ఎమ్మిగనూరు

ఆంధ్రప్రదేశ్, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పట్టణం
(యెమ్మిగనూరు నుండి దారిమార్పు చెందింది)


ఎమ్మిగనూరు (యెమ్మిగనూరు) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాకు చెందిన పట్టణం, అదే పేరుగల మండలానికి ఇది కేంద్రం. ఇది మంత్రాలయం నుండి 22 కిమీ దూరంలో కర్నాటక సరిహద్దులో ఉంటుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం జనవరిలో "శ్రీ నీలకంఠేశ్వర జాతర" ఘనంగా జరుగుతుంది. ఈ పట్టణం చేనేత వస్త్రాల ఉత్పత్తికి ప్రసిద్ధి.

పట్టణం
పటం
Coordinates: 15°46′05″N 77°28′55″E / 15.768°N 77.482°E / 15.768; 77.482
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకర్నూలు జిల్లా
మండలంఎమ్మిగనూరు మండలం
విస్తీర్ణం
 • మొత్తం14.50 కి.మీ2 (5.60 చ. మై)
జనాభా
 (2011)[1]
 • మొత్తం95,149
 • జనసాంద్రత6,600/కి.మీ2 (17,000/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1005
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్(PIN)518360 Edit this on Wikidata
WebsiteEdit this at Wikidata

పేరు వెనుక చరిత్ర

మార్చు

ఎమ్మిగనూరు పేరు వెనుక, సరిహద్దు కర్నాటక రాష్ట్ర భాష కన్నడ ప్రభావం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కన్నడ భాషలో ఎమ్మె అంటే ఎనుము (గేదె) అని, నూరు అంటే వంద అని అర్థం. ఈప్రాంతం ఊరూ పేరూ లేని మజరా గ్రామంగా ఉన్న రోజుల్లో ఇక్కడి పశువుల సంతలో వంద రూపాయలకే ఓ గేదెను కొనుక్కోగలిగేవారట. ఆ విధంగా ఎమ్మెగె నూరు రూపాయి తగొళ్లువ ఊరు ( గేదెకు వంద రూపాయలు తీసుకునే ఊరు) గా ఈ ప్రాంతం గుర్తింపు పొందింది. ఆ తర్వాతిక్రమంలో... ఈ ప్రాంతం ఎమ్మెగెనూరు గాను, తర్వాతి రోజుల్లో ఎమ్మిగనూరు గానూ స్థిరపడిపోయింది.

చరిత్ర

మార్చు

ఇక్కడి చేనేత వస్త్రాలను గతంలో సింగపూరు తదితర దేశాలకు ఎగుమతులు కూడా చేసేవారు. చేనేతకారులకు ప్రత్యేకంగా ఒక కాలనీ ఉంది. మాచాని సోమప్ప ఈ కాలనీకి భూమిని సమకూర్చడంలో సహాయపడ్డాడు.

జనగణన వివరాలు

మార్చు

జనాభా (2011) - మొత్తం 95149.

పరిపాలన

మార్చు

ఎమ్మిగనూరు పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.

రవాణా

మార్చు

కర్నాటక లోని హాగరి - తెలంగాణలోని కోదాడను కలిపే జాతీయ రహదారి 167 మార్గంలో ఎమ్మిగనూరు ఉంది. సమీప రైలు స్టేషన్ 30 కి.మీ. దూరంలో ఆదోని రైల్వే స్టేషన్.

దర్శనీయ స్థలాలు

మార్చు
  • నీలకంఠేశ్వర స్వామి దేవాలయం
  • షిర్డీ సాయి దేవాలయం
  • మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం, ఎమ్మిగనూరుకు 22 కి.మీ.దూరంలోవుంది.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018

బయటి లింకులు

మార్చు