మారేమండ
ఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా గ్రామం
మారేమండ గ్రామం కృష్ణా జిల్లా లోని విస్సన్నపేట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
మారేమండ | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | విస్సన్నపేట |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్రీమతి చాట్ల సావిత్రి |
పిన్ కోడ్ | 521215 |
ఎస్.టి.డి కోడ్ | 08598 |
గ్రామం పేరు వెనుక చరిత్ర
మార్చు"మారేమండ" అనగా "మారెమ్మతల్లి స్థలం" అని అర్థం. ఈ ప్రాంత దైవం మారమ్మతల్లి.
గ్రామ భౌగోళికం
మార్చుఇది సముద్రమట్టానికి 73 మీ.ఎత్తులో ఉంది.
విస్సన్నపేట గ్రామానికి 4 కి.మీ దూరంలో ఉంది.
సమీప గ్రామాలు
మార్చుగ్రామ విశేషాలు
మార్చు- ఈ గ్రామ సమీపంలో వేప చెట్టు ఉంది. దీని వయస్సు 150 సంవత్సరాలు ఉంటుంది. [ఆధారం చూపాలి].
- విస్సన్నపేటలోని ఇండేన్ గ్యాస్ కంపెనీవారు దత్తత తీసుకున్న విస్సన్నపేట మండలంలోని రెండు గ్రామాలలో ఇది ఒకటి. ఆ కంపెనీవారు ఈ గ్రామస్తులందరికీ గ్యాస్ కనెక్షన్ పంపిణీ చేసారు. అందువలన అధికారులు ఈ గ్రామానికి, 2016, ఫిబ్రవరి-1వ తేదీనాడు, పొగరహిత గ్రామంగా ధ్రువీకరణ పత్రం అందజేసినారు. ఈ గ్రామంలో మొత్తం 232 కుటుంబాలు ఉండగా, 46 గృహాలకు ఇదివరకే గ్యాస్ కనెక్షన్ ఉంది. ఇప్పుడు మిగతా 186 మందికి గూడా, "దీపం" పథకం క్రింద గ్యాస్ కనెక్షన్ పంపిణీ చేయడంతో గ్రామం పొగరహిత గ్రామంగా గుర్తించబడింది.
గ్రామానికి రవాణా సౌకర్యాలు
మార్చువిస్సన్నపేట, పుట్రేల నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 56 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలు
మార్చుజిల్లాపరిషత్ హైస్కూల్, వేమిరెడ్డిపల్లి శ్రీ ప్రజ్నహైస్కూల్, విస్సన్నపేట
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం
మార్చుపెద్ద చెరువు.
గ్రామ పంచాయతీ
మార్చు- ఈ గ్రామం 2001 వరకూ తాతకుంట్ల గ్రామ పంచాయతీ పరిధిలో అనుబంధ గ్రామంగా ఉండేది, 2001 లో ప్రత్యేక పంచాయతీగా ఆవిర్భవించింది. 2001లో ప్రథమంగా ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో గ్రామస్థులు సర్పంచిగా వడిత్యా భద్రుని ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఈ గ్రామం అతని హయాంలో నిర్మల్ పురస్కారానికి ఎన్నికైంది.
- 2006 లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో గ్రామస్థులు చాపలమడుగు దేవసహాయాన్ని సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇతని హయాంలో మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం నుండి ఉత్తమ సర్పంచిగా పురస్కారం గ్రహించారు.
- 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో చాట్ల సావిత్రి సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైంది
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుఈ గ్రామంలో ప్రసిద్ధ రామాలయం ఉంది. ఈ గ్రామ ప్రజలు ప్రతి సంవత్సరం ఉత్సవాలను జరుపుకుంటారు.
గ్రామంలో ప్రధాన పంటలు
మార్చుగ్రామంలో ప్రధాన వృత్తులు
మార్చుఈ గ్రామ ప్రజల్లో అనేక మంది వ్యవసాయదారులు.