మహావినాయక దేవాలయం
మహావినాయక దేవాలయం, ఒడిషా రాష్ట్రం, జాజ్‌పూర్ జిల్లాలోని చండిఖోలేలో ఉన్న ఒక వినాయక దేవాలయం.[1] రాష్ట్రంలోని పురాతన గణేశ దేవాలయాలలో ఒకటైన ఈ దేవాలయంలోశివుడు, విష్ణువు, దుర్గ, సూర్యుడు, వినాయకుడు[2] మొదలైన దేవుళ్ళు ఒకే గర్భగుడి ఒకే దేవతగా పూజించబడతారు.
మహావినాయక దేవాలయం | |
---|---|
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | మూస:Coor |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఒడిషా |
జిల్లా | జాజ్‌పూర్ |
ప్రదేశం | చండిఖోలే, ఒడిషా |
సంస్కృతి | |
దైవం | శివుడు, విష్ణు, దుర్గ, సూర్యుడు, వినాయకుడు |
ముఖ్యమైన పర్వాలు | శివరాత్రి, మకర సంక్రాంతి |
చరిత్ర, నిర్వహణ | |
స్థాపితం | 12వ శతాబ్ధం |
ఇతర దేవతలు
మార్చుఈ దేవాలయంలో ఐదుగురు దేవుళ్లను ఒకే దేవతగా పూజిస్తారు. శివుడు, విష్ణువులను ఒకే గర్భగుడిలో పూజిస్తారు కాబట్టి, బిల్వ (ఏగల్ మార్మెలోస్), తులసి (పవిత్ర తులసి) రెండింటి ఆకులను ప్రసాదంలో ఉపయోగిస్తారు. బత్తుల భోగానికి బదులుగా అన్నాన్ని ప్రసాదంగా అందజేస్తారు.[3]
చరిత్ర
మార్చుపౌరాణిక, చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశంలో ఉన్న మహావినాయక దేవాలయంను[4] 12వ శతాబ్దంలో ఒడిశా కేశరి వంశ రాజులు నిర్మించారు.[5] శివుని శాపం నుండి తన భర్తను విడిపించడంకోసం కామదేవ్ భార్య రతీ దేవి, వినాయుకుడిని ప్రార్థిస్తున్నప్పుడు ఆ నైవేద్యాన్ని స్వీకరించడానికి ఐదుచేతులు ఏకకాలంలో ఆమె వైపు చాచబడ్డాయి.[6] ఆ తరువాత కామదేవ్ ఆ తర్వాత విడుదలయ్యాడు.
పండుగలు
మార్చుఈ దేవాలయంలో శివరాత్రి, మకర సంక్రాంతి వంటి పండుగలు జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా ఐదురోజులపాటు యజ్ఞం, హోమం నిర్వహిస్తారు. ఇక్కడికి ప్రతి సోమవారం ప్రజలు సందర్శించి పూజలు చేస్తారు. శ్రావణ మాసంలో, శివ భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి పవిత్ర నదీ జలాలతో దేవతామూర్తులకు అభిషేకం చేస్తారు.[5]
పర్యాటకం
మార్చుఈ దేవాలయం ఒడిషా పర్యాటకంలో ప్రముఖ పాత్రను పోషిస్తోంది.[7][8] దట్టమైన చెట్లతో కూడిన కొండలతో ఉన్న ఈ ప్రాంతం యాత్రికులందరికీ ఒక పిక్నిక్ స్పాట్ గా నిలుస్తోంది.[9][10] శీతాకాలం, వేసవి కాలాలలో పర్యాటకులను ఆకర్షిస్తోంది.[11] యాత్రికులు ఉపయోగించడానికి వసతి, దేవాలయ బోర్డింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాలను ఒడిశాలోని ఎండోమెంట్ కమీషనర్ ఒక ట్రస్టీ బోర్డుతో నిర్వహిస్తారు.
మూలాలు
మార్చు- ↑ "Mahavinayak Temple: Mandir Info, History, Timing, Photos, Specialty". rgyan.com (in ఇంగ్లీష్). Retrieved 2022-08-04.
- ↑ "BBC - Religions - Hinduism: Beliefs". www.bbc.co.uk. Retrieved 2022-08-04.
- ↑ Kadambini Magazine Edition September 2013
- ↑ "Mahavinayak Temple". Tours Orissa. Retrieved 2022-08-04.
- ↑ 5.0 5.1 OnlineTemple. "Mahavinayak Temple". OnlineTemple (in ఇంగ్లీష్). Retrieved 2022-08-04.
- ↑ "Hindu Goddess - Rati Devi". www.hinduwebsite.com. Retrieved 2022-08-04.
- ↑ "Mahavinayak Temple in Chandikhole, Jajpur | Odisha Tourism | Things to do in Mahavinayak Temple Places to visit near Mahavinayak Temple". www.eodishatourism.com. Archived from the original on 2020-03-30. Retrieved 2022-08-04.
- ↑ OnlineTemple. "Mahavinayak Temple". OnlineTemple (in ఇంగ్లీష్). Retrieved 2022-08-04.
- ↑ "Mahavinayak Nature Camp | OD Travels". www.odtravels.in (in ఇంగ్లీష్). Retrieved 2022-08-04.
- ↑ "Top attractions at Mahavinayak Nature Camp in Chandikhol". Utkal Today. 2020-12-06. Retrieved 2022-08-04.[permanent dead link]
- ↑ "Incredible Odisha". Archived from the original on 2020-02-23. Retrieved 2022-08-04.