మహాకవి క్షేత్రయ్య
మహాకవి క్షేత్రయ్య 1976లో విడుదలైన ఒక మంచి తెలుగు చిత్రం. క్షేత్రయ్య పేరుతో పిలవబడే వరదయ్య కృష్ణా తీరం లోని మువ్వ గ్రామ నివాసి. ఈ సినిమాలో వరదయ్య పాత్రను నాగేశ్వరరావు పోషించాడు. అతడు మువ్వగోపాల పదాలు అనేకం రచించాడు. భక్త తుకారాం నిర్మించిన అంజలీ పిక్చర్స్ వారు అదే కోవలో క్షేత్రయ్య కథను నిర్మించారు. ఆదినారాయణరావు సంగీత దర్శకత్వంలో రామకృష్ణ, బాలసుబ్రహ్మణ్యం (అష్ట నాయికలపై పాట), సుశీల పాడిన పాటలు శ్రోతల్ని అలరించాయి.
మహాకవి క్షేత్రయ్య (1976 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | ఆదుర్తి సుబ్బారావు, సి.ఎస్.రావు |
నిర్మాణం | పి.ఆదినారాయణరావు |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, అంజలీ దేవి, కాంచన, మంజుల (నటి), ప్రభ, కాంతారావు, రావు గోపాలరావు, రాజబాబు, పి.జె శర్మ, జయసుధ, ప్రభాకర రెడ్డి |
సంగీతం | పి.ఆదినారాయణరావు |
నేపథ్య గానం | వి.రామకృష్ణ, బాలసుబ్రహ్మణ్యం |
నిర్మాణ సంస్థ | అంజలి పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
నటీనటులుసవరించు
సాంకేతిక వర్గంసవరించు
- రచన: ఆరుద్ర
- సృత్యాలు: వెంపటి సత్యం
- నిర్మాత, సంగీతం: ఆదినారాయణరావు
- ఛాయాగ్రహణం: వి. ఎస్. ఆర్. స్వామి
- కళ: శేఖర్, వాలి
- దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు, సి యస్ రావు
చిత్రకథసవరించు
వరదయ్య మువ్వ గ్రామంలో ఆకతాయిగా ఉంటాడు. తన మరదలు (ప్రభ) ను ప్రేమిస్తాడు. ప్రభ వరదయ్యతో చనువుగా వుండటం చూసిన ఆమె తండ్రి ప్రభ బాలవితంతువు అని చెబుతాడు. బాధతో ఉన్న వరదయ్యను వివాహమాడతానని కూచిపూడి భాగవతుల కుటుంబంలోని భామ (మంజుల (నటి)) అడుగుతుంది. తల్లి అనుమతి ఉంటే వివాహమాడతానని వరదయ్య చెప్పి తల్లి అడుగుతాడు. కుల భేదంతో తల్లి అందుకు అంగీకరించదు. తను ప్రేమించిన మరదలు, తనను ప్రేమించిన భామ దూరం కావటంతో వరదయ్య విరక్తుడౌతాడు. భామ సోదరుడు (రాజబాబు) భామ ఆత్మహత్య చేసుకుందని జనాన్ని నమ్మించి ఆమెను వరదయ్య దగ్గర చేరుస్తాడు. కూచిపూడికి నాట్య గురువైన సిద్ధేంద్ర యోగి (పి.జె శర్మ) సహకారంతో మువ్వ గోపాలస్వామి కటాక్షంతో వరదయ్య మంచి కవి అవుతాడు. అతని గీతాలు విన్న గోలకొండ తానీషా (ప్రభాకర రెడ్డి) అతన్ని తన దగ్గరకు ఆహ్వానిస్తాడు. అహ్వానాన్ని తిరస్కరించిన వరదయ్యను బలవంతంగా తనతో తీసుకుని పోతాడు తానిషా. భామ సహాయంతో అక్కడి నుండి వరదయ్య తప్పించుకుని తంజావూరు చేరతాడు. తంజావూరు రాజు రఘునాధ నాయకుడు (కాంతారావు), ఆయన రెండవ భార్య, కవయిత్రి రంగాజమ్మలు అంజలీ దేవి వరదయ్యను అభిమానిస్తారు. పొరుగురాజు (మదురై) తో, తంజావూరు రాజుకు ఉన్న వైషమ్యాలలు తొలగించే ప్రయత్నం చేస్తాడు వరదయ్య. ఇరురాజ్యాల మధ్య అనివార్యమైన యుద్ధ సమయంలో రంగాజమ్మ కోరిక మేరకు రాకుమారుడ్ని తీసుకుని వెళతాడు వరదయ్య. తానీషా సాయంతో రాకుమారుడ్ని తంజావూరుకు చేరుస్తాడు. రాజనర్తకి తారామతి (జయసుధ), ఆస్థానకవి (రావు గోపాలరావు) లు క్షేత్రయ్య పట్ల ద్వేషంతో తానీషాను రెచ్చగొట్టి ఒక పోటీ పెట్టిస్తారు. అందులో భాగంగా క్షేత్రయ్య వెయ్యి పదాలు రచించవలసి ఉంటుంది. మంత్రించబడిన ఫలాలు ఆరగించడంతో క్షేత్రయ్య తారామతి పట్ల మోహితుడౌతాడు. సిద్ధేంద్ర యోగి సహాయంతో మోహాన్మత్తత నుండి బయటపడి రచనసాగిస్తాడు. తరువాత తన స్వగ్రామమైన మువ్వ చేరుకుని అక్కడే పరమాత్మ సాయుజ్యాన్ని పొందుతాడు.
ఇతర విశేషాలుసవరించు
- ఈ సినిమా నిర్మాణం మధ్య లోనే ఆదుర్తి కన్నుమూసారు. తదుపరి సి.ఎస్.రావ్ దర్శకత్వంలో పూర్తయింది.