మాధవ్ ధనంజయ గాడ్గిల్ (జననం 1942) భారతీయ పర్యావరణ శాస్త్రవేత్త, [1] విద్యావేత్త, రచయిత, కాలమిస్టు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో నడిచే పరిశోధనా వేదిక [2] అయిన సెంటర్ ఫర్ ఎకోలాజికల్ సైన్సెస్ వ్యవస్థాపకుడు. [3] అతను భారత ప్రధానమంత్రికి సైంటిఫిక్ అడ్వైజరీ కౌన్సిల్ మాజీ సభ్యుడు. గాడ్గిల్ కమిషన్ గా ప్రసిద్ధి చెందిన 2010 నాటి పశ్చిమ కనుమల పర్యావరణ శాస్త్ర నిపుణుల ప్యానెల్ (WGEEP) కు అధిపతి. [4] [5] అతను వోల్వో ఎన్విరాన్మెంట్ ప్రైజ్, టైలర్ ప్రైజ్‌ల గ్రహీత. భారత ప్రభుత్వం 1981 లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2006 లో పద్మ భూషణ్ పురస్కారాన్నీ ప్రదానం చేసింది. [6]

మాధవ్ గాడ్గిల్
మాధవ్ గాడ్గిల్
జననం(1942-05-24)1942 మే 24
పూణే
నివాసంPune
జాతీయతభారతీయుడు
రంగములుEcology, Conservation Biology, Human Ecology, Ecological history
వృత్తిసంస్థలుHarvard University
Centre for Ecological Sciences, Indian Institute of Science, Bangalore
చదువుకున్న సంస్థలుపూణే విశ్వవిద్యాలయం
ముంబై విశ్వవిద్యాలయం
హార్వర్డ్ విశ్వవిద్యాలయం
ప్రసిద్ధిగాడ్గిల్ కమిషన్
People Biodiversity Register in India
ముఖ్యమైన పురస్కారాలుపద్మశ్రీ
శాంతి స్వరూప్ భట్నగర్ పురస్కారం
రాజ్యోత్సవ ప్రశస్తి
Harvard Centennial Medal
Volvo Environment Prize
పద్మ భూషణ్
H. K. Firodia award
Georgescu-Roegen Award
Tyler Prize for Environmental Achievement
Georgescu-Roegen Award
Vikram Sarabhai Award
ఈశ్వరచంద్ర విద్యాసాగర్ పురస్కారం

జీవిత విశేషాలు మార్చు

గాడ్గిల్ 1942 మే 24 న [7] మహారాష్ట్రలోని పూణేలో జన్మించాడు. అతని తల్లిదండ్రులు ప్రమీల, ధనంజయ్ రామ్‌చంద్ర గాడ్గిల్. తండ్రి కేంబ్రిడ్జ్ పండితుడు, [8] ఆర్థికవేత్త, గోఖలే ఇన్స్టిట్యూట్ మాజీ డైరెక్టరు, గాడ్గిల్ ఫార్ములా రచయిత. [9] అతను 1963 లో పూణే విశ్వవిద్యాలయానికి చెందిన ఫెర్గూసన్ కాలేజీ నుండి జీవశాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు. 1965 లో ముంబై విశ్వవిద్యాలయం నుండి జంతుశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పొందాడు. [10] [11]

హార్వర్డ్ మ్యూజియంలోని కంపారిటివ్ జువాలజీలో చేపల క్యూరేటర్ అయిన గైల్స్ మీడ్ గాడ్గిల్‌ను హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చేరమని ప్రోత్సహించాడు. ప్రారంభంలో మీడ్ కింద పరిశోధన చేయాలని భావించిన గాడ్గిల్ తరువాత "ఆ సమయంలో హార్వర్డ్‌లో జీవశాస్త్రం యొక్క పర్యావరణ-పరిణామ ముగింపులో ప్రకాశవంతమైన యువ నక్షత్రం" అయిన EO విల్సన్ ఉపన్యాసాలను విని, తన పరిశోధన సబ్జెక్టును మార్చుకున్నాడు. తరువాత గణిత జీవావరణ శాస్త్రం, చేపల గురించి విలియం బోసెర్ట్ మార్గదర్శకత్వంలో డాక్టరల్ పరిశోధన చేశాడు. బోసెర్ట్ విల్సన్ యొక్క పూర్వ విద్యార్థులలో ఒకడు. [12] [13]

అతనికి 1969 లో పిహెచ్‌డి వచ్చింది. [14] తదనంతరం, హార్వర్డ్ కంప్యూటింగ్ సెంటర్‌లో రీసెర్చ్ ఫెలోగా తన పనిని కొనసాగించడానికి ఐబిఎం నుండి ఫెలోషిప్ అందుకున్నాడు. అదే సమయంలో రెండు సంవత్సరాలు విశ్వవిద్యాలయంలో జీవశాస్త్ర లెక్చరర్‌గా పనిచేశాడు. [14]

అతను 1971 లో భారతదేశానికి తిరిగి వచ్చాడు [15] పూణేలోని మహారాష్ట్ర అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ యొక్క అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో శాస్త్రీయ అధికారిగా ఉద్యోగం తీసుకున్నాడు. అతను రెండు సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. [16] 1973 లో, అతను బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సి) లో చేరాడు. ముప్పై సంవత్సరాలకు పైగా సాగే అనుబంధాన్ని మొదలుపెట్టాడు. 2004 లో దాని ఛైర్మన్‌గా రిటైరయ్యాడు. [16] ఈ కాలంలో, అతను IISc లో రెండు పరిశోధనా కేంద్రాలను స్థాపించాడు -సెంటర్ ఆఫ్ థియొరెటికల్ స్టడీస్, సెంటర్ ఫర్ ఎకోలాజికల్ స్టడీస్. [17] అతను స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం (1991), కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బర్కిలీ (1995) లో విజిటింగ్ ప్రొఫెసర్‌గా కూడా పనిచేశాడు. ఐఐఎస్సి నుండి పదవీ విరమణ చేసిన తరువాత, అతను అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ [16]తో తన అనుబంధాన్ని తిరిగి ప్రారంభించడానికి 2004 లో పూణేకు తిరిగి వెళ్ళాడు. గోవా విశ్వవిద్యాలయంలో విజిటింగ్ రీసెర్చ్ ప్రొఫెసరుగా ఉన్నాడు. [18] [19]

గాడ్గిల్, తన కళాశాల సంవత్సరాల్లో చురుకైన క్రీడాకారుడు. 1959, 1961 లనటి మహారాష్ట్ర స్టేట్ జూనియర్, పూణే విశ్వవిద్యాలయం హైజంప్ రికార్డులు అతని పేరిటే ఉన్నాయి. ఆల్ ఇండియా యూనివర్శిటీ అథ్లెటిక్ మీట్‌లో పూణే విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించాడు. [20] అతను సులోచనా గడ్గిల్ అనే ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్త, హార్వర్డ్ పండితురాలిని పెళ్ళి చేసుకున్నాడు. ఆమెను హార్వర్డ్‌లో చదివేటపుడు కలుసుకున్నాడు. [21] ఈ దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె జర్నలిస్ట్ కమ్ స్పానిష్ ఉపాధ్యాయురాలు. కుమారుడు గణిత శాస్త్రజ్ఞుడు. [22] [21] ఈ కుటుంబం తమ సొంత పట్టణమైన పూణేలో నివసిస్తుంది. అతని జీవిత కథ విజ్ఞాన్యాత్రి - డాక్టర్ మాధవ్ గాడ్గిల్ను మరాఠీలో ఎపి దేశ్‌పాండే రాశారు. [23]

మూలాలు మార్చు

  1. Gadgil, Madhav. "My Fundays". The telegraph. Retrieved 11 January 2012.
  2. "HONORARY MEMBERSHIP AWARD" (PDF). Ecological Society of America. Retrieved 7 October 2015.
  3. "Centre for Ecological Sciences". Indian Institute of Science. Retrieved 8 October 2015.
  4. "FDI does not benefit any country". ReDiff Business. Retrieved 7 October 2015.
  5. "Report of the Western Ghats Ecology Expert Panel" (PDF). Ministry of Environment and Forests. Archived from the original (PDF) on 20 సెప్టెంబరు 2015. Retrieved 7 October 2015.
  6. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. Archived from the original (PDF) on 15 అక్టోబరు 2015. Retrieved 21 July 2015.
  7. "IAS Fellow". Indian Academy of Sciences. 2015. Retrieved 8 October 2015.
  8. Gadgil, M. (September 1993). "In love with life". Seminar (409): 25–30.
  9. "Shri. Dhananjayrao Gadgil". Saharakar Bharati. 2015. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 10 October 2015.
  10. "INSA Fellow". Indian National Science Academy. 2015. Archived from the original on 12 ఆగస్టు 2016. Retrieved 7 October 2015.
  11. Ramachandra Guha (2006). How Much Should a Person Consume?: Environmentalism in India and the United States. University of California Press. p. 262. ISBN 9780520248038.
  12. Gadgil, M. (September 1993). "In love with life". Seminar (409): 25–30.
  13. (Michael L. Lewis 2003, pp. 109–137)
  14. 14.0 14.1 "2015 Tyler Laureates". University of Southern California. 2015. Retrieved 7 October 2015.
  15. Sulochana Gadgil (2015). "My tryst with the monsoon" (PDF). Indian Academy of Sciences. Retrieved 9 October 2015.
  16. 16.0 16.1 16.2 "INSA Fellow". Indian National Science Academy. 2015. Archived from the original on 12 ఆగస్టు 2016. Retrieved 7 October 2015.
  17. "2015 Tyler Laureates". University of Southern California. 2015. Retrieved 7 October 2015.
  18. "Visiting Research Professor". University of Goa. 2015. Retrieved 8 October 2015.
  19. "Madhav Gadgil to file Goa's ecological history". VN. 2015. Retrieved 8 October 2015.
  20. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; National Institute of Engineering profile అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  21. 21.0 21.1 Sulochana Gadgil (2015). "My tryst with the monsoon" (PDF). Indian Academy of Sciences. Retrieved 9 October 2015.
  22. Ramachandra Guha (2006). How Much Should a Person Consume?: Environmentalism in India and the United States. University of California Press. p. 262. ISBN 9780520248038.
  23. A. P. Deshpande. Vidnyanyatri – Dr. Madhav Gadgil. Rajhans Prakashan. ISBN 9788174345516. Archived from the original on 2020-06-29. Retrieved 2020-06-27.
#https://en.wikipedia.org/wiki/Madhav_Gadgil తెదీ 7 అక్టోబరు 16