తెలుగు సంవత్సరాలు
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
పేర్ల వెనకవున్న పౌరాణిక కథనంసవరించు
తెలుగు సంవత్సరాల వెనుక ఓ కథ ఉంది. నారద మహాముని ఓసారి విష్ణు మాయ వల్ల స్త్రీగా మారి, ఓ రాజును పెళ్లాడతాడు. వారికి 60 మంది సంతానం జన్మిస్తారు. ఓసారి ఆ రాజు తన సంతానంతో యుద్ధానికి వెళితే అంతా చనిపోతారు. అప్పుడు ప్రార్థించిన నారదుడిని విష్ణువు కరుణిస్తాడు. నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి
ఆధ్యాత్మిక సంబంధ కథనంసవరించు
మనం సౌరమానంలో జీవిస్తున్నాం ఏదైనా బిందువు దగ్గర నుంచి చుట్టు తిరిగితే 360 డిగ్రీలు పూర్తవుతుంది. కేంద్రం నుంచి మనిషి గమనిస్తే ముందు 180 డిగ్రీలు వెనక 180 డిగ్రీలూ అన్నమాట, వెనక వున్న గతం 180 డిగ్రీలూ గతం నిలబడిన రేఖ వర్తమానం ముందున్నవి భవిష్యత్ సూచకాలు. కృత త్రేతా ద్వాపర యుగాలకంటే మానవ ఆయుర్ధాయం పడిపోయి కేవలం 120 సంవత్సరాలకు వచ్చిందట. అందుకే 60 ఏళ్ళు పూర్తవగానే సగం జీవితం పూర్తయ్యిందని గుర్తుచేస్తూ లోకసంభంద విషయాలు పూర్తిచేసుకొమ్మని షష్టిపూర్తి ఉత్సవంగా చేస్తారు. అంటే మిగిలిన 60 ఏళ్లు తరువాతి తరాలకు మార్గదర్శనం చేస్తూ ఆధ్యాత్మిక చింతనలో బ్రతకాలని చెప్పకనే చెప్తున్నారన్నమాట. ఈ అరవై సంవత్సరాల వలయంలో వారు పుట్టిన సంవత్సరం నుంచి 60 పూర్తికావడాన్ని వలయ సంపూర్తిగా తెలుస్తుంది.
జ్యోతిష సంబంధ వివరణసవరించు
జ్యోతిష శాస్త్రం ప్రకారం తీసుకుంటే ద్విశతోత్తరి దశ అనే ప్రమాణంలో 120 సంవత్సరాలను సూచిస్తుంది. నవ గ్రహాలు వాటి వాటి వ్యాపనం రీత్యా ఆయుర్ధాయాన్ని పంుకుంటే మొత్తంగా 120 ఆయుష్షు మానవుడిది అని లెక్కకు వస్తుంది. దానితో పాటు అరవై సంవత్సరాలకు ఒకసారి మానవుడి మనో ధర్మాలతో పాటు మానవ ధర్మాల విషయంలోనూ మార్పులు వస్తాయి. మానవుడి బుద్ధి శక్తి కూడా 60 ఏళ్లు నిరాటంకంగా పనిచేస్తుంది. క్రమంగా జ్ఞాపక శక్తి క్షీణిస్తూ వుస్తుంది. శరీరంలో కండరాలు కరిగిపోతాయి. అరవై సంవత్సరాల లోపు మృత్యుశక్తి ఒకసారి ప్రభావం చూపుతుందని ఆధ్యాత్మిక వేత్తలు చెపుతారు. అంటే ఏదోవిధమైన ప్రాణాపాయం దగ్గరకు వచ్చి వెళుతుందన్నమాట. అరవై సంవత్సరాలనుంచి ప్రతిపదేళ్ళకూ ఈ మృత్యుశక్తి పలకరిస్తూ వుంటుందట. అరవై ఏళ్ళ తర్వాత సంవత్సర చక్రం పూర్తయినట్లే మనిషి రెండో బాల్య దశకు వస్తాడట. చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తుంటారు. అకారణంగా అలగటం అవీ ఇవీ తినాలనే కోరిక కలగటం, ఎక్కువ సేపు నిద్రపోవడం, చిన్న చిన్న విషయాలకే ఆనంద పడటం. కోపం తెచ్చుకోవడం, కన్నీళ్ళు పెట్టుకోవడం వంటి బాల్య చేష్టలన్నీ 60 తర్వాత మళ్ళీ ప్రారంభం అవుతాయి. అప్పటి నుంచి ప్రతిబిడ్డ తన తల్లి దండ్రులను బిడ్డలతో సమానంగా చూసుకోవాలని ధర్మశాస్త్రం చెపుతుంది.
గ్రెగోరియన్ కేలండర్ సా.శ.. క్యాలెండర్ ప్రకారం సంవత్సరాల పేర్లుసవరించు
ముందు: రాజముఖం. అశోకుని కాలమునాటి బ్రాహ్మీలిపిలో ప్రాకృతం: శిరి శాతకనీస రానో ... వసితిపుతస.
వెనుక: ఎడమవైపు ఉజ్జయినీ/శాతవాహన చిహ్నం. కుడివైపు ఆరు అర్ధచంద్రాకారపు ఆర్చులతో చైత్యగిరి. క్రింది భాగములో నది. తెలుగు బ్రాహ్మీ లిపిలో: అరహనకు వహిత్తి మకనకు తిరు హతకనికో.
హిందూ కాలగణన (Hindu calendar) కాలక్రమాన అనేక మార్పులు చెందింది. ఫలితంగా ప్రస్తుతం వివిధ ప్రాంతీయ కాలగణనా విధానాలున్నాయి. అధికంగా హిందూ కాలగణన సూర్య సిద్ధాంతం ఆధారంగా ఉంది. ఇది సుమారుగా సా.శ.. 3వ శతాబ్దానికి ప్రామాణికంగా రూపొందినట్లు భావిస్తున్నారు. ఇది వేదాంగాలలో ఒకటైన జ్యోతిషం అనే భాగంగా పరిగణింపబడుతుంది. ఆర్యభట్టుడు (సా.శ.. 499), వరాహమిహిరుడు (6వ శతాబ్దం), భాస్కరాచార్యుడు (12వ శతాబ్దం) వంటి జ్యోతిశ్శాస్త్రవేత్తలు ఈ కాలగణనను మరింత అభివృద్ధి చేశారు. సంవత్సరాలు గణన చెయ్యడం కోసం శకాలు ఏర్పాటు చెయ్యడం జరిగింది. వివిధమైన శకాలు ఆచరణలో ఉన్నాయి. కలి శకం, (క్రీస్తుశకం+3101) శాలివాహన శకం, విక్రమార్క శకం, క్రీస్తు శకం, ఆది శంకర భగవత్పాదుల శకం, శ్రీకృష్ణదేవరాయల శకం మొదలైనవి. మానవజాతి చరిత్రలో కాలమానాలను చరిత్రలో పేరుపొందిన వారి పేరుతో వాడుట పరిపాటి. వీటిలో ఎక్కువగా వాడబడుతున్న క్రీస్తు శకం ఒకటిగాక, భారతదేశంలో ప్రామాణికమైనది శాలివాహనశకం. ఇది హిందూ కాలమానం, భారతజాతీయ కాలమానం, కంబోడియా బౌద్ధ కాలమానంగా వాడబడుతున్నది. ఇది శాతవాహనులలో ప్రముఖుడైన హాలశాతవాహనుని రాజ్యకాలంలో శకనులపై విజయం సాధించిన సంవత్సరం నుండి ప్రారంభమైనది. ఇది సా.శ.. 78 లో ప్రారంభమైంది.[1] దీనికి ముందు విక్రమశకం క్రీ పూ 56 నుండి వాడుకలో వుండేది. "హిజ్రీ శకా"నికి మూలం ముహమ్మద్ ప్రవక్త గారి హిజ్రా (هِجْرَة), హిజ్రాహ్ లేదా హిజ్రత్. మహమ్మదు ప్రవక్త , అతని అనుయాయులు మక్కా నుండి మదీనా కు సా.శ.. 622 లో వలసవెళ్ళారు. ఈ వలస వెళ్ళడాన్నే హిజ్రత్ అని అంటారు.
సెప్టెంబరు 622 లో మహమ్మదు ప్రవక్త తన అనుయాయులతో కలసి హిజ్రత్ (వలస చేసి) 'యస్రిబ్' నగరాన్ని చేరుకొన్నారు. యస్రిబ్ నగరానికి మదీనా (తెలుగార్థం: నగరం) లేదా "మదీనతున్-నబీ" లేదా నబీ (ప్రవక్త) గారి నగరంగా పేరు స్థిరపడింది. ముస్లింల శకం హిజ్రీ ప్రారంభమయింది. ఉమర్ కాలంలో 638లో ఇస్లామీయ కేలండర్ ప్రారంభమయింది.
- క్రీస్తుశకం - క్రీస్తు జననం నుంచి (సా.శ.. 1)
- విక్రమశకం - విక్రమాదిత్యుడు పట్టాభిషిక్తుడైన నాటి నుంచి (క్రీ.పూ. 57)
- శాలివాహనశకం - శాతవాహనులలో పేరొందిన హాలశాతవాహనుని రాజ్యకాలంలో శకనులపై విజయం సాధించినప్పటి నుండి (సా.శ.. 78)
తెలుగు సంవత్సరాలు మొత్తం 60.
తెలుగు సంవత్సరాలు ఫలితాలుసవరించు
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
తెలుగు సంవత్సరాలు మొత్తం 60.
తెలుగు సంవత్సరం పేరు | సంవత్సర ఫలితము. | |
---|---|---|
1 | ప్రభవ | ప్రభవించునది అంటే పుట్టుక.యజ్ఞములు విరివిగా జరుగుతాయి. |
2 | విభవ | వైభవంగా ఉండేది. జనులు సుఖముగా ఉంటారు. |
3 | శుక్ల | అంటే తెల్లనిది. నిర్మలత్వం, కీర్తి, ఆనందాలకు ప్రతీక పంటలు సమృద్ధిగా పండుతాయి. |
4 | ప్రమోదూత | ఆనందం. ప్రమోదభరితంగా ఉండేది ప్రమోదూత ప్రజలందరు ఆనందంగా ఉంటారు |
5 | ప్రజోత్పత్తి | ప్రజ ఆంటే సంతానం. సంతాన వృద్ధి కలిగినది ప్రజోత్పత్తి అంతటా అభివృద్ధి కనిపిచును |
6 | అంగీరస | అంగీరసం అంటే శరీర అంగాల్లోని ప్రాణశక్తి, ప్రాణదేవుడే అంగీరసుడు. ఆ దేవుడి పేరు మీదే ఈ పేరొచ్చింది అని అర్థంభోగములు కలిగి ఉంటారు |
7 | శ్రీముఖ | శుభమైన ముఖం. ముఖం ప్రధానాంశం కాబట్టి అంతా శుభంగా ఉండేదనే అర్ధం లోకమంతా సౌఖ్యముగా ఉంటుంది |
8 | భావ | భావ అంటే భావ రూపుడిగా ఉన్న నారాయణుడు. ఈయనే భావ నారాయణుడు. ఈయన ఎవరని విశ్లేషిస్తే సృష్టికి ముందు సంకల్పం చేసే బ్రహ్మ అని పండితులు వివరిస్తున్నారు ఉన్నత భావమును కలిగిస్తుంది |
9 | యువ | యువ అనేది బలానికి ప్రతీక ఇంద్రుడు వర్షములు కురిపించుట వలన లోకమంతా సస్యశ్యామలముగా ఉంటుంది |
10 | ధాత | అంటే బ్రహ్మ. అలాగే ధరించేవాడు, రక్షించేవాడు. అన్ని ఔషధులు (మొక్క ధాన్యాలు)పండును |
11 | ఈశ్వర | పరమేశ్వరుడు. అందరికీ క్షేమము ఆరోగ్యము కలిగించును |
12 | బహుధాన్య | సుభిక్షంగా ఉండటం.అన్ని రకాల పంటలూ విరివిగా పండటం దేశమంతా సుభిక్షముగా ఉంటుంది |
13 | ప్రమాది | ప్రమాదమున్నవాడు అని అర్థమున్నప్పటికీ సంవత్సరమంతా ప్రమాదాలు జరుగుతాయని భయపడనవసరం లేదు. ప్రమాదో ధీమతామపి అన్నారు. |
14 | విక్రమ | విక్రమం కలిగిన వాడు. మధ్యమ వర్షపాతము ఉంటుంది |
15 | వృష | చర్మం. అంతటా వర్షములు కురుస్తాయి |
16 | చిత్రభాను | భానుడంటే సూర్యుడు. సూర్యుడి ప్రధాన లక్షణం ప్రకాశించటం. చిత్రమైన ప్రకాశమంటే మంచి గుర్తింపు పొందడమని అర్థం. సూర్యునిలో మార్పులకు అవకాశం వుంటుంది. చిత్రవిచిత్ర అలంకారములను ఇస్తుంది |
17 | స్వభాను | స్వయం ప్రకాశానికి గుర్తు. స్వశక్తి మీద పైకెదిగేవాడని అర్థం క్షేమము ఆరోగ్యము ఇస్తుంది |
18 | తారణ | తరింపచేయడం అంటే దాటించడం. కష్టాలు దాటించడం, గట్టెక్కించడం అని అర్థం. పంటలకు అనుకూలముగా వర్షములు కురుస్తాయి |
19 | పార్థివ | పృధ్వీ సంబంధమైనది, గుర్రం అనే అర్థాలున్నాయి. భూమికున్నంత సహనం, పనిచేసేవాడని అర్థం.సస్యములు సంపదలు సమృద్ధి ఔతాయి |
20 | వ్యయ | ఖర్చు కావటం. ఈ ఖర్చు శుభాల కోసం ఖర్చై ఉంటుందని ఈ సంవత్సరం అర్థం అతివృష్ఠి కలుగుతుంది |
21 | సర్వజిత్తు | సర్వాన్ని జయించినది ప్రజలు సుఖించునట్లు వర్షాలు పడతాయి. |
22 | సర్వధారి | సర్వాన్ని ధరించేది. సుభిక్షముగా ఉంటుంది. |
23 | విరోధి | విరోధం కలిగినట్టువంటిది. మేఘాలను హరించి వర్షము పడకుండా చేద్తుంది |
24 | వికృతి | వికృతమైనటువంటిది. భయంకరముగా ఉంటుంది |
25 | ఖర | గాడిద, కాకి, ఒక రాక్షసుడు, వాడి, వేడి, ఎండిన పోక అనే అర్థాలున్నాయి.పురుషులు వీరులౌతారు |
26 | నందన | కూతురు, ఉద్యానవనం, ఆనందాన్ని కలుగజేసేది. ప్రజలు ఆనందముగా ఉంటారు |
27 | విజయ | విశేషమైన జయం కలిగినది. శత్రువులను హరించును |
28 | జయ | జయాన్ని కలిగించేది. శత్రువులు, రోగముల మీద విజయము కలుగుతుంది |
29 | మన్మథ | మనస్సును మధించేది. జ్వరాఫ్హిబాఫ్హలు కలుగును |
30 | దుర్ముఖి | చెడ్డ ముఖం కలది.ప్రజలు దుష్కర్మలు చేస్తారు |
31 | హేవిలంబి (లేదా) హేమలంబ | సమ్మోహన పూర్వకంగా విలంబి చేసేవాడని అర్థం సంపదలు కలుగును |
32 | విలంబి | సాగదీయడం. సుభిక్షముగా ఉంటుంది |
33 | వికారి | వికారం కలిగినది. శత్రువులకు కోపము కలిగించును |
34 | శార్వరి | రాత్రి అక్కడక్కడా పంటలు పండును |
35 | ప్లవ | తెప్ప. కప్ప, జువ్వి... దాటించునది అని అర్థం కష్టాలనుంచి దాటిస్తుంది సమృద్ధిగా జలం ప్రవహించును |
36 | శుభకృతు | శుభాన్ని చేసి పెట్టేది ప్రజలు శుభముంగా ఉంటారు |
37 | శోభకృతు | శోభను కలిగించేది ప్రజలు శుఖంగా ఉంటారు |
38 | క్రోధి | క్రోధాన్ని కలిగినది కోపస్వభావం పెరుగుతుంది |
39 | విశ్వావసు | విశ్వానికి సంబంధించినది ధనసమృద్ధి కలుగుతుంది |
40 | పరాభవ | అవమానం. ప్రజలు ఒకరిని ఒకరు అవమానించుకుంటారు |
41 | ప్లవంగ | కోతి, కప్ప. జలసమృద్ధి అధికంగా ఉంటుంది |
42 | కీలక | పశువులను కట్టేందుకు ఉపయోగించే కొయ్య. సస్య సమృద్ధి అధికంగా ఉంటుంది |
43 | సౌమ్య | మృదుత్వం.ప్రజలకు శుభములు కలుగుతాయి |
44 | సాధారణ | సామాన్యంగా వుండునట్టిది. ప్రజలకు సామన్య శుభములు కలుగుతాయి |
45 | విరోధికృతు | విరోధాలను కలిగించేది ప్రజలలో విరోధభావం పెరుగుతుంది |
46 | పరీధావి | భయకారకం. ప్రజలలో భీతి అధికం ఔతుంది |
47 | ప్రమాదీచ | ప్రమాద కారకం. |
48 | ఆనంద | ఆనందమయం ప్రజలు ఆనదంగా ఉంటారు |
49 | రాక్షస | రాక్షసత్వాన్ని కలిగినది. ప్రజలులో క్రూర స్వభావం అధికమైరుంది |
50 | నల | నల్ల అనే పదానికి రూపాంతరం. |
51 | పింగళ (లేదా) పింగల | ఒక నాడి, కోతి, పాము, ముంగిస. |
52 | కాళయుక్తి (లేదా) కాలయుక్తి | కాలానికి తగిన యుక్తి. |
53 | సిధ్ధార్థి | కోర్కెలు సిద్ధించింది. |
54 | రౌద్రి | రౌద్రంగా ఉండేది. ప్రకృయి విపత్తులు సంభవిస్తాయి |
55 | దుర్మతి | దుష్ట బుద్ధి. ప్రజలకు దుర్బుద్ధులు అధికమౌతాయి |
56 | దుందుభి | వరుణుడు. |
57 | రుధిరోద్గారి | రక్తాన్ని స్రవింప చేసేది. రక్తధారలు ప్రవహిస్తాయి |
58 | రక్తాక్షి | ఎర్రని కన్నులు కలది. ప్రజలకు ప్రకృతికారక కోప విపత్తులు కలిగే అవకాశం వుంటుంది |
59 | క్రోధన | కోప స్వభావం కలది. ప్రజలలో క్రోధం అధికమౌతుంది |
60 | అక్షయ | నశించనిది. ప్రజలు సుభిక్షంగా ఉంటారు |
ఇవీ చూడండిసవరించు
- 1832-33లో వచ్చిన గుంటూరు కరువు లేదా డొక్కల కరువు లేదా నందన కరువు సమయంలో ప్రజలకు బ్రౌను చేసిన సేవలు ప్రశంసలందుకున్నాయి.
Look up తెలుగు సంవత్సరాలు in Wiktionary, the free dictionary. |