బెంగుళూరు పద్మ
బెంగుళూరు పద్మ రంగస్థల, చలనచిత్ర నటి, నృత్యకారిణి.[1] అనేక సినిమా లలో సహాయ నటిగా నటించింది.
బెంగుళూరు పద్మ | |
---|---|
జననం | పద్మ |
వృత్తి | రంగస్థల, చలనచిత్ర నటి, నృత్యకారిణి |
క్రియాశీల సంవత్సరాలు | 1977 – ప్రస్తుతం |
బంధువులు | అరుణ్ కుమార్ (భర్త), అప్పలస్వామి (తండ్రి), సుశీలా రాణి (తల్లి), శ్రీనివాస్ ప్రసాద్ (కుమారుడు), గాయత్రీరావు (కూతురు) |
జననం - విద్యాభ్యాసం
మార్చుఈవిడ అప్పలస్వామి, సుశీలా రాణి దంపతులకు కృష్ణా జిల్లా, విజయవాడ లో జన్మించింది. తండ్రి రైల్వే ఉద్యోగి అవడంతో బదిలీపై హైదరాబాద్ కి వచ్చారు. హైదరాబాద్ లోనే పద్మ బాల్యం గడిచింది. ఎం.ఎ (హిస్టరీ) చదివింది.
వివాహం
మార్చురచయిత, నటుడైన అరుణ్ కుమార్ తో పద్మ వివాహం జరిగింది. వీరికి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అబ్మాయి శ్రీనివాస్ ప్రసాద్, అమ్మాయి గాయత్రీరావు[2] లు కూడా నటులే. గాయత్రీరావు హ్యాపీ డేస్,[3] ఆరెంజ్[4], గబ్బర్ సింగ్, ఏకలవ్య వంటి సినిమాలలో నటించింది.
సినీరంగ ప్రస్థానం
మార్చునాలుగు సంవత్సరాల వయసులోనే సినీరంగంలోకి ప్రవేశించి, ఆలుమగలు చిత్రంలో అల్లు రామలింగయ్య పిల్లల్లో ఓ కూతురిగా నటించింది. ఆతర్వాత బొమ్మరిల్లు అనే చిత్రంలో బాలనటిగా నటించింది. చిరంజీవి నటించిన స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ చిత్రంలో చరణ్‌రాజ్ కి సహాయనటిగా చేసింది. అలా 150పైగా చిత్రాల్లో నటించింది.
నటించిన చిత్రాల జాబితా
మార్చు- 2008: హోమం
- 2007: హ్యాపీ డేస్
- 2007: మధుమాసం
- 2006: మాయాబజార్
- 2004: నేనుసైతం
- 2003: మిస్సమ్మ
- 2003: దొంగరాముడు అండ్ పార్టీ
- 2002: ఆది
- 1997: ప్రేమించుకుందాం రా
- 1991: కూలీ నెం.1
- 1977: ఆలు మగలు
టీవిరంగం
మార్చుటెలివిజన్ రంగంలో అనేక ధారావాహికల్లో నటించింది.
- అన్వేషిత (ఈటీవీ)
- గీతాంజలి (ఈటీవీ)
- శ్రావణమేఘాలు (ఈటీవీ)
- అభిషేకం (ఈటీవీ)
పురస్కారాలు
మార్చు- 2023: ఉత్తమ నటి విభాగంలో తెలుగు విశ్వవిద్యాలయం - కీర్తి పురస్కారం (2021)[5]
మూలాలు
మార్చు- ↑ టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్స బ్లాగ్. "బెంగుళూరు పద్మ,Bangalore Padma". tollywoodphotoprofiles.blogspot.in. Archived from the original on 19 మార్చి 2017. Retrieved 21 May 2017.
- ↑ టాలీవుడ్ టైమ్స్. "GAYATRI RAO". www.tollywoodtimes.com. Retrieved 21 May 2017.[permanent dead link]
- ↑ తెలుగు ఫిల్మీబీట్. ""సంక్రాంతి దాకా హవా నడుస్తుంది"". www.telugu.filmibeat.com. Retrieved 21 May 2017.
- ↑ విశాలాంధ్ర. "ఆరెంజ్". Retrieved 21 May 2017.[permanent dead link]
- ↑ "తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల ప్రదానం". EENADU. 2023-09-13. Archived from the original on 2023-09-13. Retrieved 2023-09-13.