మార్టినా నవ్రతిలోవా

1956, అక్టోబర్ 18న ప్రేగ్లో జన్మించిన మార్టినా నవ్రతిలోవా (Martina Navratilova) ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి. టెన్నిస్ రచయిత స్టీవ్ ఫ్లింక్ తన గ్రంథం The Greatest Tennis Matches of the Twentieth Century లో నవ్రతిలోవాను స్టెఫీగ్రాఫ్ తరువాత మహిళా టెనిస్ క్రీడాకారిణులలో 20 వ శతాబ్దపు రెండో ఉత్తమ క్రీడాకారిణిగా పేర్కొన్నాడు.[1] మార్టినా నవ్రతిలోవా తన క్రీడా జీవితంలో 18 గ్రాండ్‌స్లాం సింగిల్స్ టైటిళ్ళను, 31 గ్రాండ్‌స్లాం డబుల్స్ టైటిళ్ళను, 10 గ్రాండ్‌స్లాం మిక్స్‌డ్ డబుల్స్ టైటిళ్ళను గెలిచింది. వింబుల్డన్ సింగిల్స్ ఫైనల్లో 12 సార్లు ప్రవేశించింది. 1982 నుంచి 1990 వరకు వరుసగా 9 సార్లు వింబుల్డన్ ఫైనల్లో ప్రవేశించడం విశేషం. మొత్తంపై 9 సార్లు వింబుల్డన్ టైటిల్‌ను గెలిచి అత్యధిక వింబుల్డన్ టైటిళ్ళను గెలుపొందిన మహిళా క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. రికార్డు స్థాయిలో 31 డబుల్స్ గ్రాండ్‌స్లాం టైటిళ్ళను గెలవడమే కాకుండా బిల్లీ జీన్ కింగ్‌తో కలిసి 20 సార్లు వింబుల్డన్ గెలుపొంది రికార్డు సాధించింది. వరుసగా 11 సార్లు గ్రాండ్‌స్లాం టోర్నమెంట్ ఫైనల్లో ప్రవేశించి 13 సార్లు ఈ ఘనత వహించిన స్టెఫీగ్రాఫ్ తరువాత రెండో స్థానంలో ఉంది.

మార్టినా నవ్రతిలోవా
Martina Navrátilová
దేశంమూస:TCH (1956–1975)
 United States
(1975–present)
నివాసంఫ్లోరిడా, USA
జననం (1956-10-18) 1956 అక్టోబరు 18 (వయసు 68)
ప్రాగ్, చెకోస్లోవేకియా
ఎత్తు1.73 మీ. (5 అ. 8 అం.)
ప్రారంభం1975
విశ్రాంతి1994–1999, 2006
ఆడే విధానంఎడమ చేతి; ఒక చేతి బ్యాక్ హ్యాండ్
బహుమతి సొమ్ముUS$21,626,089
(6th in all-time rankings)
Int. Tennis HOF2000 (member page)
సింగిల్స్
సాధించిన రికార్డులు1,442–219 (86.8%)
సాధించిన విజయాలు167 WTA, 1 ITF (Open era record)
అత్యుత్తమ స్థానముNo. 1 (July 10, 1978)
గ్రాండ్ స్లామ్ సింగిల్స్ ఫలితాలు
ఆస్ట్రేలియన్ ఓపెన్W (1981, 1983, 1985)
ఫ్రెంచ్ ఓపెన్W (1982, 1984)
వింబుల్డన్W (1978, 1979, 1982, 1983, 1984, 1985, 1986, 1987, 1990)
యుఎస్ ఓపెన్W (1983, 1984, 1986, 1987)
Other tournaments
ChampionshipsW (1978, 1979, 1981, 1983, 1984, 1985, 1986 (1), 1986 (2))
డబుల్స్
Career record747–143 (83.9%)
Career titles177 WTA, 9 ITF (Open era record)
Highest rankingNo. 1 (September 10, 1984)
గ్రాండ్ స్లామ్ డబుల్స్ ఫలితాలు
ఆస్ట్రేలియన్ ఓపెన్W (1980, 1982, 1983, 1984, 1985, 1987, 1988, 1989)
ఫ్రెంచ్ ఓపెన్W (1975, 1982, 1984, 1985, 1986, 1987, 1988)
వింబుల్డన్W (1976, 1979, 1981, 1982, 1983, 1984, 1986)
యుఎస్ ఓపెన్W (1977, 1978, 1980, 1983, 1984, 1986, 1987, 1989, 1990)
Other Doubles tournaments
ChampionshipsW (1980, 1981, 1982, 1983, 1984, 1985, 1986(2), 1987, 1988, 1989, 1991)(all-time record)
Mixed Doubles
Career titles15
Grand Slam Mixed Doubles results
ఆస్ట్రేలియన్ ఓపెన్W (2003)
ఫ్రెంచ్ ఓపెన్W (1974, 1985)
వింబుల్డన్W (1985, 1993, 1995, 2003)
యుఎస్ ఓపెన్W (1985, 1987, 2006)
మార్టినా నవ్రతిలోవా

ప్రారంభ జీవితం

మార్చు

1956, అక్టోబర్ 18న చెకొస్లోవేకియా లోని ప్రేగ్ నగరంలో జన్మించింది. ఆమెకు 3 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. 1962లో ఆమె తల్లి మిరొస్లావ్ నవ్రతిల్‌ను వివాహం చేసుకుంది. అతడే మార్టినాకు తొలి టెన్నిస్ గురువు. 1972లో మార్టినా 15 సంవత్సరాల వయస్సులోనే చెకొస్లోవేకియా జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌ను సాధించింది. 1974లో తొలిసారిగా ప్రొఫెషనల్ సింగిల్స్ టైటిల్‌ను సాధించింది.

గ్రాండ్‌స్లామ్ ఫలితాలు

మార్చు
  • 1973: 1973లో తొలిసారిగా గ్రాండ్‌స్లాంలో ప్రవేశించిన మార్టినా ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్స్ వరకు చేరుకుంది. వింబుల్డన్‌లో 3వ రౌండ్ వరకు చేరుకోగా, అమెరికన్ ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది.
  • 1974: 1974లో కూడా ప్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్ళగలిగింది. వింబుల్డన్‌లో తొలిరౌండ్ లోనే నిష్రమించగా, అమెరికన్ ఓపెన్‌లో మూడో రౌండ్ వరకు వెళ్లింది.
  • 1975: ఈ ఏడాది తొలిసారిగా రెండు గ్రాండ్‌స్లాం ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ ఓపెన్‌లలో ఫైనల్స్ వరకు ప్రవేశించగా, వింబుల్డన్‌లో క్వార్టర్ ఫైనల్స్ వరకు చేరింది. అమెరికన్ ఓపెన్‌లో సెమీఫైనల్స్ వరకు ఆడింది.
  • 1976: 1976లో ఆమె ఆతతీరు ఆశాజనకంగా లేదు. వింబుల్డన్‌లో సెమీస్ వరకు వెళ్ళగలిగింది. అమెరికన్ ఓపెన్‌లో మాత్రం తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది.
  • 1977: ఈ ఏడాది వింబుల్డన్‌లో క్వార్టర్ ఫైనల్స్ వరకు, అమెరికన్ ఓపెన్‌లో సెమీఫైనల్స్ వరకు వెళ్ళింది.
  • 1978: 1978లో నవ్రతిలోవా తొలిసారిగ గ్రాండ్‌స్లాం టైటిల్‌ను గెలుపొందింది. వింబుల్డన్ సింగిల్స్‌ను తన ఖాతాలో జమచేసుకుంది. ఆ తరువాత జరిగిన అమెరికన్ ఓపెన్‌లో సెమీస్ వరకు ప్రవేశించింది.
  • 1979: 1979లో కూడా క్రితం సంవత్సరపు ఫలితాలనే పునరావృత్తం చేసింది. వింబుల్డన్ సింగిల్స్‌ను మళ్ళీ గెలువగా, అమెరికన్ ఓపెన్‌లో కూడా సెమీస్ వరకు వెళ్ళగలిగింది.
  • 1980: 1980లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో, వింబుల్డన్‌లో సెమీఫైనల్స్ వరకు చేరింది. అమెరిక ఓపెన్‌లో నాల్గవ రౌండ్‌లో నిస్క్రమించింది.
  • 1981: ఈ ఏడాది తొలిసారిగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌ టైటిల్‌ను గెలిచింది. ఆ తరువాత జరిగిన ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ వరకు ప్రవేశించింది. వింబుల్డన్‌లో సెమీస్ వరకు వెళ్ళగా, అమెరికన్ ఓపెన్‌లో ఫైనల్ వరకు ప్రవేశించింది.
  • 1982: 1982లో మూడు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో ప్రవేశించి రెండిటిలో విజయం సాధించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్రిస్ ఎవర్ట్ చేతిలో ఓడిపోగా, వింబుల్డన్‌లో క్రిస్ ఎవర్ట్ పైనే విజయం సాధించి టైటిల్ గెలిచింది. ఫ్రెంచ్ ఓపెన్ తైటిల్‌ను కూడా గెలువగా, అమెరికన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్స్ వరకు వెళ్ళగలిగింది.
  • 1983: ఈ ఏడాది 3 గ్రాండ్‌స్లాం టైటిళ్ళను సాధించింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో మాత్రం నాలుగవ రౌండ్‌లో నిస్క్రమించింది.
  • 1984: 1984లో కూడా 3 గ్రాండ్‌స్లాం సింగిల్స్ టైటిళ్ళను సాధించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీస్ వరకు మాత్రమే చేరగలిగింది. సాధించిన మూడు టైటిళ్ళను కూడా ఫైనల్లో క్రిస్ ఎవర్ట్ పైనే గెలవడం విశేషం.
  • 1985: ఈ ఏడాది తొలిసారిగా 4 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. అందులో రెండింటిలో టైటిల్ సాధించింది. వింబుల్డన్, ఆస్ట్రేలియన్ ఓపెన్‌లలో క్రిస్ ఎవర్ట్ పైనే గెలిచి టైటిల్ సాధించగా, ఫ్రెంచ్ ఓపెన్‌లో క్రిస్ ఎవర్ట్ చేతిలో పరాజయం పాలైనది. అమెరికన్ ఓపెన్‌లో హనా మాండ్లికోవా చేతిలో ఓడిపోయింది.
  • 1986: 1986లో వింబుల్డన్ టైటిల్‌ను హనా మాండ్లికోవాను ఓడించి సాధించగా, అమరికన్ ఓపెన్‌లో హెలీనా సుకోవాను ఓడించింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో మాత్రం క్రిస్ ఎవర్ట్‌పై ఫైనల్లో ఓడిపోయింది.
  • 1987: ఈ ఏడాది మొత్తం నాలుగు గ్రాండ్‌స్లాం ఫైనల్స్ లోకి ప్రవేశించి రెండింటిలో విజయం సాధించింది. వింబుల్డన్, అమెరికన్ ఓపెన్‌ ఫైనల్లో స్టెఫీ గ్రాఫ్ను ఓడించి టైటిల్ పొందగా, ఫ్రెంచ్ ఓపెన్‌లో స్టెఫీగ్రాఫ్ చేతిలో ఫైనల్లో పరాజయం పాలైంది. ఆస్త్రేలియన్ ఓపెన్‌లో హనా మాండ్లికోవా చేతిలో ఫైనల్లో ఓడిపోయింది.
  • 1988: 1988 నుంచి మార్టినా ఆటతీరు ఆశాజనకంగా లేదు. ఈ ఏడాది కేవలం ఒకే ఒక్క గ్రాండ్‌స్లాం (వింబుల్డన్) ఫైనల్లో ప్రవేశించి స్టెఫీ గ్రాఫ్ చేతిలో ఫైనల్లో ఓడిపోయింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీస్ వరకు మాత్రమే వెళ్ళగా, ఫ్రెంచ్ ఓపెన్‌లో 4వ రౌండ్‌లోనే నిష్క్రమించింది. అమెరికన్ ఓపెన్‌లో కూడా క్వార్టర్ ఫైనల్స్ వరకు మాత్రమే వెళ్ళగలిగింది.
  • 1989: 1989లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్స్‌లో నిష్క్రమించింది. వింబుల్డన్, అమరికన్ ఓపెన్‌లలో ఫైనల్స్ వరకు ప్రవేశించి స్టెఫీగ్రాఫ్ చేతిలో పరాజయం పొందినది.
  • 1990: రెండు సంవత్సరాల మళ్ళి 1990లో గ్రాండ్‌స్లాం టైటిల్ విజయం పొందినది. ఇది ఆమెకు వింబుల్డన్‌లో రికార్డు స్థాయిలో తొమ్మిదవ టైటిల్. వింబుల్డన్‌లో జినా గారిసన్‌పై గెలిచినదే ఆమె క్రీడాజీవితపు చిట్టచివరి గ్రాండ్‌స్లాం టైటిల్. అమెరికన్ ఓపెన్‌లో 4వ రౌండ్‌లోనే నిష్క్రమించింది.
  • 1991: ఈ ఏడాది వింబుల్డన్‌లో క్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించగా అమెరికన్ ఓపెన్‌లో ఫైనల్స్ లోకి ప్రవేశించి మోనికా సెలెస్ చేతిలో పరాజయం పొందినది.
  • 1992: ఈ ఏడాది వింబుల్డన్‌లో సెమీస్ వరకు, అమెరికన్ ఓపెన్‌లో రెండో రౌండ్ వరకు మాత్రమే ప్రవేశించగలిగింది.
  • 1993: 1993లో కూడా వింబుల్డన్‌లో సెమీస్ వరకు ప్రవేశించగా, అమెరికన్ ఓపెన్‌లో 4వ రౌండ్ వరకు చేరింది.
  • 1994: ప్ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించగా, వింబుల్డన్‌లో రికార్డు స్థాయిలో 12వ సారి ఫైనల్లోకి ప్రవేశించింది. ఫైనల్లో కొంచితా మార్టినేజ్ చేతిలో పరాజయం పాలైంది. ఇదే ఆమెకు చిట్టచివరి సింగిల్స్ ఫైనల్ మ్యాచ్.
  • 1995: 1995 నుంచి 2003 వరకు గ్రాండ్ స్లాంలలో ఆడలేదు.
  • 2004: ఈ ఏడాది మళ్ళీ టెన్నిస్ రాకెట్ చేతపట్టిననూ ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలిరౌండ్ లోనూ, వింబుల్డన్‌లో రెండో రౌండ్ లోనూ నిష్రమించింది. ఆ తరువాత మళ్ళీ గ్రాండ్‌స్లాం టోర్నమెంట్లలో పాల్గొనలేదు.

సాధించిన వింబుల్డన్ టైటిళ్ళు

మార్చు
సంవత్సర< చాంపియన్‌షిప్ ఫైనల్లో ప్రత్యర్థి స్కోరు
1978 వింబుల్డన్ టోర్నమెంట్   క్రిస్ ఎవర్ట్ 2–6, 6–4, 7–5
1979 వింబుల్డన్ టోర్నమెంట్ (2వ సారి)   క్రిస్ ఎవర్ట్ 6–4, 6–4
1981 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్   క్రిస్ ఎవర్ట్ 6–7 (4), 6–4, 7–5
1982 ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్   ఆండ్రూ జీగర్ 7–6 (6), 6–1
1982 వింబుల్డన్ టోర్నమెంట్ (3వ సారి)   క్రిస్ ఎవర్ట్ 6–1, 3–6, 6–2
1983 వింబుల్డన్ టోర్నమెంట్ (4వ సారి)   ఆండ్రూ జీగర్ 6–0, 6–3
1983 అమెరికన్ ఓపెన్ టెన్నిస్   క్రిస్ ఎవర్ట్ 6–1, 6–3
1983 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ (2వ సారి)   కాథీ జోర్డాన్ 6–2, 7–6 (5)
1984 ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ (2వ సారి)   క్రిస్ ఎవర్ట్ 6–3, 6–1
1984 వింబుల్డన్ టోర్నమెంట్ (5వ సారి)   క్రిస్ ఎవర్ట్ 7–6 (5), 6–2
1984 అమెరికన్ ఓపెన్ టెన్నిస్ (2వ సారి)   క్రిస్ ఎవర్ట్ 4–6, 6–4, 6–4
1985 వింబుల్డన్ టోర్నమెంట్ (6వ సారి)   క్రిస్ ఎవర్ట్ 4–6, 6–3, 6–2
1985 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ (3వ సారి)   క్రిస్ ఎవర్ట్ 6–2, 4–6, 6–2
1986 వింబుల్డన్ టోర్నమెంట్ (7వ సారి)   హనా మాండ్లికోవా 7–6 (1), 6–3
1986 అమెరికన్ ఓపెన్ టెన్నిస్ (3వ సారి)   హెలీనా సుకోవా 6–3, 6–2
1987 వింబుల్డన్ టోర్నమెంట్ (8వ సారి)   స్టెఫీగ్రాఫ్ 7–5, 6–3
1987 అమెరికన్ ఓపెన్ టెన్నిస్ (4వ సారి)   స్టెఫీగ్రాఫ్ 7–6 (4), 6–1
1990 వింబుల్డన్ టోర్నమెంట్ (9వ సారి)   జినా గారిసన్ 6–4, 6–1

మూలాలు

మార్చు
  1. "Exclusive Interview with Steve Flink about the career of Chris Evert". ChrisEvert.net. Retrieved 2007-02-14.

ఇతర లింకులు

మార్చు