జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు షేక్ గౌస్ సాహెబ్ , షేక్ మహబూబ్ బీ
జీవిత భాగస్వామి నిషాత్‌ జహన్‌ [1]
నివాసం ప్రశాంత్‌నగర్‌, హిందూపురం

జననం, విద్యాభాస్యం

మార్చు

మహమ్మద్‌ ఇక్బాల్‌ 4 ఏప్రిల్‌ 1958లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా, హిందూపురంలో షేక్ గౌస్ సాహెబ్, షేక్ మహబూబ్ బీ దంపతులకు జన్మించాడు. ఆయన కర్నూలు జిల్లా, కోవెలకుంట్ల పట్టణంలోని ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి వరకు, బనగానపల్లె మండలం నందివర్గం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేశాడు. మహమ్మద్‌ ఇక్బాల్‌ కర్నూలు జిల్లా ఆదోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. పూర్తి చేశాడు.[2]

వృత్తి జీవితం

మార్చు

మహమ్మద్‌ ఇక్బాల్‌ ఎం.ఏ. పూర్తి చేశాక, సివిల్స్ పరీక్షలు రాసి ఐపీఎస్‌కు ఎంపికై 35 ఏళ్లపాటు పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పనిచేశాడు. ఆయన సీఎం చంద్రబాబు సీఎంగా ఉన్న 1999-2004 కాలంలో ఆయన సెక్యురిటీ ఆఫీసర్‌గా వ్యవహరించి, ఐజీ ర్యాంకు హోదాలో పదవీ విరమణ చేశాడు.[3]

రాజకీయ జీవితం

మార్చు

మహమ్మద్‌ ఇక్బాల్‌ ప్రభుత్వ ఉద్యోగ విరమణ అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. ఆయన 2018లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి, [4] 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీలో నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి నందమూరి బాలకృష్ణ చేతిలో ఓటమి పాలయ్యాడు. ఆయన తొలిసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి 2019 సెప్టెంబరు 11న ఎన్నికై, [5] 2021 మార్చి 29 వరకు ఎమ్మెల్సీగా పనిచేశాడు. ఆయనను రెండవసారి ఎమ్మెల్సీ అభ్యర్థిగా 2021 ఫిబ్రవరి 25న వైఎస్సార్‌సీపీ తరపున ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశాడు. ఆయన శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవం అయినట్లు 2021 మార్చి 8న ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి తెలిపాడు.[6] ఆయన శాసనసభ్యుడిగా 2021 ఏప్రిల్ 1న ప్రమాణ స్వీకారం చేశాడు.[7][8]

ఇక్బాల్ 2024లో అసెంబ్లీ ఎన్నికలలో హిందూపురం నుండి వైసీపీ టికెట్ ఆశించగా, టికెట్ దక్కకపోవడంతో కొన్ని రోజులుగా వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ 2024 ఏప్రిల్ 5న వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి, [9] ఏప్రిల్ 10న అమరావతిలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరాడు.[10]

మూలాలు

మార్చు
  1. TV9 Telugu (25 February 2021). "ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో చాణక్యం.. వైసీపీ అభ్యర్థుల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకే! - Political history of YCP MLC candidates". Archived from the original on 17 జూలై 2021. Retrieved 17 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Sakshi (15 August 2019). "రేనాటిగడ్డకు అరుదైన అవకాశం". Archived from the original on 17 జూలై 2021. Retrieved 17 July 2021.
  3. Sakshi (12 August 2019). "వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన". Archived from the original on 17 జూలై 2021. Retrieved 17 July 2021.
  4. Sakshi (16 May 2018). "వైఎస్సార్‌సీపీలోకి రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఇక్బాల్‌". Sakshi. Archived from the original on 16 మే 2018. Retrieved 18 July 2021.
  5. Sakshi (11 September 2019). "వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం". Sakshi. Archived from the original on 17 జూలై 2021. Retrieved 18 July 2021.
  6. Outlook India (8 March 2021). "Six ruling YSR Congress candidates elected unopposed to AP Legislative Council". Archived from the original on 18 జూలై 2021. Retrieved 18 July 2021.
  7. The Times of India (1 April 2021). "Six newly elected Andhra Pradesh MLCs take oath | Amaravati News - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 18 జూలై 2021. Retrieved 18 July 2021.
  8. Prajashakti (1 April 2021). "ఆరుగురు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం". Archived from the original on 2 ఏప్రిల్ 2021. Retrieved 18 July 2021.
  9. Eenadu (5 April 2024). "వైకాపాకు మరో షాక్‌.. ఎమ్మెల్సీ రాజీనామా". Archived from the original on 5 April 2024. Retrieved 5 April 2024.
  10. 10TV Telugu (10 April 2024). "టీడీపీలో చేరిన వైసీపీ హిందూపురం కీలక నేత" (in Telugu). Archived from the original on 10 April 2024. Retrieved 10 April 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)