మహారాష్ట్ర స్వాభిమాన్ పక్ష
మహారాష్ట్రలోని రాజకీయ పార్టీ
మహారాష్ట్ర స్వాభిమాన్ పక్ష అనేది మహారాష్ట్రలోని రాజకీయ పార్టీ. 2018 అక్టోబరు 17న నారాయణ్ రాణే ఈ పార్టీని స్థాపించాడు. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవాలని సూచించింది. ఇది 2018 డిసెంబరులో భారత ఎన్నికల కమిషనులో నమోదు చేయబడింది.[1][2][3][4]
మహారాష్ట్ర స్వాభిమాన్ పక్ష | |
---|---|
నాయకుడు | నారాయణ్ రాణే |
స్థాపకులు | నారాయణ్ రాణే |
స్థాపన తేదీ | 17 అక్టోబరు 2017 |
రద్దైన తేదీ | 15 అక్టోబరు 2019 |
రంగు(లు) | నారింజ |
కూటమి | ఎన్.డి.ఎ. (2018-2019) |
2018లో, అతను భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటించాడు. బిజెపి నామినేషన్‌పై రాజ్యసభకు ఎన్నికయ్యాడు.[5]
బీజేపీలో విలీనం
మార్చునారాయణ్ రాణే నేతృత్వంలోని మహారాష్ట్ర స్వాభిమాన్ పక్ష 2019 అక్టోబరు 15న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో కన్కావ్లీలో భారతీయ జనతా పార్టీలో విలీనమైంది.[6]
ఎన్నికలలో పోటీ
మార్చులోక్సభ ఎన్నికలు
మార్చులోక్సభ కాలపరిమితి | భారతీయ సాధారణ ఎన్నికలు | పోటీచేసిన సీట్లు | గెలిచిన సీట్లు | పోలైన ఓట్లు | ఓట్ల % | పోటీ చేసిన సీట్లలో పోలై ఓట్ల % | రాష్ట్రం (సీట్లు) | మూలం |
---|---|---|---|---|---|---|---|---|
17వ లోక్‌సభ | 2019 | 1 | 0 | 2,79,700 | 31.04 | 0 | [7] |
మూలాలు
మార్చు- ↑ "Ex-Congress leader Narayan Rane floats new party". rediff.com. MUMBAI. Retrieved June 19, 2019.
- ↑ "Narayan Rane announces new political party". thehindu.com. MUMBAI. Retrieved October 2, 2017.
- ↑ "Narayan Rane floats new party, to 'support' BJP govt in Maharashtra". timesofindia.com. MUMBAI. Retrieved June 19, 2019.
- ↑ "Rane expected to form separate group in BMC". Free Press Journal. MUMBAI. Retrieved June 19, 2019.
- ↑ Will decide on future of my party within a week: Narayan Rane
- ↑ Banerjee, Shoumojit (15 October 2019). "Finally, Konkan strongman Narayan Rane joins BJP - The Hindu". The Hindu.
- ↑ "General Election 2019 - Election Commission of India". results.eci.gov.in. Retrieved 2019-05-23.