మహర్షి (1987 సినిమా)

మహర్షి 1987 లో విడుదలైన తెలుగు సినిమా. దీనికి వంశీ దర్శకత్వం వహించగా టైటిల్ పాత్రలో మహర్షి రాఘవ నటించాడు.[1] ఇది కృష్ణ భగవాన్ నటించిన మొదటి సినిమా. ఇళయరాజా సంగీతం ఒక హై లైట్. [2]

మహర్షి
(1987 తెలుగు సినిమా)
Maharishifilm.png
దర్శకత్వం వంశీ
నిర్మాణం స్రవంతి రవికిషోర్
కథ వేమూరి సత్యనారాయణ
చిత్రానువాదం వంశీ
వేమూరి సత్యనారాయణ
తనికెళ్ళ భరణి
తారాగణం మహర్షి రాఘవ,,
శాంతిప్రియ,
సి.వి.ఎల్.నరసింహారావు,
కృష్ణ భగవాన్
సంగీతం ఇళయరాజా
నృత్యాలు ఎస్పీ ఆనంద్
జి. పద్మ సుబ్బారావు
ఛాయాగ్రహణం హరి అనుమోలు
కళ తోట యాదు
కూర్పు అనిల్ మల్నాడ్
నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్
భాష తెలుగు

కథసవరించు

మహర్షి ( మహర్షి రాఘవ ), ధనిక కుటుంబానికి చెందిన, అల్లరి చిల్లరగా తిరిగే కళాశాల యువకుడు. తన అహంకార ప్రవర్తన, స్నేహితుల ముఠాను నిర్వహించడం, లెక్చరర్లను ఆటపట్టించడం, క్లాస్‌మేట్ల‌ను కొట్టడం వంటి వాటితో అతడు కళాశాలలో పేరుపొందాడు. అయితే, అతను కళాశాలలో సుచిత్ర ( శాంతిప్రియ ) ను కలిసాక పరిస్థితులు మారతాయి. అతని మొరటు ప్రవర్తన కారణంగా ఆమె అతన్ని అసహ్యించుకుంటుంది అతను ఆమెతో మాట్లాడబోయినా ఆమె మాట్లాడదు. మహర్షి ఆమెను ఇష్టపడతాడు. ఆమె తల్లిదండ్రులను సంప్రదించి, తన సంపదను చూపించి ఆమెను గెలవడానికి ప్రయత్నిస్తాడు. తల్లిదండ్రులు ఆసక్తి చూపిన తర్వాత కూడా సుచిత్ర ఈ ఆఫర్‌ను తిరస్కరించింది. ఆమెకు వచ్చిన సంబంధాలను భయపెట్టి వెనక్కి పంపేసి చెడగొడతాడు.

సుచిత్ర తన చిన్ననాటి స్నేహితుడు తిలక్ ( కృష్ణ భగవాన్ ) ను కలుస్తుంది. అతడు అదే పట్టణంలో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తూంటాడు. వెంటనే, మహర్షిని వదిలించుకోవాలనే ఉద్దేశంతో, అతన్ని వివాహం చేసుకోవాలనే కోరికను ఆమె వ్యక్తం చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న మహర్షి వారి పెళ్ళిని ఆపడానికి ప్రయత్నిస్తాడు. కాని స్వయంగా అతడి సొంత తండ్రే ఒత్తిడి చేసి అతణ్ణి పోలీస్ స్టేషన్లో బంధిస్తారు. అయితే, తిలకే సబ్ ఇన్స్పెక్టర్గా తన అధికారాన్ని వాడి తనను ఖైదు చేసాడని మహర్షి భావిస్తాడు. తిలక్ ను అతడి ఇంటి వద్దనే దాడి చేయడానికి వెళ్తాడు. కాని సుచిత్ర తలుపు తెరిచినప్పుడు అతను ఆగిపోతాడు. క్రమంగా, మహర్షి నిరాశలోకి జారిపోయి ఆసుపత్రిలో చేరతాడు.

తన స్నేహితుడు రమణ ( సివిఎల్ నరసింహారావు ) సుచిత్రకు మందు కలిపి, ఆమె మత్తులో ఉండగా మహర్షి వద్దకు తీసుకు వెళ్తాడు, మహర్షి ఆమెతో శారీరక ఐక్యత కోరుకుంటున్నాడని భావించి. ఆ సమయంలో మహర్షికి ఆమెపై ఉన్న స్వచ్ఛమైన ప్రేమ కనబడుతుంది. మహర్షి తన స్నేహితుడిని చెంపదెబ్బ కొట్టి, ఆమె ప్రేమను కోరుకుంటున్నానని, ఆమె శరీరం కాదని వివరించాడు. వారు ఆమెను జాగ్రత్తగా వెనక్కి తీసుకువెళ్తారు.

తిలక్ మహర్షితో స్నేహం చేసి, అతడు సుచిత్రతో కలుపుగోలుగా ఉండేలా చేయడానికి ప్రయత్నిస్తాడు. అతను కోలుకున్నాక, అతను పెళ్ళి చేసుకోవాలని వారు సలహా ఇస్తారు. కాని అందుకు స్పందనగా మహర్షి, పిచ్చిగా మారి అరుస్తూ పారిపోతాడు. అతను మళ్ళీ ఆసుపత్రిలో చేరతాడు. కాని అక్కడ నుండి తప్పించుకుంటాడు. అతను సుచిత్రకు పుట్టిన పిల్లవాడిని లాక్కొని, నగరంలోకి పారిపోతాడు. పోలీసులు అతని వెంట పడతారు. చివరికి, అతను పిల్లవాడితో పాటు ఒక భవనం పైనుండి పడటంతో, అతను చనిపోతాడు, పిల్లవాడిని కాపాడతాడు, తద్వారా సుచిత్ర సానుభూతి సంపాదిస్తాడు.

నటీనటులుసవరించు

సాంకేతిక సిబ్బందిసవరించు

  • కథ: వేమూరి సత్యనారాయణ
  • సంభాషణలు: తనికెళ్ళ భరణి
  • చిత్రానువాదం: వంశీ, వేమూరి సత్యనారాయణ & తనికెళ్ళ భరణి
  • సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, జోన్నవితుల, వెన్నెలకంటి & నాయని కృష్ణమూర్తి
  • గాయకులు: ఎస్పీ బాలసుబ్రమణ్యం, ఎస్.జానకి & ఇళయరాజా
  • మేకప్: ఎస్.నాగేశ్వరరావు
  • కేశాలంకరణకు: రామమూర్తి
  • కాస్ట్యూమ్స్: సాయి
  • ప్రెస్ రిలేషన్స్: కౌండిన్య
  • పబ్లిసిటీ డిజైనర్: లంక భాస్కర్
  • ఆపరేటివ్ కెమెరామెన్: ప్రసాద్ అనుమోలు
  • అసిస్టెంట్ డైరెక్టర్లు: గద్దే సుధాకర్ రావు, యు.నారాయణ రావు & సైగల్
  • స్టిల్స్: కె. సత్యనారాయణ
  • నృత్య దర్శకులు: ఎస్పీ ఆనంద్ & జి. పద్మ సుబ్బారావు
  • ప్రొడక్షన్ మేనేజర్స్: వల్లూరిపల్లి రమేష్ బాబు, ముని లాల్, కెవి కృష్ణారావు
  • ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఎపి స్వామి
  • ఆర్ట్ డైరెక్టర్: తోట యాదు
  • ప్రొడక్షన్ డిజైనర్: వేమూరి సత్యనారాయణ
  • కూర్పు: అనిల్ మల్నాడ్
  • ఫోటోగ్రఫి డైరెక్టర్: హరి అనుమోలు
  • సంగీత దర్శకుడు: ఇళయరాజా
  • నిర్మాత: కె. శారదా దేవి
  • దర్శకుడు: వంశీ

పాటలుసవరించు

ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమాలో పాటలను సిరివెన్నెల సీతారామశాస్త్రి, నాయని క్రిష్ణమూర్తి, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, వెన్నెలకంటి రచించారు[3].

క్రమసంఖ్య పేరుSinger(s) నిడివి
1. "సాహసం"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం 4:37
2. "సుమం ప్రతిసుమం"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి 4:46
3. "కోనలో"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి 4:34
4. "మాటరాని"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి 4:36
5. "ఊర్వశి"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర 4:36
23:10

బాక్సాఫీసుసవరించు

ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి ఓ మోస్తరు స్పందన వచ్చింది. ఈ చిత్రం నేపథ్య సంగీతానికి పేరుగాంచింది.

బయటి లింకులుసవరించు

మూలాలుసవరించు

  1. "మహార్షి 1987 (1987) | మహార్షి 1987 Movie | మహార్షి 1987 Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos – Filmibeat". telugu.filmibeat.com. Archived from the original on 2020-08-07. Retrieved 2020-08-07.
  2. "Maharshi (1987)". Indiancine.ma. Retrieved 2020-09-04.
  3. "Maharshi". Spotify. Retrieved 9 December 2020.