మాఘమాసము

(మాఘ మాసము నుండి దారిమార్పు చెందింది)
పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

మాఘమాసం తెలుగు సంవత్సరంలో పదకొండవ నెల. చంద్రుడు మఖ నక్షత్రంతో కూడుకున్న మాసం కాబట్టి ఇది మాఘమాసం అయింది. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాసం విష్ణుమూర్తికి ప్రీతిప్రథమైనది.[1]

మాఘమాస మహాత్మ్యం మార్చు

హిందూ సంప్రదాయం ప్రకారం మాఘమాసములో నదీస్నానము చేసి, శ్రీమన్నారాయణుని పూజించి, శక్తికొలది దానం చేస్తే కోటి క్రతువులు చేసినంత ఫలితం కలుగుతుంది. మాఘమాసంలో ఏ నది నీరైననూ గంగానదితో సమానం. ఈ మాసంలో నదీస్నానం సర్వపాపాలను హరిస్తుంది.

పండుగలు మార్చు

మాఘ శుద్ధ పాడ్యమి *
మాఘ శుద్ధ విదియ *
మాఘ శుద్ధ తదియ *
మాఘ శుద్ధ చతుర్థి *
మాఘ శుద్ధ పంచమి శ్రీ పంచమి
మాఘ శుద్ధ షష్ఠి *
మాఘ శుద్ధ సప్తమి రథసప్తమి, మకర సంక్రాంతి
మాఘ శుద్ధ అష్ఠమి *
మాఘ శుద్ధ నవమి *
మాఘ శుద్ధ దశమి *
మాఘ శుద్ధ ఏకాదశి భీష్మఏకాదశి
మాఘ శుద్ధ ద్వాదశి *
మాఘ శుద్ధ త్రయోదశి *
మాఘ శుద్ధ చతుర్దశి *
మాఘ పూర్ణిమ ద్వాపరయుగాది
మాఘ బహుళ పాడ్యమి *
మాఘ బహుళ విదియ *
మాఘ బహుళ తదియ *
మాఘ బహుళ చవితి *
మాఘ బహుళ పంచమి *
మాఘ బహుళ షష్ఠి *
మాఘ బహుళ సప్తమి *
మాఘ బహుళ అష్ఠమి *
మాఘ బహుళ నవమి *
మాఘ బహుళ దశమి *
మాఘ బహుళ ఏకాదశి *
మాఘ బహుళ ద్వాదశి *
మాఘ బహుళ త్రయోదశి సావిత్రీకల్పం ప్రారంభం
మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి
మాఘ బహుళ అమావాస్య *

విశేషాలు మార్చు

  • రామాయణంలో మాఘశుద్ధ ప్రతిపత్తునాడు అంగద రాయబారము, విదియ మొదలు అష్టమి వరకు యుద్ధము, మాఘశుద్ధనవమి నాటి రాత్రి ఇంద్రజిత్తు రామలక్ష్మణుల నాగపాశమున బంధించుటయు, దశమినాడు వాయువు శ్రీరాముని చెవిలో స్వరూపము జపించుటయు వెంటనే నాగపాశములు వదలుటయు, గరుడుని రాక, ఏకాదశీ ద్వాదశు లందు ధూమ్రాక్షవధ, త్రయోదశిని అకంపనవధ, మాఘశుద్ధచతుర్దశి మొదలు కృష్ణప్రతిపత్తు వరకు ప్రహస్తవధ, మరిమూడు దినములు సంకులయుద్ధము, పంచమిమొదలు అష్టమివరకు కుంభకర్ణుని మేలుకొలుపు, పిదప నారు దినములలో కుంభకర్ణునివధ, అమావాస్యనాడు శోకమున యుద్ధవిరామము.
  • సా.శ. 1894 : విజయ నామ సంవత్సరంలో వేంకటగిరిలో చెలికాని గోపాలరావు తిరుపతి వేంకట కవులు వారిచేత ద్విగుణితాష్టావధానమును చేయించారు.[2]
  • సా.శ. 1894 : జయ నామ సంవత్సరంలో బెజవాడలో తిరుపతి వేంకట కవులు అష్టావధానము చెప్పారు.[3]

మూలాలు మార్చు

  1. భాగవతుల, సుబ్రహ్మణ్యం (2009). ధర్మసింధు. pp. 312–334. Retrieved 28 June 2016.
  2. తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 30. Retrieved 27 June 2016.
  3. తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 42. Retrieved 27 June 2016.
"https://te.wikipedia.org/w/index.php?title=మాఘమాసము&oldid=3867716" నుండి వెలికితీశారు