మహేంద్ర రాజ్
మహేంద్ర రాజ్ (1924 – 2022 మే 8) భారతీయ స్ట్రక్చరల్ ఇంజనీర్, డిజైనర్. అతను ఢిల్లీలో ప్రగతి మైదాన్‌లోని హాల్ ఆఫ్ నేషన్స్(Hall of Nations), హైదరాబాద్‌లో సాలార్ జంగ్ మ్యూజియంతో సహా దేశంలోని అనేక భవనాల నిర్మాణ రూపకల్పనకు సహకరించాడు. బహిర్గతమైన కాంక్రీట్ భవనాల కోసం ఇంజనీరింగ్ పరిష్కారాల కోసం ఆయన పనితీరు మార్గదర్శకంగా పరిగణించబడుతుంది. అతని నిర్మాణాల్లో చాలామటుకు స్వాతంత్య్రానంతర భారతదేశ చరిత్ర ఉట్టిపడుతుంది. ఆరు దశాబ్దాల తన కెరీర్‌లో అతను లే కార్బూసియర్, బి. వి. దోషి, చార్లెస్ కొరియా, రాజ్ రేవాల్‌లతో సహా మరెంతోమంది ఆర్కిటెక్ట్‌లతో కలిసి పనిచేశాడు. 250 కంటే ఎక్కువ ప్రాజెక్టుల నిర్మాణాలకు చేసిన రూపకల్పనలో అతని కంట్రిబ్యూషన్ ఉంది.
మహేంద్ర రాజ్ | |
---|---|
జననం | 1924 గుజ్రాన్‌వాలా, పంజాబ్ ప్రావిన్స్, పంజాబ్, బ్రిటిష్ ఇండియా |
మరణం | 8 May 2022 (aged 97) ఢిల్లీ, భారతదేశం |
వృత్తి | ఆర్కిటెక్ట్ |
గుర్తించదగిన సేవలు |
|
బాల్యం, విద్యాభ్యాసం
మార్చుమహేంద్ర రాజ్ 1924లో అప్పటి అవిభక్త బ్రిటిష్ ఇండియాలోని పంజాబ్ రాష్ట్రంలోని గుజ్రాన్‌వాలాలో జన్మించాడు. అతను దిగువ మధ్యతరగతి కుటుంబంలో ఎనిమిది మంది పిల్లలలో ఒకడుగా జన్మించాడు. అతని తండ్రి పంజాబ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో ఇంజనీర్.
మహేంద్ర రాజ్ 1946లో లాహోర్‌లోని పంజాబ్ ఇంజినీరింగ్ కళాశాల నుండి సివిల్ ఇంజనీరింగ్‌లో తన డిగ్రీని పూర్తి చేశాడు.[1][2]
కెరీర్
మార్చుమహేంద్ర రాజ్ పంజాబ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో భవనాలు, రోడ్ల విభాగంలో కెరీర్ మొదలుపెట్టాడు. అతను 1947లో దేశ విభజన తర్వాత అతను భారతదేశం వైపుకు వెళ్ళే చివరి రైళ్లలో ఒకదానిలో ప్రయానించి సుక్షితంగా సిమ్లాకు చేరుకున్నాడు.
నిరాశ్రయులైన మధ్యతరగతి కుటుంబాలకు గృహాలను నిర్మించే బాధ్యత కలిగిన పిడబ్ల్యుడి లోని పునరావాస సెల్‌కు ఆయన నియమించబడ్డాడు. అతను అసిస్టెంట్ డిజైన్ ఇంజనీర్‌గా స్విస్-ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ లే కార్బుసియర్‌తో కలిసి పనిచేశాడు. ఆ తర్వాత పంజాబ్ కొత్త రాజధాని చండీగఢ్ రూపకల్పనకు బాధ్యత వహించాడు. చండీగఢ్ హైకోర్టు, సెక్రటేరియట్‌తో సహా భవనాల నిర్మాణంలో ఆయన కృషి చేసాడు.
ఆ తరువాత ఆయన మిన్నెసోటా విశ్వవిద్యాలయం నుండి నిర్మాణ రూపకల్పనలో మాస్టర్స్ కోసం యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్లాడు. అతని మాస్టర్స్ తర్వాత అతను న్యూయార్క్ వెళ్లి అమ్మన్ & విట్నీలో 1959 వరకు పనిచేశాడు. అతను 1960లో భారతదేశానికి తిరిగి వచ్చి బొంబాయిలో మహేంద్ర రాజ్ కన్సల్టెంట్స్‌ను ప్రారంభించాడు. తరువాత అతను హిందుస్థాన్ నిర్మాణానికి భారతీయ ఆర్కిటెక్ట్, అర్బన్ ప్లానర్ చార్లెస్ కొరియాతో కలిసి పనిచేశాడు.
1961లో న్యూ ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో లివర్ పెవిలియన్. ర్యాంప్‌లు నిర్మాణం రూపొందించాడు.
ఆయన ప్రిట్జ్‌కర్ ప్రైజ్ విన్నింగ్ ఆర్కిటెక్ట్ బి. వి. దోషితో కలిసి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ బెంగళూరు, అహ్మదాబాద్‌లోని ఠాగూర్ హాల్ రూపకల్పనలో పనిచేశాడు. 1971లో ఆయన ప్రగతి మైదాన్‌లోని హాల్ ఆఫ్ నేషన్స్‌ను రూపొందించడానికి భారతీయ వాస్తుశిల్పి రాజ్ రేవాల్‌తో కలిసి పనిచేశాడు. ఈ నిర్మాణం ప్రపంచంలోని అతిపెద్ద స్పేస్ ఫ్రేమ్ నిర్మాణాలలో ఒకటి. ఆయన అలాగే న్యూఢిల్లీలోని చాణక్యపురిలోని అక్బర్ హోటల్‌లో ఆర్కిటెక్ట్ శివనాథ్ ప్రసాద్‌తో కలిసి పనిచేశాడు.
ఆరు దశాబ్దాల తన కెరీర్‌లో 250 కంటే ఎక్కువ ప్రాజెక్టులకు నిర్మాణ రూపకల్పనకు సహకరించాడు. మహేంద్ర రాజ్ భారత ప్రభుత్వంతో కలిసి పనిచేసాడు. 2002లో ఏర్పడిన ఇంజినీరింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కోసం ఇంజనీర్ల వృత్తిని నియంత్రించే చట్టాలను రూపొందించడంలో విశేషకృషి చేసాడు.[3]
వ్యక్తిగత జీవితం
మార్చుమహేంద్ర రాజ్‌కు వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు. అతని చిన్న కుమారుడు రోహిత్ రాజ్ మెహెందిరట్టా కూడా ఆర్కిటెక్ట్. రోహిత్ రాజ్ మెహెందిరట్టా, అతని భార్య వందిని మెహతా రాజ్ కలసి ది స్ట్రక్చర్: వర్క్స్ ఆఫ్ మహేంద్ర రాజ్ అనే పుస్తకాన్ని రాశారు.[4]
చిత్రమాలిక
మార్చు-
చండీగఢ్ హైకోర్టు, చండీగఢ్
-
హాల్ ఆఫ్ నేషన్స్, ప్రగతి మైదాన్, ఢిల్లీ
-
అక్బర్ హోటల్, చాణక్యపురి, న్యూ ఢిల్లీ. ఇది 1965-1969లో నిర్మించబడింది
-
ఠాగూర్ మెమోరియల్ హాల్, అహ్మదాబాద్
-
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ బెంగళూరు, బెంగళూరు
మరణం
మార్చు97 ఏళ్ల మహేంద్ర రాజ్ ఢిల్లీలోని తన నివాసంలో 2022 మే 8న తుదిశ్వాస విడిచాడు. [5]
మూలాలు
మార్చు- ↑ Ismail, Mohammed A.; Mueller, Caitlin T. "Engineering a New Nation: Mahendra Raj and His Collaborations Across Disciplines" (PDF). ACSA - Arch.org. Archived (PDF) from the original on 7 May 2020. Retrieved 8 May 2022.
- ↑ "Mahendra Raj, the man behind Pragati Maidan, Salarjung Museum, passes away". The Indian Express (in ఇంగ్లీష్). 8 May 2022. Archived from the original on 8 May 2022. Retrieved 8 May 2022.
- ↑ Facilitator, Constro (8 May 2022). "Er. Mahendra Raj breathed his last and left for heavenly abode". Constro Facilitator (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 8 May 2022. Retrieved 8 May 2022.
- ↑ "Making space". mint (in ఇంగ్లీష్). 2 December 2009. Retrieved 9 May 2022.
- ↑ "ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ మహేంద్ర రాజ్ కన్నుమూత... సాలార్‌జంగ్ మ్యూజియం, ప్రగతి మైదాన్ రూపకర్త ఆయనే". web.archive.org. 2022-12-31. Archived from the original on 2022-12-31. Retrieved 2022-12-31.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)
బాహ్య లింకులు
మార్చుMedia related to మహేంద్ర రాజ్ at Wikimedia Commons