మాయాబజార్ (2006 సినిమా)

2006 సినిమా


మాయాబజార్
(2006 తెలుగు సినిమా)

myth, money, magic [1]
దర్శకత్వం ఇంద్రగంటి మోహనకృష్ణ
నిర్మాణం బి.సత్యనారాయణ, రాజకిషోర్ ఖవారె
రచన ఇంద్రగంటి మోహనకృష్ణ
కథ జయకుమార్
చిత్రానువాదం ఇంద్రగంటి మోహనకృష్ణ
తారాగణం రాజా,
భూమిక,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
తనికెళ్ళ భరణి,
ధర్మవరపు సుబ్రహ్మణ్యం,
ఆలీ,
ఎల్.బి.శ్రీరాం,
దువ్వాసి మోహన్,
గుండు సుదర్శన్,
రాజా శ్రీధర్,
ఉత్తేజ్,
జయలలిత,
బెంగుళూరు పద్మ
సంగీతం కె.ఎమ్.రాధాకృష్ణ
ఛాయాగ్రహణం జవహర్ రెడ్డి
కూర్పు నాగిరెడ్డి
నిర్మాణ సంస్థ సత్యం ఎంటర్‌టైన్‌మెంట్
విడుదల తేదీ 1 డిసెంబరు 2006
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కథాగమనం

మార్చు
 
మాయాబజార్ సినిమాలో ఒక సన్నివేశము
 
మాయాబజార్ సినిమాలో ఒక సన్నివేశము
 
మాయాబజార్ సినిమాలో ఒక సన్నివేశము
 
మాయాబజార్ సినిమాలో ఒక సన్నివేశము
మూల కథ.

తనను అవమానపరచాడనే కోపంతో ఒక ఋషి కుబేరుని(ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)శపిస్తాడు. దాంతో అక్రమంగా అన్యాయంగా మానవులు సంపాదించే సంపద నుండి తిరుమల వెంకటేశ్వరునికి కానుకలు వేసే సొమ్మును కుబేరుడు ప్రతి శనివారం వడ్డీ రూపంలో మోసుకు పోతుంటాడు. ఆ పాపపు సొమ్మును మోస్తూ ఎంతో బాధ పడుతుంటాడు. తనకు శాప విమోచనం కలగాలంటే ఏమిచేయాలని అడిగిన కుబేరునకు- మానవులలో అత్యంత ఉత్తముడైన వాడికి సహాయం చేసి అతడు చనిపోయేవరకూ సేవ చేయాలని చెపుతాడు ఋషి.

అసలు కథ.

శ్రీనివాస్ (రాజా) కుటుంబం వ్యవసాయం చేస్తూ పంటలు పండక పేదరికంతో విషం తాగి చనిపోతుంది. వాళ్ళలో కేవలం రాజా మాత్రం బ్రతుకుతాడు. తరువాత ఎలాగైనా డబ్బు సంపాదించి సాధ్యమైనంతమంది పేదలను ఆదుకోవాలనుకుంటాడు. చదువుకొన్నా ఉద్యోగం దొరకక తన స్నేహితుడు భాస్కర్ (అలీ)తో కలసి చిన్న అద్దె ఇంట్లో ఉంటూ భరణి దగ్గర డ్రైవరుగా చేరుతాడు. ఒకసారి విమానాశ్రయానికి వెళ్ళిన శ్రీనివాసుకు సిరి అనే అమ్మాయి కనిపిస్తుంది. ఆపాపకు గుండెకు సంబంధించిన సమస్య ఉండటంతో ఆమెను తండ్రి అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు. శ్రీనివాస్ పాపను ఇంటికి తీసుకొచ్చి డాక్టర్ వద్దకు తీసుకెళితే మూడు లక్షలు కావాలంటాడు పాప ఆపరేషన్ కొరకు. శ్రీనివాస్ తనకు తెలిసిన ప్రతి వారినీ అడుగుతాడు కాని ప్రయోజనం ఉండదు. సిరి ఆఖరి కోరికగా ఆలీతో కలసి తిరుపతి వెళతాడు. వాళ్ళిద్దరినీ దర్శనానికి పంపి తను మాత్రం అంత చిన్న పిల్లకు చావును రాశాడనే కోపంతో బయటే ఉండిపోయి పేదల కష్టాలు పట్టించుకోకుండా కోట్ల సొమ్ముతో హుండీ నింపుకొని కుబేరుడి అప్పు తీరుస్తున్నాడని విమర్శిస్తాడు. అప్పుడు అక్కడికొచ్చిన కుబేరుడు కొన్ని షరతులతో శ్రీనివాసుకు ఐదు లక్షలిస్తాడు. వాటితో సిరికి ఆపరేషన్ చేయించి మిగతా సొమ్ముతో సిరి పేరున వ్యాపారం ప్రారంభిస్తాడు. అతనికి అప్పుడప్పుడూ అనుపమ (భూమిక) అనే అమ్మాయి కనిపిస్తుంటుంది ఆమె ప్రవర్తన విచిత్రంగా అనిపిస్తుంటుంది. అతనెక్కడికెళ్ళినా అతడిని అనుసరిస్తుంటుంది ఆమె. శ్రీనివాస్ కొద్దికాలంలోనే కోటీశ్వరుడిగా పెరిగిపోతాడు. అనుపమ తెలివితేటలు నచ్చి తన సెక్రటరీగా ఎన్నుకొంటాడు. పలు సేవా సంస్థలు స్థాపించి తన సంపాదనలో సగం వాటికే ఖర్చు చేస్తుంటాడు. ఆసమయంలో సిరి తండ్రి ఒక సంఘటనలో శ్రీనివాసును రక్షించి అతనికి చేరువౌతాడు. అతడు శ్రీనివాస్ ఆస్తి కొట్టేయాలని ప్లాన్ చేసి పేదలకు పంచే ఆహారంలో విషం కలిపి వారి చావుకు కారణం శ్రీనివాసే అనుకొనేలా చేస్తాడు. కానీ అనుపమ తెలివిగా అతడిని బయటపెట్టి పోలీసులకు పట్టిస్తుంది. ఈ సమయంలో కుబేరుడు వచ్చి నే చేసిన సాయానికి నీ ప్రాణం కావాలంటాడు. దానికి వారం రోజులు గడువు అడుగుతాడు శ్రీనివాస్. వారంలో తను చనిపోతున్నానని అనుపమకి చెపుతాడు శ్రీనివాస్. విషయం తెలిసికూడా తనను పెళ్ళి చేసుకోమని కోరుతుంది ఆమె. పెళ్ళి జరిగే సమయానికి ప్రాణం కొరకు వస్తాడు కుబేరుడు మారు వేషంలో. వధువుకు తల్లీ తండ్రీ లేకపోవుటచేత వేరే ఒక ఆమెను, కుబేరుని కలిసి కన్యాదానం చేయమంటాడు భరణి కుబేరునితో. అలాగేనని కన్యాదానం చేస్తాడు కుబేరుడు. పెళ్ళి పూర్తయిన తరువాత తెలుస్తుంది అనుపమ మరెవరో కాదు తన కుమార్తే అని. నారదుని నాటకము వలన ఇదంతా జరిగినదని తెలుస్తుంది. కుమార్తెను కన్యాదానము చేసి అల్లుడి ప్రాణము తీసుకెళ్ళుట మాట అటుంచి అతనికి కట్నముగా తను ప్రతి శనివారము వెంకటేశ్వరుని వద్దనుండి తీసుకెళ్ళే పాపపు సొమ్మును అల్లుడి కోరికగా పేదలకు పంచవలసి వస్తుంది. దానితో అతనిపై ముని యొక్క శాపప్రభావము తొలగిపోతుంది. కూతురిని అల్లుడితో విడిచి తన కార్యనిర్వహణకై తిరిగి పోతాడు కుబేరుడు.

చిత్ర విశేషాలు

మార్చు

గ్రహణంలాంటి జాతీయ ఉత్తమ చిత్రమునందించిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వ ప్రతిభ మరోసారి ఈ చిత్రంలో కనిపిస్తుంది. కేవలం కళాత్మక చిత్రాలే కాక కమర్షియల్ చిత్రాలు సైతం తాను అందించగలనని నిరూపించుకొన్నాడు. చిత్రం చివరి వరకూ మంచి బిగువుతో చిత్రమైన మలుపులతో నడుస్తుంది.

నటనా విషయాలు

మార్చు

కుబేరునిగా బాలు నటన సహజరీతిలో ఉంది. పాత్ర చిత్రణలో కొన్ని సన్నివేశములలో దయనూ మరికొన్ని సన్నివేశములలో కౄరత్వమునూ అత్యంత అద్భుతముగా ప్రదర్శించాడు బాలు.