కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి

కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి, తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ పట్టణంలో కేబుల్ బ్రిడ్జి (తీగల వంతెన). లోయర్ మానేర్ డ్యామ్ దిగువన మానేరు నదిపై నిర్మించిన అత్యాధునిక, అత్యధిక శక్తివంతమైన కేబుల్ బ్రిడ్జి ఇది. కరీంనగర్ పట్టణ అభివృద్ధిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన ఈ కేబుల్ బ్రిడ్జి, ఔట్‌స్టాండింగ్‌ కాంక్రీట్‌ స్ట్రక్చర్‌-2021 విభాగంలో జాతీయస్థాయిలో అవార్డు దక్కించుకుంది.[1]

కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి
Karimnagar Cable Bridge.jpg
కరీంనగర్ వద్ద మానేరు నదిపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి
అధికార నామంకరీంనగర్ కేబుల్ బ్రిడ్జి
దేశంభారతదేశం
ప్రదేశంకరీంనగర్, తెలంగాణ
స్థితిప్రారంభానికి సిద్ధం
నిర్మాణం ప్రారంభం2020
ప్రారంభ తేదీ1922
ఆనకట్ట - స్రావణ మార్గాలు
ఆనకట్ట రకంBarrage
నిర్మించిన జలవనరుమానేరు నది
పొడవు680 మీ. (2,231 అ.)

నిర్మాణంసవరించు

క‌రీంన‌గ‌ర్ పట్టణం నుండి వరంగల్, హైద‌రాబాద్ వైపు వెళ్ళే వాహనాలన్ని అలుగునూర్ బ్రిడ్జిపై నుండి వెళ్ళాల్సి వస్తుండడంతో తరచు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.[2] ట్రాఫిక్ సమస్య పరిష్కారంకోసం 183 కోట్ల రూపాయల వ్య‌యంతో, 680 మీట‌ర్ల పొడవుతో ఈ వంతెన నిర్మించబడింది. కరీంనగర్‌ కమాన్‌ నుంచి హౌసింగ్‌ బోర్డు మీదుగా మానేరు నది దాటిన తరువాత మానకొండూరు నియోజకవర్గం పరిధిలోని సదాశివపల్లి నుంచి వరంగల్‌ హైవేకు లింక్‌ అవుతుంది. దీనిద్వారా వరంగల్‌కు ఏడు కిలోమీటర్ల దూరం కూడా తగ్గుతుంది.[3]

విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో పర్యాటకులను ఆకర్షించే విధంగా నిర్మించబడిన ఈ కేబుల్ బ్రిడ్జి వల్ల మానేరు నదిలో పడవ ప్రయాణానికి ఎలాంటి ఆటంకం కలగకుండా రెండు వైపులా 220 మీటర్ల ఎత్తులో పైలాన్లు నిర్మించి, 136 సెగ్మెంట్లతో ఆ పైలాన్లను అనుసంధానించారు.[4]

ప్రయోగంసవరించు

ఈ బ్రిడ్జి సామర్థ్యాన్ని పరీక్షించేందుకు రోడ్డు, భవనాల అధికారుల సమక్షంలో 2021 జూన్ 25 నుండి 29వ తేదీ వరకు లోడ్ టెస్టింగ్ జరిగింది. ఐదు రోజుల పాటు వివిధ దశల్లో వంతెన సామర్థ్యాన్ని పరీక్షించారు. పరీక్ష ప్రక్రియల్లో భాగంగా 25, 26 తేదీల్లో బ్రిడ్జి మెయిన్ స్పాన్‌పై మొత్తం 950 టన్నుల బరువును (బ్రిడ్జిపై 28 టిప్పర్లను ఒక్కొక్కటి 30 టన్నుల ఇసుక బస్తాలతో నింపారు. 28 ఇసుక టిప్పర్ల బరువు 840 టన్నులు) ఉంచారు. ఇదే కాకుండా, వంతెనకు ఇరువైపులా అభివృద్ధి చేసిన ఫుట్‌పాత్‌లపై 110 టన్నుల సామర్థ్యం గల ఇసుక బస్తాలను (ఒక్కోవైపు 55 టన్నులు) కూడా ఉంచారు. బ్రిడ్జి కింద 7 చోట్ల సెన్సార్లు ఏర్పాటు చేసి ప్రతి గంటకొకసారి అధికారులు పరీక్షించారు.[5] 29, 29 తేదీల్లో 20 వాహనాల్లో ఇసుకను నింపి, ఫుట్‌పాత్‌లపై ఇసుక బస్తాలు పెట్టి వంతెన సామర్థ్యాన్ని అంచనా వేశారు.[3]

మూలాలుసవరించు

  1. telugu, NT News (2022-03-27). "కరీంనగర్‌ కేబుల్‌ బ్రిడ్జికి జాతీయ అవార్డు". Namasthe Telangana. Archived from the original on 2022-03-27. Retrieved 2022-03-28.
  2. sumabala (2021-06-29). "కరీంనగర్ సిగలో తీగలమణిహారం... తుది దశకు కేబుల్ బ్రిడ్జీ పనులు...(వీడియో)". Asianet News Network Pvt Ltd. Archived from the original on 2021-06-29. Retrieved 2022-03-28.
  3. 3.0 3.1 "కరీంనగర్‌ సిగలో మరో తీగల మణిహారం, కేబుల్‌ బ్రిడ్జికి సర్వం సిద్ధం". Sakshi. 2021-06-30. Archived from the original on 2021-06-30. Retrieved 2022-03-28.
  4. "Karimnagar Cable Bridge: కేబుల్ బ్రిడ్జ్.. కరీంనగర్ కే తలమానికం". ETV Bharat News. 2022-01-11. Archived from the original on 2022-03-28. Retrieved 2022-03-28.
  5. Telanganatoday (2021-06-27). "Karimnagar cable bridge undergoing load tests". Telangana Today. Archived from the original on 2021-07-02. Retrieved 2022-03-28.