మాధురీ దీక్షిత్

భారతీయ నటి
(మాధురి దీక్షిత్ నుండి దారిమార్పు చెందింది)
This article incorporates information from this version of the equivalent article on the English Wikipedia.

మాధురి దీక్షిత్ (మే 15, 1967 - ) భారత దేశపు ప్రముఖ బాలివుడ్ నటి. 1980ల నుండి 1990ల వరకు ఆమె హిందీ సినీ పరిశ్రమలో అగ్రగామి నటి, మంచి నాట్యకారిణిగా ప్రఖ్యాతి పొందారు. ఆమె ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించడమే కాకుండా తన నటనకి గాను విమర్శకులతో ఎన్నో ప్రశంసలు అందుకుని బాలివుడ్ లోని అత్యంత ఉన్నతమైన నటీమణులో ఒకరు అయ్యారు. 2008వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఆమెను పద్మ శ్రీ బిరుదుతో సత్కరించారు.

మాధురీ దీక్షిత్ నెనె(madhuri dixit)
2012లోని కలర్స్ గోల్డెన్ పెటల్ పురస్కారాలులో మాధురీ దీక్షిత్
జననం (1967-05-15) 1967 మే 15 (వయసు 56)
ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1984–నేటి వరకూ
జీవిత భాగస్వామిడాక్టర్ శ్రీరాం మహదేవ్ నెనె (1999–నేటి వరకూ)
తల్లిదండ్రులు
  • శంకర్ (తండ్రి)
  • స్నేహలత దీక్షిత్ (మ.2023 మార్చి 12) (తల్లి)

బాల్యము, విద్య మార్చు

మాధురి దీక్షిత్ ముంబైకి చెందినవారు. ఆమె అసలు పేరు మాధురి శంకర్ దీక్షిత్. ఆమె మరాఠి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన శంకర్, స్నేహలత దీక్షిత్ ల కుమార్తె. ఆమె ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఢిల్లీ విశ్వవిద్యాలయం వంటి సంస్థల నుండి తన చదువు పూర్తి చేసారు. ఆమెకి మైక్రో బయాలజిస్ట్ అవ్వాలనే అశయం ఉండేది. అమె కథక్ నృత్యాన్ని ఎనిమిది సంవత్సరాలు అభ్యసించి అందులో ప్రవీణులయ్యారు.

సినీ జీవితం మార్చు

1984లో మాధురి దీక్షిత్ "అబోద్" సినిమాతో అరంగేట్రం చేశారు. కొన్నిసినిమాల్లో సహాయ నటిగా చేసాక అమె "తేజాబ్" సినిమాలో ముఖ్య నటి పాత్ర పొషించారు. ఈ సినిమా అమెకి పేరునే కాకుండా తన మొదటి ఫిలింఫేర్ నామినేషన్ ని కూడా తెచ్చిపెట్టింది. ఆపై ఆమె "రాం లఖన్" (1989), "పరిందా" (1989), "త్రిదేవ్" (1989), "కిషన్ కన్హయ్యా" (1990) వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు.

1990 లో దీక్షిత్ ఇంద్ర కుమార్ దర్శకత్వం వహించిన "దిల్" అనే ప్రేమ కథా చిత్రంలో ఆమిర్ ఖాన్ సరసన నటించారు. ఇందులో ఆమె ఒక డబ్బున్న పొగరుగత్తె అమ్మాయి అయిన మధు మెహ్రా పాత్రలో నటించారు. ఈ సినిమాలో మధు రాజా (అమీర్ ఖాన్) తో ప్రేమలో పడి అతనితో పెళ్ళికై ఇల్లు విడిచి వెళతారు. ఈ సినిమా ఆ సంవత్సరంలోని చాలా పెద్ద విజయవంతమైన చిత్రాల్లో ఒకటైంది. అంతే కాకుండా దీక్షిత్ కు ఆమె సినీ జీవితపు మొట్ట మొదటి ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని కూడా తెచ్చి పెట్టింది.

"దిల్" తరువాత ఆమె "సాజన్" (1991), "బేటా" (1992), "ఖల్నాయక్" (1993), "హం ఆప్కే హై కౌన్" (1994), "రాజా" (1995) వంటి మరిన్ని విజయవంతమైన సినిమాల్లో నటించారు. "బేటా"లో చదువురాని అమాయకుడైన భర్తకి భార్యగా, గయ్యాళి అత్తయ్యతో పోరాడే కోడలిగా పొషించిన పాత్రకి గాను ఆమె తన రెండవ ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు.

ఆమె నటించిన "హం ఆప్కే హై కౌన్!" భారత హిందీ సినీ చరిత్ర లోని గొప్ప విజయవంతమైన సినిమాల్లో ఒకటి. ఈ సినిమా భారత్ లో దాదాపు రూ.650 మిలియన్లు ఇంకా విదేశాల్లో సుమారు రూ.150 మిలియన్లు దాకా సంపాయించింది. దీక్షిత్ ఈ సినిమాకి గాను తన మూడవ పిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని కూడా పొందారు. ఇదే సంవత్సరంలో దీక్షిత్ "అంజాన్" అనే సినిమాలోని తన నటనకై విమర్శకులచే మంచి ప్రశంసలు అందుకున్నారు.

1996 అంత కలిసి రాకపోయినప్పటికీ, ఆమె 1997 లో మళ్లీ "దిల్ తో పాగల్ హై" అనే సినిమాలో పూజ అనే పాత్రలో నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని, ఆమె నటనకు ప్రశంసలను సాధించిపెట్టింది. ఈ సంవత్సరమే ఆమె మళ్ళీ తన నాలుగవ ఫిలింఫేర్ పురస్కారాన్ని కూడా దక్కించుకున్నారు. ఇదే సంవత్సరంలో ఆమె ప్రకాష్ ఝా నిర్దెశించిన "మృత్యుదండ్" అనే చిత్రంలో కూడా చేసారు. ఈ సినిమా బాంకాక్ ఫిల్మ్ ఫెస్టివల్, జెనీవా లోని "సినిమా టూత్ ఎక్రాన్"లలో ఉత్తమ చిత్రంగా ఎన్నికైంది. ఈ సినిమాకు గాను దీక్షిత్ స్టార్ స్క్రీన్ అవార్డ్స్ ఉత్తమ నటి పురస్కారాన్ని పొందారు.

దీక్షిత్ కేవలం నటనకే కాదు నాట్యకారిణిగా కూడా మంచి గుర్తింపు పొందారు. తన సినిమాల్లో ఆమె నాట్యం చేసిన పాటలు "ఏక్ దో తీన్" (తేజాబ్), "బడా దుఖ్ దీనా" (రాం లఖన్), "ధక్ ధక్" (బేటా), "చనే కె ఖేత్ మే" (అంజాన్), "చోళీ కే పీఛే క్యా హై" (ఖల్నాయక్), "అఖియాం మిలావూం" (రాజా), "పియా ఘర్ ఆయా" (యారానా), "కే సరా సరా" (పుకార్), "మార్ డాలా" (దేవదాస్) వంటివి ఆమెకు గొప్ప పేరును తెచ్చిపెట్టాయి. 2002 లో షారూఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్ లతో కలసి సంజయ్ లీలా భంసాలీ దర్శకత్వం వహించిన "దేవదాస్" చిత్రంలో నటించారు. ఇందులో అమె నటనకు మంచి స్పందన లభించడమే కాకుండా ఆమెకు ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి పురస్కారం కూడా వచ్చింది. ఈ సినిమాకు విదేశాల్లో కూడా మంచి గుర్తింపు వచ్చి ప్రతిష్ఠాత్మకమైన "కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్"లో కూడా ప్రదర్శితమైంది.

2003 లో ఆమె పేరు మీదగా "మై మాధురి దీక్షిత్ బన్నా చాహ్తీ హుం" అనే సినిమా విడుదల అయ్యింది. ఒక యువతి (యువతిగా అంత్ర మాలి నటించారు) తను మాధురి దీక్షిత్ అంత గొప్ప నటి అవ్వాలనే కోరికతో బాలివుడ్ లో పడే పాట్లు కథాంశంగా ఈ చిత్రం రూపొందింది.

ఫిబ్రవరి 25, 2006 న దీక్షిత్ 6 సంవత్సరాల తరువాత మళ్ళీ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ స్టేజి పై తన "దేవదాసు" సినిమాలోని పాటకి నాట్యం చేసారు. ఈ నృత్యానికి దర్శకత్వం సరోజ్ ఖాన్ వహించారు.

భారత దేశపు ప్రఖ్యాత చిత్రకారుడు ఎం. ఎఫ్. హుసేన్ ఇమె అభిమాని, ఆమెను ఒక గొప్ప మహిళగా అయన వర్ణించారు. 2000 లో మాధురి ముఖ్య పాత్రలో "గజ గామిని" అనే చిత్రాన్ని కూడా ఈయన నిర్దేశించారు. ఈ చిత్రాన్ని అయన అమెకే అంకితం చేసారు. "గజ గామిని"లో అమె వివిధ రకాలైన స్త్రీ పాత్రలు పొషించారు. వీటిలో కాళిదాసుకి ప్రేరణగా నిలిచిన వ్యక్తిగా, లియొనార్డో మోనాలీసా గా, ఒక తిరుగుబాటుదారిణిగా చేసినవి ప్రముఖమైనవి.

డిసెంబర్ 7, 2006 న దీక్షిత్ తన భర్త పిల్లలతో కలసి ముంబైకి "ఆజా నాచ్లే" అనే సినిమా షూటింగ్ కోసం తిరిగి వచ్చారు. నవంబరు 2007 లో విడుదలైన ఈ సినిమా విమర్శ మెప్పు పొందకపొయినా దీక్షిత్ నటనకి మంచి పేరునే తెచ్చింది.

2007లో జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా రిడిఫ్ దీక్షిత్ ను అత్యున్నత బాలివుడ్ నటీమణిగా గుర్తించింది.[1]

వక్తిగత జీవితం మార్చు

 
మాజి రాష్ట్రపతి ప్రతిభా దేవిసింగ్ పాటిల్ చేతులమీదుగా పద్మశ్రీ అవార్డును అందుకుంటున్నమాధురీ దీక్షిత్‌

1999లో దీక్షిత్ అమెరికాలో స్థిరపడిన భారతీయుడు వైద్యుడు అయిన శ్రీ రాం నెనెను పెళ్ళాడారు. ఈయన యు.సి.ఎల్.ఎ.లో శిక్షణ పొందిన కార్డియో వాస్క్యులర్ సర్జన్. నెనె డెన్వెర్ కు చెందిన మరాఠి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. దీక్షిత్ కు ఇద్దరు పిల్లలు, అరిన్ (జననం మార్చి 2003, కొలరాడొ), రాయన్ (జననం మార్చి 8, 2005, కొలరాడొ). ఈమెకు ఇద్దరు అక్కలు - రూప, భారతి - ఒక అన్నయ్య, అజిత్.మాధురి తన కుటుంబం కలసి డెన్వర్, కొలరాడొ, యు.ఎస్.ఎ.లో నివసిస్తున్నారు.

 
పద్మశ్రీపురస్కారం

పురస్కారాలు, ప్రతిపాదనలు మార్చు

ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు మార్చు

గెలిచినవి

  • 1990: ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం "దిల్" కు.
  • 1992: ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం "బేటా" కు.
  • 1994: ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం "హం ఆప్కే హై కౌన్!" కు.
  • 1997: ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం "దిల్ తొ పాగల్ హై" కు.
  • 2002: ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి పురస్కారం "దెవదాస్" కు.

నామినేట్ అయినవి

  • 1988: ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం "తేజాబ్" కు.
  • 1989: ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం "ప్రేం ప్రతిఙ" కు
  • 1991: ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం "సాజన్" కు
  • 1993: ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం "ఖల్నాయక్" కు
  • 1994: ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం "అంజాం" కు
  • 1995: ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం "రాజా" కు
  • 1995: ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం "యారానా"కు
  • 2000: ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం "పుకార్" కు
  • 2001: ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి పురస్కారం "లజ్జ" కు
  • 2008: ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం "ఆజా నచ్లే" కు

స్టార్ స్క్రీన్ అవార్డులు మార్చు

గెలిచినవి

  • 1994: స్టార్ స్క్రీన్ ఉత్తమ నటి పురస్కారం "హం ఆప్కే హై కౌన్" కు
  • 1995: స్టార్ స్క్రీన్ ఉత్తమ నటి పురస్కారం "రాజా" కు
  • 1997: స్టార్ స్క్రీన్ ఉత్తమ నటి పురస్కారం "మ్ర్యుత్యుదండ్" కు
  • 2002: స్టార్ స్క్రీన్ ఉత్తమ నటి పురస్కారం "దేవదాస్" కు

నామినేట్ అయినవి

  • 2000: స్టార్ స్క్రీన్ ఉత్తమ నటి పురస్కారం "పుకార్" కు

జీ సినీ అవార్డులు మార్చు

గెలిచినవి

  • 1998: జీ సినీ ఉత్తమ నటి పురస్కారం "దిల్ తొ పాగల్ హై" కు
  • 2002: జీ సినీ ఉత్తమ సహాయ నటి పురస్కారం "లజ్జ" కు

నామినేట్ అయినవి

  • 2000: జీ సినీ ఉత్తమ నటి పురస్కారం "పుకార్" కు
  • 2003: జీ సినీ ఉత్తమ నటి పురస్కారం "దేవదాస్" కు

ఐఫా అవార్డులు మార్చు

నామినేట్ అయినవి

  • 2000: ఐఫా ఉత్తమ నటి పురస్కారం "పుకార్" కు

స్టార్ డస్ట్ అవార్డులు మార్చు

నామినేట్ అయినవి

  • 2008: స్టార్ డస్ట్ "స్టార్ ఆఫ్ ద ఇయర్" ఉత్తమ నటి పురస్కారం "ఆజా నచ్లే" కు

సన్మానాలు మార్చు

  • 1997: "కళాభినేత్రి" - ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంచే
  • 2001: రాష్ట్రీయ పౌరుల పురస్కారం. (నేషనల్ సిటిజన్స్ అవార్డ్)
  • 2001: ఫోర్బ్స్ అనే మగజైన్ మాధురిని "టాప్ ఫైవ్ మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్ మూవీ స్టార్స్"లో ఒకరిగా గుర్తించింది.[2][3]
  • 2007: "బాలివుడ్ లోని అత్యున్నతమైన నటీమణి"
  • 2008: "పద్మ శ్రీ" (నాల్గవ అత్యున్నత పౌరసత్కారం) - భారత ప్రభుత్వం చే.
  • 2008: IFFLA ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సన్మానం.

ఫిల్మోగ్రఫీ మార్చు

సంవత్సరం సినిమా పాత్ర ఇతరములు
1984 అబోద్ గౌరీ ఖాన్
(1985) ఆవారా బాపి
1986 స్వాతి
1987 మొహరే
హిఫాజాత్ జానకి
ఉత్తర దక్షిణ
1988 ఖత్రో కే ఖిలాడి కవిత
దయావాన్ నీలా వెల్హు
తేజాబ్ మోహిని ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటి అవార్డుకి నామినేట్ అయింది.
1989 వర్డి జయ
రాం లఖన్ రాధ
ప్రేఅం ప్రతిగ్యా లక్ష్మి ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటి అవార్డుకి నామినేట్ అయింది.
ఇలాకా విద్య
ముజ్రిం సోనియా
త్రిదేవ్ దివ్య మాథుర్
కానూన్ అప్నా అప్నా భారతి
పరిందా పారో ఒస్కార్స్ కు భారత యొక్క అధికార ప్రవేశం
పాప్ కా అంత్
బూస్ట్: ౧౯౯౦ - ప్రస్తుత కాలం మహా సంగ్రామం
కిషన్ కన్హైయ్యా అంజు
ఇజత్దార్ మోహిని
దిల్ మధు మెహ్రా ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం
దీవాన ముజ్సా నహి అనిత
జీవన్ ఎక్ సంఘర్ష్ మధు సేన్
సైలాబ్ డా. సుష్మ
జమై రాజా రేఖా
థానెదార్ చందా
1991 Pyaar Ka Devata Devi
Khilaaf Sweta
100 డేస్ దేవి
ప్రతీకార్ మధు
సాజన్ పూజ ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటి అవార్డుకి నామినేట్ అయింది.
ప్రహార్ షిర్లీ
1992 బేటా సరస్వతి ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం
జిందగి ఎక్ జువా జుహీ
ప్రేం దీవానే శివాంగి మెహ్రా
ఖేల్ సీమా/డా. జడి బూటి
సంగీత్
1993 ధారావి డ్రీం గర్ల్
సాహిబాన్ సాహిబాన్
ఖల్నాయక్ గంగా (గంగోత్రి దేవి) ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటి అవార్డుకి నామినేట్ అయింది.
ఫూల్
దిల్ తేరా ఆశిక్ సోనియా ఖన్నా/సావిత్రి దేవి
ఆంసూ బానే అంగారే
1994 అంజాం శివాని చోప్రా ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటి అవార్డుకి నామినేట్ అయింది.
హం ఆప్కే హై కౌన్! నిషా చౌదరి ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం
1995 రాజా మధు గరేవాల్ ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటి అవార్డుకి నామినేట్ అయింది.
యారాన లలితా/శిఖా ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటి అవార్డుకి నామినేట్ అయింది.
1996 ప్రేం గ్రంథ్ కజ్రి
పాపి దేవత
రాజ్ కుమార్
1997 కోయల గౌరీ
మహాంత జెన్నీ పింటో
మ్రిత్యుదండ్ ఫూల్వ ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటి అవార్డుకి నామినేట్ అయింది.
మొహబ్బత్ (1997 సినిమా) శ్వేత శర్మ
దిల్ తో పాగల్ హై పూజ ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం
1998 బడే మియా చోటే మియా మాధురి దీక్షిత్ ప్రత్యేక పాత్ర
వజూద్ అపూర్వ చౌదరి
1999 ఆర్జూ పూజ
2000 పుకార్ అంజలి ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటి అవార్డుకి నామినేట్ అయింది.
గజ గామిని గజ గామిని/సంగిత/శకుంతల/మోనికా/మొన లిసా
2001 యెహ్ రాస్తే హై ప్యార్ కే నేహ
లజ్జా జానకి ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి నామినషన్
2002 హమ్ తుమ్హారే హైన్ సనం రాధా
దేవదాస్ చంద్రముఖి ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి పురస్కారం, ఆస్కార్ కు భారత్ తఫున అధికారింగా ఎన్నికైనది
2007 ఆజా నచ్లే దియా ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటి అవార్డుకి నామినేట్ అయింది.

సంబంధాలు /రేఫెరెంసుస్ మార్చు

  1. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Women’s Day Article అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. http://www.forbes.com/2001/03/09/0309bollywood.html
  3. "geocities.com/bigbachchan2/amitforbes.html". Archived from the original on 2004-07-23. Retrieved 2004-07-23.

బాహ్య లింకులు మార్చు